
ప్రేమ-పెళ్లి పేరుతో నటిని మోసం చేసిన ఓ మాజీ మంత్రి బాగోతం వెలుగులోకి వచ్చింది. కోలీవుడ్‌లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసిన చాందినీ.. అన్నాడీఎంకే నేత, మాజీ మంత్రి డాక్టర్ మణికందన్‌పై సంచలన ఆరోపణలు చేసింది. తనతో సహజీవనం చేసి గర్భవతిని చేసిన మణికందన్.. ఇప్పుడు చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఆమె మీడియా ముందుకు వచ్చింది.
చెన్నై: కోలీవుడ్ నటి చాందినీ అన్నాడీఎంకే నేత మణికందన్ మీద ఛీటింగ్, లైంగిక దాడి కేసులు పెట్టింది. గత ఐదేళ్లుగా తామిద్దరం రిలేషన్షిప్లో ఉన్నామని, తాను గర్భవతిని అని తెలిశాక అబార్షన్ చేయించాడని ఆమె మీడియా ముందు వాపోయింది. పెళ్లి చేసుకోమంటే కుదరదని అన్నాడని, గట్టిగా మాట్లాడితే తన గుండాలతో చంపిస్తానని బెదిరించాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు తనతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను బయటపెడతానని బెదిరిస్తున్నాడని ఆమె పోలీసులకు తెలిపింది. ఈ మేరకు మణికందన్‌తో జరిగినట్లుగా వాట్సాప్ ఛాటింగ్‌లను ఆమె మీడియాకు చూపించి పోలీసులకు సమర్పించింది.
కాగా, 36 ఏళ్ల చాందినికి మలేషియా పౌరసత్వం ఉంది. ‘నడడిగల్, వాగి సూడా వా’ సినిమా లాంటి సినిమాల్లో ఆమె నటించింది. ఇక మణికందన్ గతంలో అన్నాడీఎంకే ప్రభుత్వంలో ఐటీ మంత్రిగా పనిచేశారు. జయలలితకు ఆప్తుడిగా పేరున్న 41 ఏళ్ల మణికందన్.. అప్పటి మంత్రి ఉడుమలై రాధాకృష్ణన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు పళనిస్వామికి వ్యతిరేకంగా టీవీవీ దినకరన్ వేరు కుంపటిలో చేరి మంత్రి పదవిని పొగొట్టుకున్నాడు. కాగా చాందినీ ఆరోపణలపై మణికందన్ స్పందన తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment