హీరోయిన్‌ గొప్ప మనసు.. ప్రతివారం ఆ పని కచ్చితంగా చేస్తుందట! | Actress Subiksha Provide Free Food To Orphans Every Week, Comments On Chandramukhi 2 Viral - Sakshi
Sakshi News home page

Subiksha: ప్రతివారం ఆ పని చేయకపోతే మనసు ఊరుకోదంటున్న చంద్రముఖి 2 నటి

Oct 2 2023 10:13 AM | Updated on Oct 2 2023 3:37 PM

Actress Subiksha Provide Free Food to Orphans Every Week - Sakshi

తనకు సామాజిక సేవ అంటే ఇష్టమని, అందులో భాగంగా తన ఇంటి సమీపంలోని అనాథలకు ప్రతివారం అన్నదానం చేస్తున్నట్లు చెప్పింది. తాను షూటింగ్‌ కొరకు ఇతర ప్రాంతా

అన్ని దానాల్లోకి అన్నదానం మిన్న అంటారు. అలాంటి దానమే చేస్తోంది యువ నటి సుభిక్ష. కోట్లలో డబ్బు కూడపెట్టిన చాలామంది కథానాయికలు పుణ్యం కోసమో, పాపం- దోషం పరిహారాల కోసమో గుళ్లు, గోపురాలు తిరుగుతుంటారు. అయితే కొందరు దయాగుణంతో పేదలకు, అనాథలకు సాయం చేస్తుంటారు. కరోనా కాలంలో చాలామంది తారలు వారి ఆకలి దప్పికలను తీర్చారు.

తాజాగా వర్ధమాన నటి సుభిక్ష వారానికోసారి తను నివసిస్తున్న వీధిలోని అనాథలకు అన్నదానం చేస్తోంది. తమిళంలో కడుగు, గోలీసోడా 2, పొదు నలన్‌ కరుది, నేత్ర, వేట్టై నాయ్‌, కన్నై నంబాదే తదితర చిత్రాల్లో నటించిన సుభిక్ష, తాజాగా చంద్రముఖి–2 చిత్రంలో చాలా కీలకపాత్రను పోషించింది. తాజాగా ఈమె మాట్లాడుతూ.. చంద్రముఖి వంటి చిత్రాల్లో నటించాలన్నది తన కల అని పేర్కొంది.

అది చంద్రముఖి– 2 చిత్రంతో అది నెరవేరిందని, ఇందులో చాలా ధైర్యం కలిగిన యువతిగా నటించినట్లు చెప్పింది. ప్రస్తుతం తమిళం తెలుగు భాషల్లో కొత్త చిత్రాల్లో నటించబోతున్నట్లు తెలిపింది. తనకు సామాజిక సేవ అంటే ఇష్టమని, అందులో భాగంగా తన ఇంటి సమీపంలోని అనాథలకు ప్రతివారం అన్నదానం చేస్తున్నట్లు చెప్పింది. తాను షూటింగ్‌ కొరకు ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు తన తల్లి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని వెల్లడించింది. ఈ సేవను మరింతగా విస్తరింపజేయాలన్నదే తన కోరిక అని పేర్కొంది.

చదవండి: ఆ సినిమాకు రీమేక్‌నే సలార్‌.. మ్యూజిక్‌ డైరెక్టర్‌ వ్యాఖ్యలు వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement