Vidharth
-
జ్యోతికతో విదార్థ్..
తమిళసినిమా: నటి జ్యోతిక నటిస్తున్నారంటే ఆ చిత్రంలో ఆమె పాత్రే ప్రధానంగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలా రీఎంట్రీ తరువాత ఆమె నటించిన 36 వయదినిలే చిత్రంలో నటుడు రఘు భర్తగా సపోర్టింగ్ పాత్రలో నటించారు. ఇక మగళీర్ మట్టుం చిత్రంలో జ్యోతికకు సపోర్ట్‌గా రేవతి, ఊర్వశి నటించారు. ఇటీవల నటించిన నాచియార్ చిత్రంలో జ్యోతిక ప్రాత్రే ప్రధానంగా ఉంటుంది. తాజాగా హిందీలో మంచి విజయాన్ని సాధించిన తుమ్హారి సుళు చిత్ర తమిళ రీమేక్‌లో విద్యాబాలన్ పాత్రలో జ్యోతిక నటించడానికి సిద్ధం అవుతున్నారు. దీనికి రాధామోహన్ దర్శకత్వం వహించనున్నారు. ఇందకు ఈయన దర్శకత్వంలో జ్యోతిక నటించిన మొళి చిత్రం మంచి ప్రశంసలను అందుకుంది. తుమ్హారి సుళు రీమేక్‌లో జ్యోతికకు భర్తగా సపోర్టింగ్ పాత్రలో నటుడు విదార్థ్ నటించడానికి కమిట్ అయ్యారన్నది తాజా సమాచారం. ఇందులో ఇప్పటికే టాలీవుడ్ క్రేజీ నటి మంచులక్ష్మి ముఖ్యపాత్రలో నటించడానికి ఎంపికైన విషయం తెలిసిందే. అదే విధంగా నటుడు ఆర్జే. బాలాజి నటిస్తున్న ఈ చిత్రాన్ని బాఫ్టా మీడియా వర్క్స్ ఇండియా సంస్థ నిర్మించనుంది. త్వరలోనే చిత్ర షూటింగ్ ప్రారంభం కానుందని నిర్వాహకులు తెలిపారు. -
కురంగుబొమ్మైకు ప్రేక్షకాదరణ
తమిళసినిమా: కురంగుబొమ్మై చిత్రాన్ని ప్రేక్షకులకు విశేషంగా ఆదరిస్తున్నారని ఈ చిత్ర యూనిట్ ఆనందాన్ని వ్యక్తం చేసింది. దర్శకుడు భారతీరాజా ప్రధాన పాత్ర పోషించిన చిత్రం కురంగుబొమ్మై. విధార్థ్ హీరోగా నటించిన ఇందులో పీఎల్.తేనప్పన్, కుమరవేల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి నితిలన్ దర్శకుడు. శ్రేయాశ్రీ మూవీస్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం గత శుక్రవారం తెరపైకి వచ్చింది. కాగా చిత్రం మంచి ప్రేక్షకాదరణతో రెండవ వారంలోకి ప్రవేశించిన సందర్భంగా చిత్ర యూనిట్ గురువారం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో సక్సెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా భారతీరాజా మాట్లాడుతూ తన చిత్రాలు ఎన్నో విజయం సాధిం చినా తాను సక్సెస్‌మీట్‌లో కృతజ్ఞతలు చెప్పడం ఇదే తొలిసారి అన్నారు. చిత్ర దర్శకుడు నితిలన్ చిత్ర కథను నడిపించిన తీరు బాగుందన్నారు. అందుకే ఇంతటి విజయాన్ని సాధించిందని పేర్కొన్నారు. అయితే ఈ చిత్రంలో తన నటన పూర్తిగా చూడలేదని, పూర్తి నటనను త్వరలోనే చూస్తారని ఆయన అన్నారు. చిత్ర హీరో విధార్థ్ మాట్లాడుతూ దర్శకుడు భారతీరాజాతో కలిసి నటించడం మంచి అనుభవంగా పేర్కొన్నారు.కురంగుబొమ్మై చిత్రం ప్రేక్షకాదరణ పొంద డం సంతోషంగా ఉన్నా, శుక్రవారం మరిన్ని కొత్త చిత్రాలు విడుదలవడంతో థియేటర్లలో ప్రదర్శన ఆటలను తగ్గించడం బాధాకంగా ఉందన్నారు. ఈ విషయంలో నిర్మాతల మండలి పెద్దలు దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో పీఎల్.తేనప్పన్, దర్శకుడు నితిలన్ పాల్గొన్నారు. -
బైక్ పోగొట్టుకున్న విదార్థ్
తమిళసినిమా: నటుడు విదార్థ్ కొత్తగా మోజు పడి కొనుకున్న బైక్ పోగొట్టుకున్నాడు. ఎలా? ఏమాకథ అంటారా? అది తెలుసుకోవాలంటే వండి చిత్రం వచ్చే వరకూ ఆగాల్సిందే. ఆ వివరాల్లోకెళితే పోయిన తన సైకిల్ కోసం ఓ కుర్రాడు వెతుకుతూ చివరికి వేరే వ్యక్తి సైకిల్ దొంగిలించాల్సిన పరిస్థితికి వస్తాడు. పోయిన అతని సైకిల్ ఏమైందన్న ఇతివృత్తంతో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రం బైస్కిల్ థీవ్స్ అప్పట్లో ప్రపంచ సినీ ప్రేక్షకులను అబ్బుర పరిచింది. ఈ మధ్య తన తండ్రి జీవితాంతం సంపాదించి కూడబెట్టిన డబ్బుతో మోటార్‌బైక్ కొనుకున్న యువకుడిని అప్పటి వరకూ పట్టించుకోని అమ్మాయిలు ప్రేమిం చడం మొదలెడతారు. ఆ యువకుడికి మంచి ఉద్యోగం వస్తుంది. దీంతో జీవితం ఆనందంగా సాగిపోతుంది. అలాంటి పరిíస్థితుల్లో అతని బైక్ చోరీ అవుతుంది. ఇది పొల్లాదవన్ చిత్రం. కాగా ఆ తరహాలో నటుడు విదార్థ్ ముచ్చటపడి కొనుక్కున యమహా బైక్ దొంగతనానికి గురవుతుంది. అది ఏమైందన్న ఇతివృత్తంతో తెరకెక్కిస్తున్న చిత్రం వండి అని ఆ చిత్ర దర్శకుడు రజీష్బాలా తెలిపారు. ఈయన్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ రూబీ ఫిలింస్ పతాకంపై హషీర్ నిర్మిస్తున్న చిత్రం వండి. ఇందులో మోటార్‌బైక్ ఒక పాత్రగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. విదార్థ్కు జంటగా నటి చాందిని నటిస్తున్న ఇందులో శ్రీరామ్ కార్తీక్, ఎంఆర్.కిశోర్‌కుమార్, జాన్‌విజయ్, అరుళ్దాస్, స్వామినాథన్, మదన్‌బాబు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. -
సీమతన్నీ మొదలైంది!
తమిళసినిమా: సీమతన్నీ చిత్రం ఆదివారం ఉదయం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. విదార్థ్, విజయ్‌వసంత్ కథానాయకులుగా నటిస్తున్న చిత్రం సీమతన్నీ. వా రికి జంటగా చాందిని, సుభిక్ష నాయికలుగా నటిస్తున్న ఇందులో యోగిబా బు, హలో కందస్వామి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గ్రేట్ ఎంపరర్ ప్రొడక్షన్ పతాకంపై సి.ప్రేమ్‌కుమార్ భా రీ బడ్జెట్లో నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వా రా విజయ్‌మోహన్ దర్శకుడిగా పరి చయం అవుతున్నారు. ఈయన కథ, కథనం, మాటలు దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రం వివరాలను తెలుపుతూ ఒక రేషన్ షాప్‌నే సొంత ఇల్లుగా భావించి జీవిస్తున్న ఇద్దరు అనాథమిత్రులు, 10 ఇళ్లల్లో పనిచేసుకుని జీవించే తంగమారి అనే ఒక యువతి జీవి తాలను ఆవిష్కరించే చిత్రంగా సీమతన్నీ ఉంటుందన్నారు. ఇందులో మలర్వళీగా నటి చాం దిని పాత్ర కీలకంగా ఉంటుందన్నారు. దర్శకుడు సర్గుణం అతిథిగా విచ్చేసి క్లాప్‌కొట్టి చిత్రాన్ని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. దీనికి తిరుమూర్తి సంగీతాన్ని, మంజల్ చిత్రం తరువాత మాసాని ఈ చిత్రానికి ఛాయాగ్రహణం అందిస్తున్నారని ఆయన చెప్పారు.