నటితో ప్రేమ.. పెళ్లికి సిద్ధమైన 'కలర్ ఫోటో' దర్శకుడు! | Color Photo Director Sandeep Raj Wedding With Chandini Rao | Sakshi
Sakshi News home page

Sandeep Raj: కలిసి పనిచేశారు.. త్వరలో కొత్త జీవితంలోకి!

Published Wed, Oct 30 2024 1:00 PM | Last Updated on Wed, Oct 30 2024 1:50 PM

Color Photo Director Sandeep Raj Wedding With Chandini Rao

టాలీవుడ్‌లో మరో పెళ్లి భాజా మోగనుంది. 'కలర్ ఫోటో' సినిమాతో గుర్తింపు తెచ్చకున్న దర్శకుడు సందీప్ రాజ్.. త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడట. తన తొలి మూవీలోనే చిన్న పాత్ర చేసిన చాందిని రావ్ అనే అమ్మాయితోనే ఏడడుగులు వేయబోతున్నాడని తెలుస్తోంది.

(ఇదీ చదవండి: త్వరలోనే నాగచైతన్య-శోభిత పెళ్లి.. ఆ ఫోటోను డిలీట్ చేసిన చైతూ!)

షార్ట్ ఫిల్మ్స్‌తో నటుడు-దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన సందీప్ రాజ్.. ఇప్పుడు దర్శకుడు అయిపోయాడు. ఇతడితో పాటు చాందిని రావ్ కూడా షార్ట్ ఫిల్మ్ నటిగా కెరీర్ ప్రారంభించింది. సందీప్ డైరెక్టర్ అయిన తర్వాత ఇతడు తీసిన 'కలర్ ఫొటో', 'హెడ్స్ అండ్ టేల్స్' వెబ్ సిరీస్‌లో చాందిని నటించింది. అలా చాన్నాళ్లుగా వీళ్లిద్దరూ ఒకరికి ఒకరు పరిచయమే. ఎప్పుడు ప్రేమలో పడ్డారో గానీ ఇప్పుడు పెద్దల అంగీకారంతో ఒక్కటి అయ్యేందుకు రెడీ అయినట్లున్నారు.

నవంబర్ 11న విశాఖపట్నంలో సందీప్ రాజ్-చాందిని నిశ్చితార్థం జరుగనుందని, డిసెంబరు 7న తిరుపతి పెళ్లి చేసుకోనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఇదంతా అనధికారిక సమాచారం మాత్రమే. సందీప్ రాజ్ వైపు నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఇకపోతే యాంకర్ సుమ కొడుకుతో 'మౌగ్లీ' అనే సినిమాని తీస్తున్నాడు సందీప్ రాజ్. కొన్నిరోజుల క్రితమే ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించారు.

(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement