vijay vasanth
-
సీమతన్నీ మొదలైంది!
తమిళసినిమా: సీమతన్నీ చిత్రం ఆదివారం ఉదయం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. విదార్థ్, విజయ్‌వసంత్ కథానాయకులుగా నటిస్తున్న చిత్రం సీమతన్నీ. వా రికి జంటగా చాందిని, సుభిక్ష నాయికలుగా నటిస్తున్న ఇందులో యోగిబా బు, హలో కందస్వామి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గ్రేట్ ఎంపరర్ ప్రొడక్షన్ పతాకంపై సి.ప్రేమ్‌కుమార్ భా రీ బడ్జెట్లో నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వా రా విజయ్‌మోహన్ దర్శకుడిగా పరి చయం అవుతున్నారు. ఈయన కథ, కథనం, మాటలు దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రం వివరాలను తెలుపుతూ ఒక రేషన్ షాప్‌నే సొంత ఇల్లుగా భావించి జీవిస్తున్న ఇద్దరు అనాథమిత్రులు, 10 ఇళ్లల్లో పనిచేసుకుని జీవించే తంగమారి అనే ఒక యువతి జీవి తాలను ఆవిష్కరించే చిత్రంగా సీమతన్నీ ఉంటుందన్నారు. ఇందులో మలర్వళీగా నటి చాం దిని పాత్ర కీలకంగా ఉంటుందన్నారు. దర్శకుడు సర్గుణం అతిథిగా విచ్చేసి క్లాప్‌కొట్టి చిత్రాన్ని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. దీనికి తిరుమూర్తి సంగీతాన్ని, మంజల్ చిత్రం తరువాత మాసాని ఈ చిత్రానికి ఛాయాగ్రహణం అందిస్తున్నారని ఆయన చెప్పారు. -
విజయ్ వసంత్‌కు జోడీగా..
విజయ్‌వసంత్‌తో జోడీ కట్టడానికి రెడీ అవుతున్నారు నటి నికీషా పటేల్. తెలుగులో పవన్‌కళ్యాణ్ సరసన పులి చిత్రం ద్వారా పరిచయమైంది ఈ నికీషా అనంతరం ‘ఓం’ చిత్రాల్లో నటించి తమిళ చిత్రరంగ ప్రవేశం చేశారు. ఇక్కడ ఎన్నమో ఏదో చిత్రంతో పరిచయమైన నికిషా పటేల్‌కు పలు అవకాశాలు తలుపు తడుతున్నాయి. కన్నడంలోను కథానాయికిగా రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మకు తమిళంలో తాజాగా విజయ్‌వసంత్‌తో జోడీ కట్టే అవకాశం వచ్చింది. వీరిద్దరు కలిసి శిఖండిగా తెరపైకి రానున్నారు. ఇంతకుముందు విజయ్ వసంత్ హీరోగా ఎన్నమో నడక్కుదు వంటి విజయవంతమైన చిత్రాల్ని రూపొందించిన రాజపాండి ఈ శిఖండి చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. వి.రికార్డ్స్ పతాకంపై వి.వినోద్ నిర్మించనున్న ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ ఇది విద్య ప్రయోజనాలను ఆవిష్కరించే చిత్రంగా ఉంటుందన్నారు. విద్య అవశ్యకత గురించి తెలుపుతూ ఇంతకుముందు పలు చిత్రాలు వచ్చినా అలాంటి వాటికి భిన్నంగా ఈ శిఖండి చిత్రం ఉంటుందన్నారు. ఆరు నెలలు విద్యాధికులతోను, సామాజిక స్పృహ ఉన్న పాత్రికేయ మిత్రులతోను, సుదీర్ఘంగా చర్చించి ఈ చిత్ర కథను తయారు చేసినట్లు తె లిపారు. విద్య, విద్యా సంస్థలు ఎలా ఉండాలన్న విషయాలను తనదైన శైలిలో ఈ చిత్రం ద్వారా చెప్పదలుచుకున్నానని అన్నారు. చిత్రంలో ప్రముఖ దర్శక, నటుడు సముద్రకని ఒక కీలక పాత్రలో నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెప్పారు. చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందని దర్శకుడు రాజపాండి వెల్లడించారు. -
విజయ్ వసంత్‌కు దిమ్మ తిరిగింది
నా దెబ్బకు విజయ్ వసంత్‌కు దిమ్మ తిరిగింది అంటోంది వర్ధమాన నటి మహిమ నంబియార్. విద్యార్థిని దశలోనే హీరోయిన్గా తెరంగేట్రం చేసింది ఈ మలయాళీ కుట్టి. సాట్టై చిత్రంతో కోలీవుడ్‌లో ప్రవేశించి, నటిగా మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో మూడు చిత్రాలున్నాయి. వాటిలో మొసకుట్టి, పురావి 150 సీసీ చిత్రాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. విజయ్ వసంత్ సరసన నటించిన ఎన్నమో నడక్కుదు చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకాదరణను చూరగొంటోంది. దీంతో విజయానందంలో మునిగిపోయిన మహిమా నంబియార్‌ను పలకరించగా ఎన్నమో నడక్కుదు తన కెరీర్లో గుర్తుండిపోయే చిత్రంగా నిలిచిపోతుందని పేర్కొంది. నిజం చెప్పాలంటే తాను స్టార్ నయ్యిపోవాలని కోరుకోవడం లేదంది. కథాబలం ఉన్న పాత్రల్లో నటిస్తూ మంచి నటిగా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నానని చెప్పింది. ఎన్నమో నడక్కుదు చిత్రంలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొంది. ఇందులో పూర్తిస్థారుు హీరోయిన్ పాత్ర పోషించినట్లు తెలిపింది. ఈ చిత్రాన్ని అంగీకరించినప్పుడే చిత్ర విజయంపై నమ్మకం కలిగిందని చెప్పుకొచ్చింది. అయితే ఇంత పెద్ద విజయం సాధిస్తుందని మాత్రం ఊహించలేదంది. ఈ చిత్ర షూటింగ్లో జరిగిన ఒక సంఘటనను తానెప్పటికీ మరచిపోనని చెప్పింది. ఒక సన్నివేశంలో హీరో విజయ్ వసంత్‌ను చెంప మీద కొట్టాల్సి ఉందని ఆ సన్నివేశంలో తన ప్రమేయం లేకుండానే ఆయన చెంప చెళ్లుమనిపించానని చెప్పింది. తన దెబ్బతో విజయ్వసంత్కు దిమ్మతిరిగింది. ఆ రోజంతా ఆయన ఆ షాక్ నుంచి కోలుకోలేదంటే నమ్మండి అంటున్న మహిమ తన తదుపరి చిత్రాలకు మంచి విజయం సాధిస్తాయనే నమ్మకం ఉందని చెప్పింది. మొసకుట్టిలో గ్రామీణ యువతిగా నటించానని తెలిపింది. ఇందులో తనకు మావయ్యగా పశుపతి నటించారని వెల్లడించింది. అలాగే పురవి 150 సీసీ చిత్రంలో చెన్నై అమ్మాయిగా వైవిధ్యభరిత పాత్రను చేస్తున్నట్లు తెలిపింది. ఇది చెన్నై నుంచి కోయంబత్తూర్‌కు హీరో హీరోయిన్ల బైక్ పయనం ఇతివృత్తంగా రూపొందుతున్న చిత్రం అని చెప్పింది. వీటితోపాటు అగత్ ఇనై అనే మరో చిత్రంలో కూడా నటిస్తున్నట్లు మహిమా నంబియార్ వెల్లడించింది.