శ్రీకాంత్‌తో నికిషాపటేల్‌ | Nikesha Patel to romance Srikanth | Sakshi
Sakshi News home page

శ్రీకాంత్‌తో నికిషాపటేల్‌

Published Wed, Aug 9 2017 2:30 AM | Last Updated on Sun, Sep 17 2017 5:19 PM

శ్రీకాంత్‌తో నికిషాపటేల్‌

శ్రీకాంత్‌తో నికిషాపటేల్‌

నటి నికిషాపటేల్‌ నటుడు శ్రీకాంత్‌తో రొమాన్స్‌ చేస్తోంది. శ్రీకాంత్‌కు నటుడిగా చిన్న గ్యాప్‌ వచ్చింది.అదే విధంగా నికిషాపటేల్‌కు పెద్దగా అవకాశాలు లేవు.కాగా ఈ జంట తాజాగా ఒక హిందీ చిత్రానికి సీక్వెల్‌గా తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కతున్న చిత్రంలో నటిస్తున్నారు. విశేషం ఏమిటంటే ప్రముఖ హిందీ దర్శక నిర్మాత కేసీ.బొకాడియా 1985లో రూపొందించిన చిత్రం తెరి మెహర్‌బెనియన్‌. జాకీష్రాఫ్, పూనం దిల్లాన్‌ జంటగా నటించిన ఈ చిత్రంలో ఒక జాగిలం కూడా ముఖ్యపాత్రను పోషించింది.

 32 ఏళ్ల తరువాత ఆ చిత్రానికి సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు. అదీ తమిళ, తెలుగు భాషల్లో. ఈ చిత్రం గురించి నటుడు శ్రీకాంత్‌ తెలుపుతూ ఈ చిత్ర షూటింగ్‌ను ఇప్పటికే చెన్నై, హైదరాబాద్‌లలో 20 శాతం పూర్తి చేశామని తెలిపారు. మర్డర్‌ మిస్టరీతో కూడిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథా చిత్రంగా ఈ చిత్రం తెరకెక్కుతోందని తెలిపారు. నికిషాపటేల్‌ తెలుపుతూ మెరి మెహర్‌మెనియన్‌ చిత్రానికి ఇది సీక్వెల్‌ అయినా, ఆ చిత్రానికి తాము నటిస్తున్న చిత్రానికి సంబంధం ఉండదని అన్నారు.

ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలో తన పాత్ర శ్రీకాంత్‌ పాత్రకు సమానంగా ఉంటుందని చెప్పారు. సాధారణంగా బొకాడియా చిత్రాల్లో హీరోహీరోయిన్ల మధ్య మంచి రొమాన్స్‌ సన్నివేశాలు ఉంటాయన్న విషయం తెలిసిందేనన్నారు. అలాంటివి ఈ చిత్రంలోనూ ఉంటాయని తెలిపారు. ఇందులో శ్రీకాంత్‌కు తనకు మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరిస్తుందని నికిషాపటేల్‌ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement