

'కలర్ ఫోటో' సినిమాతో గుర్తింపు తెచ్చకున్న దర్శకుడు సందీప్ రాజ్

ఈ టాలీవుడ్ డైరెక్టర్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు.

నటి చాందినీరావుతో ఆయన ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నారు.

తన తొలి మూవీలోనే చిన్న పాత్ర చేసిన చాందిని రావును ఆయన పెళ్లాడనున్నారు.

వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ వేడుక వైజాగ్‌లో జరిగింది.

తనకు కాబోయే భార్య చాందిని రావుకు సందీప్ రాజ్ రింగ్ తొడిగిన ఫోటోలను ఇన్‌స్టాలో పంచుకున్నారు.

తాజాగా ఈ వేడుకకు సంబంధించిన మరిన్ని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఈ వేడుకలో సుమ కనకాల తనయుడు రోషన్, కమెడియన్ హర్ష చెముడు కూడా పాల్గొన్నారు.

షార్ట్ ఫిల్మ్స్‌తో నటుడు-దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన సందీప్ రాజ్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.

సందీప్ డైరెక్షన్‌లో తీసిన 'కలర్ ఫొటో', 'హెడ్స్ అండ్ టేల్స్' వెబ్ సిరీస్‌లో చాందిని నటించింది.
