subhiksha
-
చదువుకున్న సముద్రపు చేప
బావుల్లో ఉండిపోతారు కొందరు. తెలిసిన కుంటల్లోనే మునకలేస్తారు కొందరు.మహా అయితే చెరువు గురించి ఆలోచిస్తారు కొందరు.కాని అతి కొందరు మాత్రమేసముద్రాన్ని జయించాలనుకుంటారు. వృత్తిరీత్యా బెస్త కుటుంబంలో పుట్టిన సుభిక్ష ఇంగ్లిష్ లిటరేచర్ చదివి నగరంలో ఉద్యోగం చేసినాఎందుకు తన వృత్తిలోనే రాణించకూడదు అని ఆలోచించింది. అంతే... తానే చేపల వేటలో దిగి ‘సీఫుడ్ అంట్రప్రెన్యూర్’గా దేశాన్ని ఆకర్షిస్తోంది.సముద్రానికి కెరటాలతో అదిలించడం తెలుసు. వలల కొద్ధి చేపల్ని నింపి సిరులను అందించడం కూడా తెలుసు. ‘సముద్రం తల్లిలాంటిదే. మమకారం, కోపం రెండూ ఉంటాయి. భయభక్తులతో ఉంటే ఏది అడిగినా కాదనకుండా ఇస్తుంది’ అంటుంది సుభిక్ష. ఈ 23 ఏళ్ల అమ్మాయి తమిళనాడులోని తూత్తుకూడి సమీపంలో ఉన్న పెరియతలై అనే బెస్తపల్లె నుంచి ఇవాళ దేశాన్ని ఆకర్షిస్తోంది. మగవాళ్లకే పరిమితమైన చేపలు పట్టే విద్యలో ఆ అమ్మాయి రాణించడమే కాదు తన చదువును ఆ విద్యకు జత చేసి ఆదాయ మార్గాలను నిర్మిస్తోంది.ఒడ్డు నుంచి సముద్రానికి...మగవాళ్లు చేపలు పడతారు. వాటిని స్త్రీలు గట్టున కూచుని అమ్ముతారు. ఇదే ఆనవాయితీ. తరాలుగా ఇదే సాగుతోంది. సుభిక్ష తండ్రి కుమార్, అన్న లియాండర్ కూడా వాళ్లింట్లో సముద్రం మీద వేటకు వెళ్లి చేపలు తెస్తారు. తల్లి వాటి అమ్మకంలో సాయం చేస్తుంది. ‘నేనెందుకు చేపలు పట్టడానికి మీతో రాకూడదు?’ అని అడిగింది సుభిక్ష ఒకరోజు తండ్రిని. తండ్రి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే సుభిక్ష ఇంగ్లిష్ లిటరేచర్ చదివింది. ప్రయివేట్ బ్యాంకులో ఉద్యోగం కూడా చేస్తోంది. ఆడపిల్ల సౌకర్యంగా బతకాలంటే ఆమెలాంటి మార్గమే అందరూ సూచిస్తారు. ‘సముద్రంలో ఎంతో ఉంది. టెన్ టు ఫైవ్ జాబ్‌లో ఏముంది? నన్నొక ప్రయత్నం చేయనివ్వు నాన్నా’ అంది సుభిక్ష. అప్పటికే ఆ అమ్మాయికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉంది. మత్స్యకారుల జీవనాన్ని సరదాగా వీడియోల్లో చూపేది సుభిక్ష. ఇప్పుడు ఆ అమ్మాయి సిసలైన బెస్త జీవనంలోకి దిగింది.సముద్రంతో చెలగాటం...‘కోరమాండల్ తీరంలో సముద్రంతో దిగడం అంటేప్రాణాలతో చెలగాటమే’ అన్నాడు సుభిక్ష తండ్రి చివరకు ఒప్పుకుంటూ. మొదటిసారి తండ్రి, అన్నతో కలిసి ఫైబర్ బోట్లో చేపల వేటకు సుభిక్ష వెళ్లిన అనుభవం గగుర్పాటుకు గురి చేసేదే. ‘ఆకాశంలో చుక్కలు తప్ప వేరే ఏమీ కనిపించని చీకటి. పడవను కుదురుగా ఉంచకుండా ఎత్తెత్తి వేసే సముద్రం. మేము దాదాపు 20 కిలోమీటర్ల లోపలికి వెళ్లాం. అక్కడ ఏమైనా జరగొచ్చు. కాని ఆ సమయంలో చేపల వేటకు వెళ్లి వల విసరడం గొప్ప అనుభవం’ అంది సుభిక్ష. ఆ రోజు నుంచి నేటి వరకు అనేకసార్లు రాత్రి 1 గంటకు వేటకు వెళ్లి ఉదయం 10 గంటలకు తిరిగి రావడం సుభిక్షకు అలవాటుగా మారింది. ‘చేపలు పట్టడానికి ఏయే వలలు వాడాలి... ఏ వల వేస్తే ఏ రకం చేపలు పడతాయనేది తెలుసుకున్నాను. ఇంకా పల్లెపల్లెకు తిరిగి చేపల వేటలో మా పూర్వికుల అనుభవం తెలుసుకుంటున్నాను’ అంటుంది సుభిక్ష. ఆమె తన వేటను మొదలెట్టాక అదంతా వీడియోలు చేసేసరికి ప్రపంచానికి తెలిసిపోయింది.పెరిగిన వ్యాపారంచేపలు పడితే టోకున ఎక్స్‌పోర్టర్లకు అమ్మడం లేదా లోకల్‌గా అమ్మడం లేదా ఎండబెట్టి అమ్మడం తెలిసిన సంప్రదాయ పద్ధతికి భిన్నంగా సుభిక్ష తమ చేపలను ఊరగాయలుగా, పచ్చళ్లు, ఎండు చేపలుగా మార్చి వాటిని తన లేబుల్ కింద అమ్మకానికి పెట్టింది. సోషల్ మీడియా వల్ల వాటిని దేశ విదేశాల్లో కొంటున్నారు. అలా మెల్లగా సుభిక్ష ‘సీఫుడ్ అంట్రప్రెన్యుర్’గా మారింది. తండ్రి, అన్న ఈ పరిణామాలను స్వాగతిస్తున్నారు. ఊళ్లో అందరూ సుభిక్షను మెచ్చుకోలుతో చూస్తున్నారు. ‘చేపలంటేప్రొటీన్తో నిండిన రిచ్‌ఫుడ్. ప్రజలకు ఆ ఫుడ్‌ను అందించడానికి బెస్తలు ఎంత కష్టం చేస్తారో... ప్రమాదంలోకి వెళతారో లోకానికి చూపడమే నా లక్ష్యం. అలాగే మత్స్యకార స్త్రీలను మరింత ముందుకు తీసుకు వెళ్లడం కూడా’ అంటోంది సుభిక్ష. ఒకవైపు ఈ పని చేస్తూనే మరోవైపు మోడల్‌గా కూడా పని చేస్తోంది. సంప్రదాయ విద్యలని గౌరవిస్తూ ఆధునిక ధోరణులను పుణికి పుచ్చుకుంటూ ముందుకు సాగితే విజయం తథ్యం అని నిరూపించింది సుభిక్ష. -
హీరోయిన్ గొప్ప మనసు.. ప్రతివారం ఆ పని కచ్చితంగా చేస్తుందట!
అన్ని దానాల్లోకి అన్నదానం మిన్న అంటారు. అలాంటి దానమే చేస్తోంది యువ నటి సుభిక్ష. కోట్లలో డబ్బు కూడపెట్టిన చాలామంది కథానాయికలు పుణ్యం కోసమో, పాపం- దోషం పరిహారాల కోసమో గుళ్లు, గోపురాలు తిరుగుతుంటారు. అయితే కొందరు దయాగుణంతో పేదలకు, అనాథలకు సాయం చేస్తుంటారు. కరోనా కాలంలో చాలామంది తారలు వారి ఆకలి దప్పికలను తీర్చారు. తాజాగా వర్ధమాన నటి సుభిక్ష వారానికోసారి తను నివసిస్తున్న వీధిలోని అనాథలకు అన్నదానం చేస్తోంది. తమిళంలో కడుగు, గోలీసోడా 2, పొదు నలన్ కరుది, నేత్ర, వేట్టై నాయ్, కన్నై నంబాదే తదితర చిత్రాల్లో నటించిన సుభిక్ష, తాజాగా చంద్రముఖి–2 చిత్రంలో చాలా కీలకపాత్రను పోషించింది. తాజాగా ఈమె మాట్లాడుతూ.. చంద్రముఖి వంటి చిత్రాల్లో నటించాలన్నది తన కల అని పేర్కొంది. అది చంద్రముఖి– 2 చిత్రంతో అది నెరవేరిందని, ఇందులో చాలా ధైర్యం కలిగిన యువతిగా నటించినట్లు చెప్పింది. ప్రస్తుతం తమిళం తెలుగు భాషల్లో కొత్త చిత్రాల్లో నటించబోతున్నట్లు తెలిపింది. తనకు సామాజిక సేవ అంటే ఇష్టమని, అందులో భాగంగా తన ఇంటి సమీపంలోని అనాథలకు ప్రతివారం అన్నదానం చేస్తున్నట్లు చెప్పింది. తాను షూటింగ్ కొరకు ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు తన తల్లి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని వెల్లడించింది. ఈ సేవను మరింతగా విస్తరింపజేయాలన్నదే తన కోరిక అని పేర్కొంది. View this post on Instagram A post shared by Wikki Talks (@wikkitalks_official) చదవండి: ఆ సినిమాకు రీమేక్‌నే సలార్.. మ్యూజిక్ డైరెక్టర్ వ్యాఖ్యలు వైరల్ -
ఎట్టకేలకు రిలీజ్‌కు రెడీ అయిన వరలక్ష్మి శరత్ కుమార్ ‘కన్ని దీవు’
సాక్షి, చెన్నై: ‘కన్ని దీవు’ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. నటి వరలక్ష్మీ శరత్ కుమార్, సుభిక్ష, ఐశ్వర్య దత్త, ఆస్నా దేవేరి తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ఇది. సుందర్ బాలు దర్శకత్వంలో కృతిక ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజ్ ప్రతాప్ సంగీతాన్ని అందించారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఉత్తర చెన్నై ప్రాంతంలోలోని ఓ హౌసింగ్ బోర్డులో నివశించే నలుగురు యువతుల ఇతివృత్తంతో రూపొందించిన యాక్షన్ కథా చిత్రంగా ఇది ఉంటుందన్నారు. త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్న ఈ చిత్రంలోని ‘పోరాడి వా’ అనే సింగిల్ సాంగ్‌ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వస్తోందని తెలిపారు. -
ప్రకృతి సేద్యంతో ఆరోగ్యం, ఆదాయం!
ప్రకృతిని, శ్రమను నమ్ముకుంటే చిన్న కమతాలున్న రైతు కుటుంబాలు సైతం సుభిక్షంగా ఉంటాయనడానికి ప్రబల నిదర్శనం రజితారెడ్డి, రాజేందర్‌రెడ్డి రైతు దంపతులు. రసాయనాల్లేకుండా పంటలు పండించడం నికరాదాయం పెంచుకోవడం కోసం మాత్రమే కాదని.. కుటుంబ ఆరోగ్యం మెరుగుపరచుకోవడానికీ ఇదే రాజమార్గమని వీరి అనుభవం రుజువు చేస్తోంది. నీటి వనరులు తక్కువగా ఉన్న నేపథ్యంలో వరిని ఆరుతడి పద్ధతిలో సాగు చేస్తున్నారు. కూరగాయ పంటలతో పాటు పాడిపై కూడా ఆధార పడుతూ నిరంతర ఆదాయం పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. వాకిటి రజితారెడ్డి, రాజేందర్‌రెడ్డి దంపతులది సాధారణ రైతు కుటుంబం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తమ్మలోనిభావి వారి స్వగ్రామం. ఏడో తరగతి వరకు చదువుకున్న వీరికి వ్యవసాయమే జీవనాధారం. నాలుగేళ్ల క్రితం వరకు రసాయనిక వ్యవసాయం చేస్తూ చీడపీడలు, ఎరువుల ఖర్చులతో కుదేలయ్యారు. ఈ నేపథ్యంలో రజితారెడ్డి చొరవతో సొంత భూమిలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిని అనుసరిస్తున్నారు. బంధువు ఒకరు సుభాష్ పాలేకర్ పుస్తకం తెచ్చి ఇచ్చిన తర్వాత దగ్గర్లోని ప్రకృతి వ్యవసాయదారుడు పిసాతి సత్తిరెడ్డి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. ఆ స్ఫూర్తితో పాలేకర్ శిక్షణా తరగతులకు హాజరై రజితారెడ్డి గత నాలుగేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. వరి, కూరగాయలు వంటి ఆహార పంటలను సాగు చేస్తూ.. జీవామృతం, కషాయాలను స్వయంగా తామే తయారు చేసుకొని వాడుతూ.. తక్కువ ఖర్చుతోనే సంతృప్తికరమైన ఫలితాలు సాధిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. ఒకరు డిగ్రీ చదువుతుండగా, మరొకరు ఏకలవ్య సేంద్రియ వ్యవసాయ కళాశాలలో అగ్రికల్చర్ డిప్లొమా రెండో సంవత్సరం చదువుతున్నారు. ఇటు పాడి.. అటు పంట.. వీరికి 4 ఎకరాల సొంత భూమి ఉంది. ఈ ఏడాది ఎకరంలో వరి, అరెకరంలో టమాటా, అరెకరంలో సొర, బీర సాగు చేస్తున్నారు. పంటలతోపాటు పాడి పశువుల పెంపకంపై కూడా దృష్టిపెట్టడం విశేషం. వీరికి ప్రస్తుతం ఐదు గేదెలు, ఒక ఆవు ఉన్నాయి. రెండెకరాల్లో పశువులకు మేత సాగు చేస్తున్నారు. ప్రస్తుతం రోజుకు 7–8 లీటర్ల పాలు లీటరు రూ. 38 చొప్పున విక్రయిస్తున్నారు. పశువుల పేడ దిబ్బపై ద్రవజీవామృతం చల్లితే.. నెల రోజుల్లో పశువుల ఎరువు మెత్తని ఎరువుగా మారుతుంది. ఆ ఎరువును సాగుకు ముందు ఎకరానికి ఒకటి, రెండు ట్రాక్టర్లు వేస్తున్నారు. ఈ ఏడాది 6 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని పాక్షికంగా సేంద్రియ పద్ధతిలో పత్తిని సాగు చేస్తున్నారు. సొంత ట్రాక్టరుతోనే రాజేందర్‌రెడ్డి తమ పొలాలను దున్నుకుంటారు. బీజామృతం, జీవామృతంతోపాటు వేపగింజల కషాయం, బ్రహ్మాస్త్రం, అగ్ని అస్త్రం వంటి కషాయాలను కూడా రజితారెడ్డి స్వయంగా తయారు చేసుకొని పంటలకు వాడుతున్నారు. దంపతులు వ్యవసాయ పనులు స్వయంగా చేసుకోవడంతో ఖర్చు బాగా తగ్గింది. తమ ఆరోగ్యం, భూమి ఆరోగ్యం మెరుగవడమే కాక నికర ఆదాయం పెరిగిందని ఆమె తెలిపారు. నీటి గుంటతో వాన నీటి సంరక్షణ రజిత– రాజేందర్‌రెడ్డి తమ ఎర్ర నేలలో బోర్లపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. వర్షాలు సరిగ్గా కురవని ప్రాంతం కావడంతో వాననీటి సంరక్షణపై దృష్టి పెట్టారు. ఉపాధి హామీ పథకంలో నీటి కుంట తవ్వుకున్నారు. వాన నీరు తమ భూమిలో నుంచి బయటకు పోకుండా కట్టడి చేసుకున్నారు. దీని వల్ల ఈ ఏడాది వర్షాలు తక్కువగా ఉన్నప్పటికీ ప్రస్తుతం తమ బోర్లు బాగానే పోస్తున్నాయని రజితారెడ్డి తెలిపారు. ఈ ఏడాది ఎండాకాలం తర్వాత సరైన వర్షాలు పడకపోవడం వల్ల కరువు పరిస్థితులు నెలకొంటున్నాయని ఆమె తెలిపారు. ఉపాధి హామీ ప«థకం కింద వచ్చే జనవరిలో పంట భూమిలో వాలుకు అడ్డంగా 50 మీటర్లకు ఒక వరుస చొప్పున కందకాలు తవ్వించుకోవాలని అనుకుంటున్నామన్నారు. ఆరుతడి పద్ధతిలో వరిసాగు నీటి వనరులు తక్కువగా ఉన్న నేపథ్యంలో.. ఎకరం భూమిలో ఆరుతడి పద్ధతిలో వరిని సాగు చేస్తున్నట్లు రజితారెడ్డి తెలిపారు. పొలాన్ని 3 భాగాలుగా చేసి ఒక్కో రోజు ఒక్కో భాగానికి నీరు పెడుతున్నామన్నారు. బీజామృతంతో విత్తన శుద్ధి చేసి తమ సొంత తెలంగాణ సోన రకం విత్తనాలు వినియోగిస్తారు. నారు 15–20 రోజుల వయసులో 20 లీటర్ల నీటి ట్యాంకుకు 30 ఎం.ఎల్. వేప గింజల కషాయం, లీటరు ఆవు మూత్రం కలిపి పిచికారీ చేస్తారు. నాటేసిన తర్వాత 20 రోజులకోసారి కనీసం 4 సార్లు జీవామృతం బోరు నీటితోపాటు పారగడతారు. నెల లోపు వేపగింజల కషాయం చల్లుతారు. ఏవైనా తెగుళ్లు కనిపిస్తే బ్రహ్మాస్త్రం, అగ్ని అస్త్రం పిచికారీ చేస్తారు. 15 రోజులకోసారి.. అమావాస్య, పౌర్ణమిలకు 3 రోజులు ముందు నుంచి.. వరుసగా రెండు, మూడు రోజుల పాటు పొలం గట్లపై సాయంత్ర వేళల్లో పిడకలతో మంటలు వేస్తారు. ఆ బూడిదను కూరగాయ పంటలపై చల్లుతారు. దీని వల్ల శత్రుపురుగులు నశించి, పంటలకు చీడపీడల బెడద తక్కువగా ఉంటున్నదని ఆమె తెలిపారు. 50% ఎక్కువగా నికరాదాయం రసాయనిక పద్ధతిలో వరి సాగు చేసిన రైతులతో పోల్చితే సాగు వ్యయం ఎకరానికి తమకు రూ. 5–6 వేలు తక్కువని, నికరాదాయం 50% ఎక్కువని రజితారెడ్డి తెలిపారు. గత మూడేళ్లుగా తమకు ఎకరానికి 35 బస్తాల ధాన్యం పండుతున్నదని, తామే మరపట్టించి బియ్యం అమ్ముతున్నామన్నారు. 15 క్వింటాళ్ల వరకు బియ్యం వస్తున్నాయన్నారు. క్వింటాలు సగటున రూ. 5 వేల చొప్పున రూ. 75 వేలకు తగ్గకుండా ఆదాయం వస్తున్నదన్నారు. రసాయనిక వ్యవసాయం చేసే రైతులకు ఎకరానికి రూ. 50–56 వేల వరకు ఆదాయం వస్తుందన్నారు. అందులోనూ, వారికి ఖర్చు కూడా తమకన్నా ఎక్కువ కావడంతో.. తమతో పోల్చితే వారికి నికరాదాయం తక్కువగా ఉంటుందన్నారు. కూరగాయల ధర కిలో రూ. 30‡ స్థానికంగా సేంద్రియ హోటల్ నిర్వాహకుల అవసరాలకు అనుగుణంగా టమాటా, సొర, బీర పంటలను ఎకరంలో సాగు చేస్తున్నామని రజితారెడ్డి తెలిపారు. మార్కెట్ ధర ఎట్లా ఉన్నా.. ఏ సీజన్లోనైనా సొర కాయలకు రూ. 10–12 చొప్పున, బీర, టమాటాలకు కిలోకు రూ. 30 ధర చెల్లిస్తున్నారన్నారు. అడవి పందుల బెడద ఉండటం వల్ల వేరుశనగ తాము సాగు చేయటం లేదని ఆమె వివరించారు. నీటి కొరత సమస్య వల్ల కూరగాయ పంటల్లో మంచి దిగుబడులు తీయలేకపోతున్నామని, తమకు మార్కెటింగ్ సమస్య లేదన్నారు. – ముత్యాల హన్మంతరెడ్డి, సాక్షి, చౌటుప్పల్, యాదాద్రి భువనగిరి జిల్లా కొందరు రైతులు అనుసరిస్తున్నారు! ప్రకృతి వ్యవసాయం ప్రారంభించిన నాలుగేళ్లలో మొదట మా కుటుంబం ఆరోగ్యం బాగుపడింది. రసాయనిక అవశేషాల్లేని ఆహారం తినటం వల్ల అంతకుముందున్న ఆరోగ్య సమస్యలు పోయాయి. భూసారం పెరిగింది. పర్యావరణాన్ని కాపాడుతున్నామన్న సంతృప్తి ఉంది. వరిని అతి తక్కువ నీటితో ఆరుతడి పద్ధతిలో సాగు చేయగలుగుతున్నాం. ఆరోగ్యదాయకమైన కూరగాయలు పండిస్తున్నాం. ప్రభుత్వం నుంచి ఉత్తమ రైతు అవార్డు రెండు సార్లు అందుకోవడం సంతోషంగా ఉంది. మమ్మల్ని చూసి నలుగురైదుగురు రైతులు ఇంట్లో తాము తినడానికి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పంటలు పండించుకోవడం ప్రారంభించడం మరింత సంతోషంగా ఉంది. మా వంటి చిన్న, సన్నకారు సేంద్రియ రైతులకు ప్రభుత్వం బ్యాంకు రుణాలను షరతులు లేకుండా ఇవ్వాలి. ప్రత్యేక రైతు బజార్లను ఏర్పాటు చేయాలి. – వాకిటి రజితారెడ్డి(99491 42122), తమ్మలోనిభావి, చౌటుప్పల్ మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా కషాయం తయారు చేస్తున్న రజిత రజిత పొలంలో బీర తోట వరి పొలాన్ని పరిశీలిస్తున్న రజిత డ్రిప్‌తో సాగవుతున్న టమాటా తోట -
సుభిక్ష ఫౌండర్ సుబ్రమణియన్ అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ : మనీలాండరింగ్ కేసులో సుభిక్ష రిటైల్ స్టోర్స్, విశ్వప్రియ ఫైనాన్షియల్ సర్వీసెస్ వ్యవస్థాపకుడు ఆర్ సుబ్రమణియన్‌ను ఈడీ ఆరెస్ట్ చేసింది. డిపాజిటర్లను వందల కోట్ల రూపాయల మేర మోసం చేసిన ఆరోపణలపై బుధవారం ఇతణ్ణి అరెస్ట్ చేసింది. బ్యాంకులకు, ఇతర పెట్టుబడిదారులకు భారీ ఎత్తున రుణాలను ఎగవేసిన ఆరోపణలు, వివిధ న్యాయస్థానాలలో చట్టపరమైన కేసులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈడీ తాజాగా ఈ చర్యకు దిగింది. సుబ్రమణియన్ 250 కోట్ల రూపాయల మేర డిపాజిటర్లను మోసగించడంతోపాటు, సుమారు రూ. 750 కోట్లకు 13 బ్యాంకులకు టోకరా వేశాడు. ఈ నేపథ్యంలో 2013లోనే ఈయనపై అనేక క్రిమినల్, సివిల్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసు విచారణలో భాగంగా సుమారు 10 ఎకరాల నాలుగు వ్యవసాయ భూములను, రెండు ఇతర ఖాళీ ప్లాట్లను మోసపూరితంగా తన గ్రూప్ కంపెనీకి మార్చుకున్నాడనీ ఈడీ తేల్చింది. వీటితోపాటు అతని భార్య పేరుతో ఉన్న మరో రెండు ప్లాట్లను కూడా ఈడీ ఇప్పటికే ఎటాచ్ చేసింది. కాగా 1991లో విశ్వప్రియ ఫైనాన్షియల్ సర్వీసెస్‌ను ప్రారంభించారు. దీని ద్వారా భారీ ఎత్తున డిపాజిట్లు సమీకరించారు. తద్వారా దాదాపు 49 వ్యాపారాలు ప్రారంభించాడు. ఇందులో సుభిక్ష సూపర్ మార్కెట్ చెయిన్ ఒకటి. 1997 లో చెన్నైలో మొట్టమొదటి రిటైల్ స్టోర్‌ను ఏర్పాటు చేశాడు. దేశవ్యాప్తంగా స్టోర్ల ఏర్పాటు కోసం మోసపూరిత నిధులను దారి మళ్ళించిన ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో 2002లో మనీ లాండరింగ్ చట్టం నిబంధనల ప్రకారం ఈడీ విచారణ చేపట్టింది. ఈ వివాదంతో 2009లో సుభిక్షకు చెందిన 1,600 రిటైల్ షాపులు మూతపడ్డాయి. ఐఐటి, ఐఐఎంలో చదువుకున్న సుబ్రమణియన్ గోల్డ్ మెడల్ సాధించారు. అలాగే సిటీ బ్యాంకు, ఎన్ఫీల్డ్ ఇండియా వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో పని చేశారు. -
సీమతన్నీ మొదలైంది!
తమిళసినిమా: సీమతన్నీ చిత్రం ఆదివారం ఉదయం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. విదార్థ్, విజయ్‌వసంత్ కథానాయకులుగా నటిస్తున్న చిత్రం సీమతన్నీ. వా రికి జంటగా చాందిని, సుభిక్ష నాయికలుగా నటిస్తున్న ఇందులో యోగిబా బు, హలో కందస్వామి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గ్రేట్ ఎంపరర్ ప్రొడక్షన్ పతాకంపై సి.ప్రేమ్‌కుమార్ భా రీ బడ్జెట్లో నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వా రా విజయ్‌మోహన్ దర్శకుడిగా పరి చయం అవుతున్నారు. ఈయన కథ, కథనం, మాటలు దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రం వివరాలను తెలుపుతూ ఒక రేషన్ షాప్‌నే సొంత ఇల్లుగా భావించి జీవిస్తున్న ఇద్దరు అనాథమిత్రులు, 10 ఇళ్లల్లో పనిచేసుకుని జీవించే తంగమారి అనే ఒక యువతి జీవి తాలను ఆవిష్కరించే చిత్రంగా సీమతన్నీ ఉంటుందన్నారు. ఇందులో మలర్వళీగా నటి చాం దిని పాత్ర కీలకంగా ఉంటుందన్నారు. దర్శకుడు సర్గుణం అతిథిగా విచ్చేసి క్లాప్‌కొట్టి చిత్రాన్ని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. దీనికి తిరుమూర్తి సంగీతాన్ని, మంజల్ చిత్రం తరువాత మాసాని ఈ చిత్రానికి ఛాయాగ్రహణం అందిస్తున్నారని ఆయన చెప్పారు.