విజయ్ వసంత్‌కు జోడీగా.. | Nikesha Patel Romance with Vijay Vasanth | Sakshi
Sakshi News home page

విజయ్ వసంత్‌కు జోడీగా..

Published Mon, Dec 1 2014 2:50 AM | Last Updated on Sat, Sep 2 2017 5:24 PM

విజయ్ వసంత్‌కు జోడీగా..

విజయ్ వసంత్‌కు జోడీగా..

 విజయ్‌వసంత్‌తో జోడీ కట్టడానికి రెడీ అవుతున్నారు నటి నికీషా పటేల్. తెలుగులో పవన్‌కళ్యాణ్ సరసన పులి చిత్రం ద్వారా పరిచయమైంది ఈ నికీషా అనంతరం ‘ఓం’  చిత్రాల్లో నటించి తమిళ చిత్రరంగ ప్రవేశం చేశారు. ఇక్కడ ఎన్నమో ఏదో చిత్రంతో పరిచయమైన నికిషా పటేల్‌కు పలు అవకాశాలు తలుపు తడుతున్నాయి. కన్నడంలోను కథానాయికిగా రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మకు తమిళంలో తాజాగా విజయ్‌వసంత్‌తో జోడీ కట్టే అవకాశం వచ్చింది. వీరిద్దరు కలిసి శిఖండిగా తెరపైకి రానున్నారు.
 
 ఇంతకుముందు విజయ్ వసంత్ హీరోగా ఎన్నమో నడక్కుదు వంటి విజయవంతమైన చిత్రాల్ని రూపొందించిన రాజపాండి ఈ శిఖండి చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. వి.రికార్డ్స్ పతాకంపై వి.వినోద్ నిర్మించనున్న ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ ఇది విద్య ప్రయోజనాలను ఆవిష్కరించే చిత్రంగా ఉంటుందన్నారు. విద్య అవశ్యకత గురించి తెలుపుతూ ఇంతకుముందు పలు చిత్రాలు వచ్చినా అలాంటి వాటికి భిన్నంగా ఈ శిఖండి చిత్రం ఉంటుందన్నారు.
 
 ఆరు నెలలు విద్యాధికులతోను, సామాజిక స్పృహ ఉన్న పాత్రికేయ మిత్రులతోను, సుదీర్ఘంగా చర్చించి ఈ చిత్ర కథను తయారు చేసినట్లు తె లిపారు. విద్య, విద్యా సంస్థలు ఎలా ఉండాలన్న విషయాలను తనదైన శైలిలో ఈ చిత్రం ద్వారా చెప్పదలుచుకున్నానని అన్నారు. చిత్రంలో ప్రముఖ దర్శక, నటుడు సముద్రకని ఒక కీలక పాత్రలో నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెప్పారు. చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందని దర్శకుడు రాజపాండి వెల్లడించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement