
సాక్షి, చెన్నై: ‘కన్ని దీవు’ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. నటి వరలక్ష్మీ శరత్ కుమార్, సుభిక్ష, ఐశ్వర్య దత్త, ఆస్నా దేవేరి తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ఇది. సుందర్ బాలు దర్శకత్వంలో కృతిక ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజ్ ప్రతాప్ సంగీతాన్ని అందించారు.
చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఉత్తర చెన్నై ప్రాంతంలోలోని ఓ హౌసింగ్ బోర్డులో నివశించే నలుగురు యువతుల ఇతివృత్తంతో రూపొందించిన యాక్షన్ కథా చిత్రంగా ఇది ఉంటుందన్నారు. త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్న ఈ చిత్రంలోని ‘పోరాడి వా’ అనే సింగిల్ సాంగ్‌ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వస్తోందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment