కురంగుబొమ్మైకు ప్రేక్షకాదరణ | "Kurangu Bommai" Movie Success Meet | Sakshi
Sakshi News home page

కురంగుబొమ్మైకు ప్రేక్షకాదరణ

Published Fri, Sep 8 2017 4:08 AM | Last Updated on Sun, Sep 17 2017 6:32 PM

కురంగుబొమ్మైకు ప్రేక్షకాదరణ

కురంగుబొమ్మైకు ప్రేక్షకాదరణ

తమిళసినిమా: కురంగుబొమ్మై చిత్రాన్ని ప్రేక్షకులకు విశేషంగా ఆదరిస్తున్నారని ఈ చిత్ర యూనిట్‌ ఆనందాన్ని వ్యక్తం చేసింది. దర్శకుడు భారతీరాజా ప్రధాన పాత్ర పోషించిన చిత్రం కురంగుబొమ్మై. విధార్థ్‌ హీరోగా నటించిన ఇందులో పీఎల్‌.తేనప్పన్, కుమరవేల్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి నితిలన్‌ దర్శకుడు. శ్రేయాశ్రీ మూవీస్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రం గత శుక్రవారం తెరపైకి వచ్చింది. కాగా చిత్రం మంచి ప్రేక్షకాదరణతో రెండవ వారంలోకి ప్రవేశించిన సందర్భంగా చిత్ర యూనిట్‌ గురువారం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ ల్యాబ్‌లో సక్సెస్‌మీట్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా భారతీరాజా మాట్లాడుతూ తన చిత్రాలు ఎన్నో విజయం సాధిం చినా తాను సక్సెస్‌మీట్‌లో కృతజ్ఞతలు చెప్పడం ఇదే తొలిసారి  అన్నారు. చిత్ర దర్శకుడు నితిలన్‌ చిత్ర కథను నడిపించిన తీరు బాగుందన్నారు. అందుకే ఇంతటి విజయాన్ని సాధించిందని పేర్కొన్నారు. అయితే ఈ చిత్రంలో తన నటన పూర్తిగా చూడలేదని, పూర్తి నటనను త్వరలోనే చూస్తారని ఆయన అన్నారు. చిత్ర హీరో విధార్థ్‌ మాట్లాడుతూ దర్శకుడు భారతీరాజాతో కలిసి నటించడం మంచి అనుభవంగా పేర్కొన్నారు.కురంగుబొమ్మై చిత్రం ప్రేక్షకాదరణ పొంద డం సంతోషంగా ఉన్నా, శుక్రవారం మరిన్ని కొత్త చిత్రాలు విడుదలవడంతో థియేటర్లలో ప్రదర్శన ఆటలను తగ్గించడం బాధాకంగా ఉందన్నారు. ఈ విషయంలో నిర్మాతల మండలి పెద్దలు దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో పీఎల్‌.తేనప్పన్, దర్శకుడు నితిలన్‌ పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement