మణికంఠన్, చాందిని
సాక్షి, చెన్నై: నటి చాందిని వ్యవహారంలో లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న అన్నాడీఎంకే మాజీ మంత్రి మణికంఠన్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. అతడి కోసం పోలీసులు నాగపట్టినం, రామానాథపురం జిల్లాల్లో గాలిస్తున్నట్లు తెలుస్తోంది. పలు తమిళ చిత్రాల్లో నటించిన చాందినీ ఇటీవల చెన్నై వెప్పేరీ పోలీస్‌స్టేషన్‌లో మణికంఠన్‌పై ఇటీవల ఫిర్యాదు చేశారు.
అందులోని వివరాలు.. మలేషియా పర్యాటకాభివృద్ధి రాయబార కార్యాలయంలో పనిచేస్తున్నపుడు విధి నిర్వహణలో భాగంగా తరచూ భారత్‌కు రాకపోకలు సాగించేదానిని. పర్యాటకాభివృద్ధి సంబంధించి మాట్లాడాల్సి ఉందని అప్పట్లో రామనాథపురం అన్నాడీఎంకే ఎమ్మెల్యేగా ఉండిన మణికంఠన్.. భరణి అనే వ్యక్తిద్వారా సమాచారం ఇచ్చారు. దీంతో 2017 మే 3వ తేదీన మంత్రి హోదాలో మణికంఠన్‌ను ఆయన ఇంటి వద్ద కలిశాను. అదే సమయంలో నా సెల్‌ఫోన్ నెంబరు తీసుకున్న మణికంఠన్ పెళ్లిపేరుతో నమ్మబలికాడు.
చెన్నై బిసెంట్‌నగర్‌లోని ఒక అపార్టుమెంటులో భార్యాభర్తల తరహాలో జీవితం సాగించాం. ఈ సమయంలో మూడుసార్లు నాకు తన స్నేహితుడైన ఓ డాక్టర్ సహాయంతో అబార్షన్ చేయించాడు. వేధింపులతో నా కళ్లు దెబ్బతిన్నాయి. పెళ్లి చేసుకుందామని కోరడంతో.. రహస్యంగా తీసిన నా అంతరంగ ఫొటోలను టెలిగ్రాం ద్వారా పంపి బెదిరింపులకు దిగాడు.. అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో చెన్నై పోలీస్ కమిషనర్ శంకర్ జీవాల్ అదేశాల మేరకు అడయారు మహిళా పోలీస్‌స్టేషన్‌లో పలుసెక్షన్లపై మణికంఠన్, భరణిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment