Vijaykanth
-
ఒకప్పుడు నెట్ బౌలర్.. ఇప్పుడు సన్‌రైజర్స్ జట్టులోకి ఎంట్రీ
ఐపీఎల్-2024 సీజన్ మొత్తానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్, శ్రీలంక టీ20 కెప్టెన్ వనిందు హసరంగా గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. తాజాగా హసరంగా స్ధానాన్ని ఎస్ఆర్హెచ్ మెన్జ్మెంట్ భర్తీ చేసింది. అతడి స్ధానంలో మరో శ్రీలంక యువ స్పిన్నర్ విజయకాంత్ వియస్కాంత్తో సర్‌రైజర్స్ ఒప్పందం కుదుర్చుకుంది. రూ.50 లక్షల కనీస ధరకు ఎస్ఆర్హెచ్ అతడిని సొంతం చేసుకుంది. కాగా ఐపీఎల్-2023 సీజన్లో ఆర్సీబీకి నెట్‌బౌలర్‌గా విజయకాంత్ పనిచేశాడు. ఇక అతడు శ్రీలంక తరపున ఇప్పటివరకు కేవలం ఒకే టీ20 మ్యాచ్ ఆడాడు. కానీ విజయకాంత్‌కు అంతర్జాతీయ క్రికెట్లో పెద్దగా అనుభవం లేనప్పటికి.. డొమాస్టిక్ క్రికెట్లో మాత్రం మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు తన కెరీర్లో 33 టీ20లు ఆడిన విజయకాంత్ 6.76 ఏకానమీ రేటుతో 42 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ జట్టులో సరైన మణికట్టు స్పిన్నర్లు లేరు. ఈ నేపథ్యంలో విజయకాంత్‌ను సొంతం చేసుకోవడం ఎస్ఆర్హెచ్ కలిసిశ్చే ఆంశం. కాగా ఈ ఏడాది సీజన్లో సన్‌రైజర్స్ ఇప్పటివరకు 4మ్యాచ్‌లు ఆడి రెండింట విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఐదో స్ధానంలో సన్‌రైజర్స్ కొనసాగుతోంది. -
విజయ్‌కాంత్ లేరనే వార్త జీర్ణించుకోలేకపోతున్నా: కార్తీ
దివంగత నటుడు, డీఎండీకే పార్టీ అధ్యక్షుడు విజయ్‌కాంత్‌కు దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం తరపున ఈ నెల 19న సంస్మరణ సభను నిర్వహించనున్నట్లు హీరో, ఆ సంఘం కోశాధికారి కార్తీ తెలిపారు. గత నెల 28న విజయ్‌కాంత్ అనారోగ్యంతో మృతి చెందారు. ఆ సమయంలో పలువురు సెలబ్రిటీలు ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించగా.. కొందరు ఇతర ప్రాంతాల్లో ఉండటం కారణంగా సంతాపం తెలుపలేకపోయారు. అందులో హీరో కార్తీ ఒకరు. గురువారం చైన్నెకి చేరుకున్న ఆయన తన తండ్రి శివకుమార్, సోదరుడు సూర్యతో కలిసి స్థానిక కోయంబేడులోని డీఎండీకే పార్టీ కార్యాలయ ఆవరణలో విజయకాంత్ సమాధిని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విజయ్‌కాంత్ మన మధ్య లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని వాపోయారు. దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా ఆయన్ని కలిసినప్పుడు చాలా ఉత్సాహంగా మాట్లాడారని పేర్కొన్నారు. అధ్యక్షుడు అంటే మార్గదర్శిగా నిలవాలన్నది విజయ్‌కాంత్ నుంచే నేర్చుకున్నట్లు తెలిపారు. కాగా జనవరి 19న తమ సంఘం తరపున విజయ్‌కాంత్‌కు సంస్మరణ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. • Exclusive - #Sivakumar Sir, @Karthi_Offl Anna At Captain #Vijayakanthsir 's Home For Grieving The Loss Of Their Loved One | @prabhu_sr #Karthi pic.twitter.com/pzMldSMoez — Yogesh Yogi (@YogeshY16480498) January 5, 2024 చదవండి: ఒక కన్నులో ధైర్యం, మరో కన్నులో కరుణ.. అంటూ బోరున ఏడ్చిన సూర్య -
కరోనా ఇలా కూడా ఎటాక్ చేస్తుందా? నటుడు విజయ్‌కాంత్ కూడా..
కోలివుడ్‌కి చెందిన ప్రుముఖ నటుడు విజయ్‌కాంత్(71) చెన్నైలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన న్యూమోనియాతో ఆస్పత్రిలో చేరి ప్రాణాలతో పోరాడుతుండగానే చివరికి కరోనా పాజిటివ్‌గా అని తేలిన ఒక్కరోజులోనే మృతి చెందారు. న్యూమెనియా లక్షణాలతో కూడా కరోనా అటాక్ ఇస్తుందా? లేదా ఇది కూడా కరోనా సంకేతమా? లేక వయసు కారణామా?. అలాంటప్పుడూ సీనియర్ సిటీజన్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?. డీఎండీకే పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ తమిళ నటుడు విజయ్‌కాంత్ అభిమానులను శోక సంద్రంలోకి నెట్టేస్తూ మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఆయన తొలుత తీవ్రమైన దగ్గు, గొంతు నొప్పి సమస్యలతో ఆస్పత్రిలోకి చేరినట్లు సమాచారం. ఆ తర్వాత సుమారు 14 రోజులు వైద్యులు పర్యవేక్షణలో ఉన్నారు. న్యూమెనియా వంటి శ్వాసకోశ సమస్యలతో పోరాడుతున్నట్లు పేర్కొన్నారు వైద్యులు. ఆ తర్వాత కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా తేలడం, పరిస్థితి విషమించడం మృతి చెందడం క్షణాల్లో జరిగిపోయాయి. దీంతో అందరిలో న్యూమోనియా కాస్త కరోనా మారి ప్రాణాంతకంగా పరిణామిస్తుందా? అని తీవ్ర భయాందోళనలు తలెత్తుతున్నాయి. అయితే వైద్యులు ఇలా ఎంత మాత్రం జరగదని చెబుతున్నారు. ఒక్కొసారి తేలికపాటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు తేలిగ్గా తీసుకున్నప్పుడే సమస్య తలెత్తుందన్నారు వైద్యులు. వయసు వల్ల కూడా ఈ సమస్యలు తలెత్తుతాయి. ఎందుకంటే సుమారు 61 ఏళ్ల పైబడినవారిలో చాలామంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుంటారు, దీనికి తోడు వారిలో వ్యాధినిరోధక శక్తి కూడా తక్కువుగా ఉంటుంది. అందువల్ల అలాంటి వారు సదా అప్రమత్తంగా ఉండాల్సిందేనని సూచిస్తున్నారు. యువత కంటే పెద్దలు, చిన్నారులే ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అంతేగాదు ముఖ్యంగా కీమోథెరపీ, మధుమేహం, స్టెరాయిడ్లు తీసుకుంటున్నవారు, గుండె జబ్బులు ఉన్నవారు, గర్భిణి స్త్రీలు బహు జాగ్రత్తగా ఉండాల్సిందేనని నొక్కి చెబుతున్నారు వైద్యులు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే.. జ్వరం అలసట దగ్గు, గొంతు నొప్పి ఊపిరి ఆడకపోవడం కండరాలు, శరీర నొప్పులు తలనొప్పి చలి రుచి, వాసన కోల్పోవడం తదితర లక్షణాలు వృద్ధలు లేదా పెద్దవారిలో వస్తే అస్సలు నిర్లక్ష్య చేయకుండా తక్షణమే వైద్యుడిన సంప్రదిస్తే మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే ఈ కొత్త కరోనా సబ్ వేరియంట్ జేఎన్ 1 మరింత ప్రమాదకారి కాదు కానీ తగు జాగ్రత్తలు మాత్రం తీసుకోవాల్సిందేనని హెచ్చరించారు. ముఖ్యంగా వ్యక్తిగత శుభ్రత, చేతులు కడుక్కోవడం, సామాజిక దూరం పాటిచటం తోపాట్లు ఇంట్లో ఎవరికైనా కరోనా వస్తే సెపరేట్‌గా ఉండటం తదితర జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అలాగే కాలనుగుణంగా తాజా కూరగాయాలు, పండ్లు, తృణధాన్యాలు తీసుకోవడం వంటివి చేయాలని అన్నారు. అన్నింటికంటే వ్యాధినిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవడం వంటివి చేయడం అత్యంత ముఖ్యమని సూచించారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: తినే గమ్(గోండ్) గురించి తెలుసా? బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు..) -
Actor-Politician Captain Vijayakanth: విజయ్ కాంత్ మృతిపై సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం (ఫొటోలు)
-
విజయకాంత్ మృతిపట్ల నటుడు విశాల్ ఎమోషనల్
-
విజయకాంత్ భౌతికకాయానికి తమిళనాడు సీఎం స్టాలిన్ నివాళి
-
విజయకాంత్ మృతిపై ఏపీ సీఎం జగన్ సంతాపం
గుంటూరు, సాక్షి: ప్రముఖ సినీ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం గురువారం ఒక సంతాప ప్రకటన విడుదల చేసింది. విజయకాంత్ కుటుంబసభ్యులకు, అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు తన ప్రగాఢ సానుభూతిని సదరు ప్రకటనలో తెలిపారు సీఎం జగన్. యాక్షన్ హీరోగా తమిళ చలన చిత్ర పరిశ్రమలోనే కాదు.. అక్కడి రాజకీయాల్లోనూ ఆయన చెరగని ముద్ర వేసింది తెలిసిందే. ఇదిలా ఉంటే.. 71 ఏళ్ల విజయ్‌కాంత్ ఆరోగ్య సమస్యలతో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. ఈమధ్యే కోలుకున్నట్లు వైద్యులు ప్రకటించడంతో ఆయన అభిమానులు సంతోషించారు. అయితే కరోనా బారినపడ్డాక ఆయన పరిస్థితి మరింత విషమించింది. దీంతో ఈ ఉదయం ఆయన కన్నుమూసినట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. ఇదీ చదవండి: తమిళ రాజకీయాల్లో కెప్టెన్ ఓ సంచలనం -
ఒక్క సీటుతో కింగ్‌మేకర్.. కూటమిలతో తగ్గిన విజయకాంత్ క్రేజ్
కోలీవుడ్ ప్రముఖ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ (71) అనారోగ్యంతో చికిత్స పొందుతూ... నేడు (డిసెంబర్ 28) తుది శ్వాస విడిచారు. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. విజయకాంత్ మృతి పట్ల అభిమానులు, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. విజయకాంత్ జననం: విజయకాంత్ 1952 ఆగస్టు 25న తమిళనాడులోని మధురైలో జన్మించారు. ఆయన అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అలగరస్వామి. సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత తన పేరును విజయకాంత్‌గా మార్చుకున్నారు. విజయకాంత్‌కు భార్య ప్రేమలత, ఇద్దరు కుమారులు ఉన్నారు. సినిమా ఎంట్రీ: విజయకాంత్ 27 ఏళ్ల వయసులో సినీ రంగ ప్రవేశం చేశారు. 1979లో 'ఇనిక్కుం ఇలామై' చిత్రంతో విలన్‌గా ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అప్పటి నుంచి 2015 వరకు 150కి పైగా చిత్రాల్లో నటించారు. రోజుకు మూడు షిఫ్టులు పనిచేశారు. కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నప్పటికీ. ఆ తర్వాత ఆయన నుంచి ఎన్నో మంచి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. 1984లో విజయకాంత్ నుంచి 18 సినిమాలు విడుదలయ్యాయి. 20కి పైగా సినిమాల్లో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించాడు. విజయకాంత్ తమిళ చిత్రాల్లో మాత్రమే నటించారు. ఇతర భాషల్లో నటించలేదు. కానీ ఆయన సినిమాలు చాలా భాషల్లో డబ్బ్ అయ్యాయి. సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ లకు విజయకాంత్ ఒకప్పుడు గట్టి పోటీ ఇచ్చారు. విజయకాంత్ మెసేజ్ బేస్డ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. దేశభక్తి చిత్రాలైనా, గ్రామీణ నేపథ్య సినిమాలైనా, ద్విపాత్రాభినయాలైనా నటించేందుకు విజయకాంత్ ఎప్పుడూ ముందుండేవారు. వాటితో పాటు కమర్షియల్ సినిమాల్లోనూ సందడి చేసేవారు. అయితే ఆయన ఏ నిర్మాత వద్ద కూడా ముందుగా డబ్బు తీసుకోడని కోలీవుడ్ పరిశ్రమలో గుర్తింపు ఉంది. కోలీవుడ్ నిర్మాతలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని తెలిస్తే వారి నుంచి రెమ్యూనరేషన్ తీసుకోకుండానే సినిమా అవకాశం ఇస్తారని సమాచారం. ఒక్క సీటుతో రాజకీయ ప్రయాణం 2005లో దేశీయ ముర్పోక్కు ద్రావిడ కళగం (డీఎండీకే) అనే పార్టీని సినీ నటుడు విజయకాంత్ ఏర్పాటు చేశారు. తొలిసారిగా 2006 ఎన్నికల సమయంలో తన పార్టీ నుంచి తానొక్కడే గెలిచాడు.. కానీ ఆయన పార్టీ 10 శాతం ఓట్లు సాధించి తమిళ రాజకీయాలలో విజయకాంత్‌ను ప్రత్యామ్నాయ శక్తిగా మార్చింది. 2011 అసెంబ్లీ ఎన్నికలలో జయలలిత (అన్నాడీఎంకే)తో చేతులు కలిపి 41 సీట్లలో 29 స్థానాలను గెలుచుకున్నారు. ఆ సమయంలో ఎం.కరుణానిధి (డీఎంకే) పార్టీని చిత్తు చేసిన విజయకాంత్ ప్రధాన ప్రతిపక్ష నేతగా అవతరించారు. ఆ తదుపరి అన్నాడీఎంకేతో వైరం వంటి పరిణామాలు విజయకాంత్ పార్టీకి గడ్డు పరిస్థితులను సృష్టించాయి. దీంతో జయలలిత, విజయకాంత్ పార్టీల మధ్య విభేదాలు వచ్చాయి. కూటమిల పేరుతో నష్టం 2014 లోక్‌సభ ఎన్నికలలో ఆయన ఎన్డీఏతో వెళ్లి ఓటమిని చవి చూశారు. కానీ ఓటు బ్యాంక్ శాతం పెంచుకోవడం ఆయనకు కలిసి వచ్చిన అంశంగా మారింది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎండీకే నేతృత్వంలో రాష్ట్రంలో మూడో కూటమి అవతరించినా, ఫలితం శూన్యం. ఆ ఎన్నికల్లో అన్నిచోట్ల విజయకాంత్ కూటమి పార్టీ డిపాజిట్లను కోల్పోయింది. ఆ ఎన్నికల్లో విజయకాంత్ కూడా సుమారు 50 వేలకు పైగా ఓట్లతో ఓటమి చెందారు. ఆ తర్వాత వరుస ఓటములు ఎదురైనా ఏ మాత్రం డీలా పడకుండా కేడర్ మద్దతు, సినీ అభిమానుల అండతో ఒంటరిగానే పార్టీని నడిపిస్తూ వచ్చారు. కానీ కూటమిల పేరుతో ఆయన ఇతర పార్టీలకు అనుకూలంగా పనిచేయడం, ఇతర పార్టీలకు చెందిన అధినేతల సలహాలతో డీఎండీకేను ముందుకు నడపడం వంటి కారణాలతో ఆయన ఇమేజ్ క్రమేపి తగ్గుతూ వచ్చింది. ఇంతలో ఆయన తరుచుగా అనారోగ్యంతో ఇబ్బందులు పడటం కూడా పార్టీకి నష్టం వాటిల్లింది. చివరకు అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా, పార్టీ వ్యవహారాలను ఆయన పర్యవేక్షించ లేని పరిస్థితి నెలకొంది పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని కూడా ఆయన సతీమణి ప్రేమలతకు ఆయన అప్పచెప్పారు. తాజాగా ఆయన మరణం డీఎండీకే పార్టీకి తీరని లోటు అని చెప్పవచ్చు. 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలలో ఆయన సతీమణి ప్రేమలత ఒంటరిగానే బరిలోకి దిగుతారా..? మరేదైనా పార్టీకి మద్ధతు ఇస్తారా..? అనేది తేలాల్సి ఉంది. -
Captain Vijayakanth: నల్లగా ఉన్నాడని హేళన.. ఏడాదిలో 18 సినిమాలు
ప్రముఖ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్(70) మరణంతో తమిళనాట విషాద ఛాయలు అలుముకున్నాయి. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నెలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన విజయ్‌కాంత్.. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని స్టార్ హీరోగా ఎదిగాడు. (చదవండి: కెప్టెన్ విజయ్‌కాంత్.. కుటుంబం నేపథ్యమిదే!) ఆయన తండ్రి ఒక రైస్ మిల్లు యజమాని. కొడుకుని బాగా చదివించి ప్రభుత్వ ఉద్యోగస్థుడిగా చూడాలని ఆయన కోరిక. కానీ విజయకాంత్‌కు మాత్రం చిన్నపుడు చదువుపై పెద్దగా ఆసక్తి లేదు. తరచూ స్నేహితులతో కలిసి థియేటర్‌కి వెళ్తుండేవాడు. ఎంజీఆర్ సినిమాలను ఎక్కువగా చూసి ఆయనలా తాను కూడా పెద్ద హీరో కావాలనుకున్నాడట. (చదవండి: కెప్టెన్ విజయ్‌కాంత్.. అవార్డుల రారాజు!) అందుకే మధురై నుంచి చెన్నైకి తన మకాంని మార్చాడు. సినిమా అవకాశాలకు చాలా ప్రయత్నాలు చేశాడు. అయితే తన శరీరం నల్లగా ఉండడంతో.. దర్శకనిర్మాతలు తనను రిజెక్ట్ చేసేవారట. ఈ విషయాన్ని విజయకాంతే పలు సందర్భాల్లో చెప్పాడు. ‘నా శరీర రంగు కారణంగా అనేకసార్లు తిరస్కారాలు ఎదురయ్యాయి. అయినప్పటికీ వెనుకడుకు వేయకుండా నిలబడ్డా..వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నేడు ఈ స్థాయికి చేరాను’అని ఓ ఇంటర్వ్యూలో విజయకాంత్ అన్నారు. విజయ్‌రాజ్ నుంచి విజయకాంత్‌గా విజయ్‌కాంత్ అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అళగర్స్వామి. ఇండస్ట్రీ ఎంట్రీతోనే తన పేరును మార్చుకున్నాడు. అయితే ఈ పేరు మార్పు తన మొదటి సినిమా డైరెక్టర్దేనట. విజయ్ తొలి సినిమా ‘ఇనిక్కమ్ ఇళమై’(1979). ఈ సినిమాకు దర్శకత్వం వహించిన ఏంఏ కాజాకు నారాయణన్ విజయరాజ్ అళగర్స్వామి అనే పేరు నచ్చలేదట. ఆ సమయంలో రజనీకంత్ హవా బాగా నడుస్తుండడంతో ఆయన పేరులోని నుంచి కాంత్ అనే పదాన్ని తీసి విజయ్ రాజ్‌కు యాడ్ చేశాడట. అలా విజయ్‌రాజ్ పేరును విజయకాంత్‌గా మార్చాడు. ఒకే ఏడాది 18 సినిమాలు.. 27 ఏళ్ల వయసులో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విజయకాంత్.. కెరీర్లో 150కి పైగా సినిమాల్లో నటించారు. తొలిసినిమా ఇనిక్కుమ్ ఇలమై (1979). అందులో ఆయన విలన్ పాత్రను పోషించి, తనదైన నటనతో మెప్పించాడు. ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. అయితే కెరీర్ తొలినాళ్లలో ఆయన చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఎస్.ఎ. చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన ‘దూరతు ఇడి ముళక్కం’, సత్తం ఓరు ఇరుత్తర్లై’ చిత్రాలతో సక్సెస్ బాట పడ్డాడు. 2015 వరకు నిర్విరామంగా సినిమాల్లో నటించాడు. మూడు షిఫ్ట్‌ల్లో పని చేస్తూ ఏడాదికి ఐదారు సినిమాలను రిలీజ్ చేసేశాడు. 1984లో ఆయన నటించిన 18 సినిమాలు విడుదలై రికార్డును సృష్టించాయి. ఎస్. ఏ. చంద్రశేఖర్, రామ నారాయణన్ దర్శకత్వంలో ఆయన ఎక్కువ సినిమాలు చేశారు. -
శోకసంద్రంలో తమిళ ఇండస్ట్రీ
-
తమిళ రాజకీయాల్లో కెప్టెన్ సంచలనాలు
చెన్నై: డీఎండీకే అధినేత, సినీ నటుడు కెప్టెన్ విజయ్‌కాంత్ అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వందకిపైగా చిత్రాలతో తమిళ చలన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్నారాయన. అయితే.. విజయ్ కాంత్ అటు సినీ రంగం ద్వారా యాక్షన్ హీరోగానే కాదు.. తమిళ రాజకీయాల్లోనూ సొంత పార్టీ డీఎండీకే ద్వారా సంచలనాలు కేరాఫ్‌గా నిలిచారాయన. తద్వారా కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత మాదిరే.. విజయ్‌కాంత్ తమిళ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. తన రాజకీయ ప్రస్థానంలో విజయకాంత్ రెండుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గారు. 2005 సెప్టెంబర్‌లో విజయ్‌కాంత్ డీఎండీకే(దేశీయ మర్పోక్కు ద్రావిడ కజగం) పార్టీని స్థాపించారు. 2006లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి మొదటిసారిగా విజయ్‌కాంత్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. విరుదాచలం నియోజకవర్గం నుంచి పోటీ చేసి నెగ్గారాయన. అయితే.. ఆ ఎన్నికల్లో 234 స్థానాల్లో పోటీ చేసిన డీఎడీకే తరఫున విజయ్‌కాంత్ ఒక్కడే విజయం సాధించారు. అనంతరం, 2009 జనరల్ ఎలక్షన్స్‌లో 40 స్థానాల్లో డీఎండీకే పోటీలో నిలిచింది. తమిళనాడులో 39 స్థానాల్లో, పుదుచ్చేరిలో ఒక్క స్థానం నుంచి పోటీ చేసి ఓటమిని చవిచూశారు. ప్రతిపక్ష నేతగా.. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్‌కాంత్ పార్టీ డీఎండీకే పెను సంచలనం సృష్టించింది. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో డీఎండీకే పొత్తు పెట్టుకుంది. ఎన్నికల్లో డీఎండీకే 41 స్థానాల్లో పోటీ చేయగా 29 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో, విజయకాంత్ శాసనసభ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. ఐదేళ్లపాటు.. అంటే 2016 ఎన్నికల వరకు శాసనసభపక్ష నేతగా కొనసాగారు. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో పరాజయం పొందారు. 2019 పార్లమెంట్ ఎన్నికలు, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎండీకే పోటీ చేయగా ఘోర ఓటమిని చవిచూసింది. 2016 ఎన్నికల తరువాత, జయలలిత, విజయకాంత్ పార్టీల మధ్య విభేదాలు వచ్చాయి. ఈ కారణంగా విజయకాంత్ అన్నాడీఎంకే నుండి విడిపోయాడు. ఇక, బీజేపీతో డీఎండీకేతో ఎన్డీయే నాయకుల సంప్రదింపులు జరిపారు. ఒకానొక సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ.. విజయ్‌కాంత్‌కు ప్రత్యేక సూచన ఇచ్చి ఆయనను తన స్నేహితుడిగా పేర్కొన్నారు. పార్టీలో చోటుచేసుకున్న వెన్నుపోటు రాజకీయాల కారణంగా విజయ్‌కాంత్ ఆరోగ్యం క్షీణించింది. ఆయన తరచుగా ఆసుపత్రిపాలు కావాల్సి వచ్చింది. ఇదీ చదవండి: కెప్టెన్ విజయ్‌కాంత్ అస్తమయం -
డీఎండీకే అధినేత, నటుడు విజయ్ కాంత్ కన్నుమూత
-
మరోసారి ఆస్పత్రిలో చేరిన హీరో విజయ్‌కాంత్.. అదే కారణం?
కొన్నాళ్ల ముందు తీవ్ర అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరిన తమిళ స్టార్ హీరో విజయ్ కాంత్.. కోలుకుని ఇంటికెళ్లిపోయారు. ఇప్పుడు మరోసారి ఆస్పత్రిలో చేరారు. దీంతో ఈయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇది రెగ్యులర్ చెకప్ కోసమేనని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రెండు రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని అంటున్నారు. (ఇదీ చదవండి: ఖరీదైన కారు కొన్న 'బిగ్‌బాస్' మానస్.. రేటు ఎంతో తెలుసా?) ఇకపోతే తమిళంలో పలు సినిమాల్లో హీరోగా నటించిన విజయ్‌కాంత్ చాలా ఫేమ్ సంపాదించారు. ఓ వైపు సినిమాలు చేస్తూ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2011-16 మధ్య తమిళనాడు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. ఇలా నటుడు, పొలిటీషియన్ కాకుండా నిర్మాత, దర్శకుడిగానూ పేరు తెచ్చుకున్నారు. విజయ్‌కాంత్ పూర్తి పేరు విజయరాజ్ అలగర్‌స్వామి. 1952 ఆగస్టు 25లో పుట్టారు. కెప్టెన్ ప్రభాకర్ సినిమాతో చాలా క్రేజ్ తెచ్చుకున్నారు. దీంతో ఆయన పేరు కాస్త కెప్టెన్ విజయ్‌కాంత్‌గా మారిపోయింది. విజయ్‌కాంత్ భార్య పేరు ప్రేమలత. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. వీళ్లలో ఒకబ్బాయి ఆల్రెడీ హీరోగా కొన్ని సినిమాలు చేశాడు. ఇకపోతే 70 ఏళ్ల విజయ్‌కాంత్ గత కొన్నేళ్లుగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అందుకే ఇలా ఆస్పత్రి పాలవుతున్నారు. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7'లో ఓడిపోతేనేం.. ఇప్పుడు శోభాశెట్టికి ఆ అవార్డ్) -
విజయకాంత్ అనారోగ్యంపై పుకార్లు.. ఖండించిన నటుడి సతీమణి
తమిళ స్టార్, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో ఆయన మరణించాడంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్‌లో విజయకాంత్ ఇక లేరంటూ ఇష్టారీతిన ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్నారు. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదు. కెప్టెన్ విజయకాంత్ సతీమణి ప్రేమలత సైతం సదరు వార్తలను ఖండించింది. కెప్టెన్ ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తారని పేర్కొంది. ఆయన అనారోగ్యం గురించి వచ్చే వదంతులను నమ్మవద్దని కోరింది. అటు చెన్నైలోని ఆస్పత్రి వర్గాలు సైతం ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోందని బుధవారం నాటి ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. ఇకపోతే విజయకాంత్ 'ఇనిక్కుం ఇలమై' సినిమాతో వెండితెరపై తన ప్రయాణం ఆరంభించారు. 150కి పైగా సినిమాలు చేసిన ఆయన ఇరవైకి పైగా పోలీస్ స్టోరీల్లో నటించి అలరించారు. ఆయన నటించిన 100వ మూవీ 'కెప్టెన్ ప్రభాకర్' హిట్ అయిన తర్వాత నుంచి ఈయన్ని అందరూ కెప్టెన్ అని పిలవడం ప్రారంభించారు. ఈయన చేసిన చాలా సినిమాలు తెలుగులోనూ డబ్, రీమేక్ అయ్యాయి. చిరంజీవి 'ఠాగూర్' మూవీ ఒరిజినల్ వెర్షన్ 'రమణ'లో విజయ్ కాంతే హీరోగా నటించారు! கேப்டன் நலமாக இருக்கிறார். விரைவில் முழு உடல் நலத்துடன் வீடு திரும்பி, நம் அனைவரையும் சந்திப்பார். - திருமதி. பிரேமலதா விஜயகாந்த் pic.twitter.com/P9iHyO7hzG — Vijayakant (@iVijayakant) November 29, 2023 చదవండి: ‘యానిమల్’ మూవీ టాక్ ఎలా ఉందంటే.. ? -
స్టార్ హీరో కొడుకు కొత్త సినిమా.. అలాంటి కాన్సెప్ట్‌తో
నటుడు విజయ్‌కాంత్ కొడుకు షణ్ముఖ పాండియన్ ఇంతకుముందు 'మధురై వీరన్' చిత్రంతో హీరోగా పరిచమయ్యాడు. తాజాగా ఇతడు హీరోగా చేయబోతున్న కొత్త మూవీ శనివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. డైరక్టర్స్ సినిమాస్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి కథనం, మాటలు పార్తీపన్ దేసింగు అందించగా, వాల్టర్, రెక్నా చిత్రాలు ఫేమ్ యు.అన్భు దర్శకత్వం వహిస్తున్నారు. (ఇదీ చదవండి: ఆ న్యూస్ చూసి చాలా బాధపడ్డాను: సుస్మిత కొణిదెల) కస్తూరి రాజా, ఎమ్మెస్ భాస్కర్, యామిని సుందర్ తదితరులు ముఖ్యపాత్ర పోషిస్తున్న ఇందులో మరికొందరు ప్రముఖ నటీనటుల ఎంపిక జరుగుతుందని దర్శకుడు చెప్పారు. ఇది వైవిధ్యభరిత యాక్షన్ ఎంటర్టైనర్ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. చిత్ర తొలి షెడ్యూల్ కేరళలోని దట్టమైన అడవుల్లో ప్రారంభించినట్లు తెలిపారు. తదుపరి షెడ్యూల్‌ను ఒడిశా, థాయిల్యాండ్ అడవుల్లో చిత్రీకరించనున్నట్లు దర్శకుడు చెప్పారు. ఇది అటవీ ప్రాంతంలోని ఏనుగులు, అక్కడి మనుషుల జీవన విధానాన్ని ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుందన్నారు. దీనికి ఎస్ఆర్ సతీష్ కుమార్ ఛాయాగ్రహణంను అందిస్తున్నారు. త్వరలో ఇతర వివరాలు వెల్లడించనున్నట్లు చిత్రబృందం చెప్పింది. (ఇదీ చదవండి: 'బేబీ' హీరోయిన్ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?) -
నడవలేని స్థితిలో నటుడు విజయకాంత్.. వీల్ చైర్లోనే..
తమిళసినిమా: నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌ను సీనియర్ దర్శకుడు, విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ మంగళవారం ఆయన ఇంట్లో కలిశారు. వీరి కాంబినేషన్లో పలు విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. ఇంకా చెప్పాలంటే 1971లో విజయకాంత్ కథానాయకుడిగా చట్టం ఒరు ఇరుట్టరై చిత్రం ద్వారా ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ తరువాత తమిళం, తెలుగు, హిందీ భాషల్లో 70కి పైగా చిత్రాలకు ఈయన దర్శకత్వం వహించారు. ఇదిలా ఉంటే తాజాగా చంద్రశేఖర్, విజయకాంత్‌ని కలిసి ఆయనను పలకరించారు. కాగా మంగళవారం(జనవరి 30) నటుడు విజయకాంత్ ప్రేమలత పెళ్లిరోజు. చదవండి: ‘మాస్టర్’ హీరోయిన్ సాక్షి ఇప్పుడు ఎలా ఉంది, ఏం చేస్తుందో తెలుసా? ఈ సందర్భంగా దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ ఆ దంపతులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విజయకాంత్‌ను ఆప్యాయంగా పలకించి కొంతసేపు ఆయనతో ముచ్చటించారు. ఆ ఫొటోలను ఎస్ఏ చంద్రశేఖర్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అవి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కాగా 70 ఏళ్ల విజయకాంత్ కొంతకాలంగా డయాబెటిస్తో బాధపడుతున్నారు. ఇటీవల ఆయన కాలు మూడు వేళ్లను తొలగించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన నడవలేని స్థితిలో ఉన్నారు. అంతేకాదు చూస్తుంటే ఆయన ఆరోగ్యం కూడా క్షిణించినట్లు కనిపిస్తోంది. ఇలా తమ అభిమాన నటుడిని చూసి ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. என் உயிரை நான் சந்தித்த போது 😀@iVijayakant pic.twitter.com/KZ1bP0yyp0 — S A Chandrasekhar (@Dir_SAC) January 31, 2023 -
వడివేలు జీవితాన్ని మలుపు తిప్పిన రైలు జర్నీ
Happy Birthday Day Vadivelu: ఆయనో కమెడియన్. అలాగని ఆషామాషీ నవ్వులు పంచడండోయ్. మూస ధోరణిలో సాగిపోతున్న సినీ కామెడీకి సరికొత్త పాఠాలు నేర్పాడాయన. ‘అసలు ఇలా కూడా కామెడీ చేయొచ్చా?’ అనే రీతిలో ఉంటుంది ఆయన స్టయిల్. అందుకే స్టార్ హీరోలకు సమానమైన ఫ్యాన్డమ్ను సంపాదించుకున్నారాయన. ఒకానోక టైంలో ఏడాదికి పాతికదాకా సినిమాల్లో నటించిన వడివేలు.. అప్పటికప్పుడు సొంతంగా అల్లుకున్న ట్రాకులతోనే కడుపుబ్బా నవ్వించే వారంటే అతిశయోక్తి కాదు. వడివేలు తెర మీద కనిపిస్తే నవ్వుల ప్రవాహం గలగలా పారాల్సిందే.. అందుకే కోలీవుడ్ ఆడియొన్స్ ఆయన్ని ముద్దుగా వాగై పూయల్(వాగై ప్రవాహం) అని పిలుస్తుంటారు. వడివేలు 61వ పుట్టినరోజు ఇవాళ.. వాగై నది మధురై గుండా ప్రవహిస్తుంటుంది. ఆ నది ఒడ్డునే ఉన్న ఓ మధ్యతరగతి కుటుంబంలో సెప్టెంబర్ 12, 1960న పుట్టారు వడివేలు(కుమారవడివేలు నటరాజన్). అసలు చదువే అబ్బని వడివేలు.. చిన్నప్పటి నుంచి తండ్రి గ్లాస్ కట్టింగ్ ఫ్యాక్టరీలో పని చేసేవాడు. ఖాళీ సమయాల్లో వీధి నాటకాలు.. అందులోనూ నవ్వులు పంచే పాత్రలతో అలరించడం చేసేవాడు. అలా దర్శకుడు టీ రాజేందర్ కంటపడడంతో .. ‘ఎన్ తంగి కళ్యాణి’లో ఓ చిన్న వేషం వేషాడు. రాజ్‌కిరణ్‌తో పరిచయం వడివేలు సినీ ప్రయాణం చాలా ఆసక్తికరంగా మొదలైంది. అవకాశాల కోసం ఆయన కనీసం ఏమాత్రం ప్రయాణం చేయలేదు. కానీ, నటుడు రాజ్‌కిరణ్.. వడివేలు సినిమాల్లోకి అడుగుపెట్టడానికి కారణం అయ్యాడు. వడివేలు తన పెళ్లి కోసం రైళ్లో వెళ్తున్న టైంలో.. నటుడు రాజ్‌కిరణ్‌తో పరిచయం అయ్యింది. ఆ సంభాషణ మధ్యలోనే వడివేలులోని నటుడిని గుర్తించి యాక్టింగ్ ఆఫర్ ఇచ్చాడు రాజ్ కిరణ్. అలా రాజ్ కిరణ్ హీరోగా నటించిన ‘ఎన్ రసవన్ మనసిలే’(1991)తో నటుడిగా మారిపోయాడు వడివేలు. ఆ తర్వాత నటుడు విజయ్‌కాంత్ ‘చిన్న గౌండర్’లో వడివేలుకు అవకాశం ఇచ్చి.. తన తర్వాతి సినిమాల్లోనూ మంచి మంచి పాత్రలు ఇచ్చి వడివేలును ప్రొత్సహించాడు. త్రయం నవ్వులు గౌండమణి-సెంథిల్-చార్లీలాంటి టాప్ కమెడియన్ల హవా కోలీవుడ్‌లో కొనసాగుతున్న టైంలో.. వడివేలు ఎంట్రీ ఇచ్చాడు. కమల్ హాసన్ హీరోగా వచ్చిన సింగరవేలన్(మన్మథుడే నా మొగుడు)లో విచిత్రమైన గెటప్, బట్లర్ ఇంగ్లీష్ క్యారెక్టరైజేషన్ వడివేలుకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆపై వరుసగా కామెడీ రోల్స్‌తో కోలీవుడ్‌లో కింగ్ ఆఫ్ కామెడీ ముద్రను దక్కించుకున్నాడు. గౌండమణి-సెంథిల్ కాంబోతో పాటు వడివేలు పంచిన కామెడీ కోలీవుడ్ ఆడియొన్స్‌కు నోస్టాల్జియా అనుభూతుల్ని మిగిల్చింది. తెలుగు వాళ్లకు.. తొంబై, 2000 దశకాల్లో కోలీవుడ్‌లో వడివేలు హవా నడిచింది. రజినీకాంత్, విజయ్‌కాంత్, కమల్ హాసన్, విక్రమ్, సూర్య, అజిత్, ఇలా.. దాదాపు అందరు అగ్రహీరోలతోనూ ఆయన ప్రస్థానం నడిచింది. అలాగే ఇతర కామెడీ యాక్టర్లతోనూ ఆయన స్నేహం కొనసాగించేవాళ్లు. క్షత్రియ పుత్రుడు(తేవర్మగన్) లాంటి సీరియస్ సినిమాలతో పాటు ‘నవ్వండి లవ్వండి, ప్రేమికుడు, మిస్టర్ రోమియో, ప్రేమ దేశం, రక్షకుడు, ఒకే ఒక్కడు, చంద్రముఖి, సింగమలై, ఆరు, ఘటికుడు, పొగరు, దేవా, అదిరింది’ లాంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ఆడియొన్స్‌ను సైతం కితకితలు పెట్టించాడాయన. తెలుగులో స్ట్రయిట్ సినిమా ‘ఆరో ప్రాణం’తో పలకరించాడు. వివాదాలు.. రాజకీయాల ఎంట్రీతో వడివేలు కెరీర్ మసకబారడం మొదలైంది. తన కుటుంబంపై జరిగిన దాడికి బాధ్యుడ్ని చేస్తూ.. కెరీర్ తొలినాళ్లలో తనకు అవకాశాలిచ్చిన విజయ్‌కాంత్ మీదే అటెంప్ట్ టు మర్డర్ కేసుపెట్టి వివాదాలకు తెరలేపాడు వడివేలు. ఆపై విజయ్‌కాంత్‌పై ఎన్నికల్లోనూ పోటీ ప్రకటన చేశాడు. విజయ్‌కాంత్‌తో వైరం కోలీవుడ్‌లో అవకాశాలు తగ్గించడమే కాదు.. రాజకీయంగానూ ఎలాంటి ఎదుగుదలను లేకుండా చేసింది. ఇక ఇమ్సయి అరసన్ 23ఎం పులకేసి(హింసించే 23వ రాజు పులకేశి) సినిమాతో హీరోగానూ వడివేలు సక్సెస్ అందుకున్నాడు. 2018లో ఈ సినిమా సీక్వెల్ విషయంలో దర్శకుడు శంకర్(మొదటి పార్ట్‌కు నిర్మాత), దర్శకుడు చింబు దేవన్‌తో చెలరేగిన చిన్న వివాదం చిలికి చిలికి గాలి వానగా మారింది. వడివేలు వల్ల కోట్ల నష్టం వాటిల్లిందని శంకర్, ఆపై మరికొందరు సినీ నిర్మాతల ఫిర్యాదులపై నడిగర్ సంఘం వడివేలుపై కన్నెర్ర జేసి నిషేధం విధించింది. దీంతో కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. తిరిగి ఈ ఏడాదిలో(2021) ఆయన కొత్త సినిమాలను అంగీకరించినట్లు, ఇది తన సినీ పునర్జన్మగా అభివర్ణించుకుంటున్నారు. విశేషం ఏంటంటే.. లైకా ప్రొడక్షన్స్‌లోనే ఆయన ఐదు సినిమాలు సైన్ చేయడం. ప్రే ఫర్ నేసమణి ఆరులో ‘రక్తం’, పొగరులో ‘కూల్‌డ్రింక్-ఒంటేలు’, సింగమలైలో ‘కానిస్టేబుల్’ కామెడీ పోర్షన్లు తెలుగు ఆడియొన్స్‌ను కడుపుబ్బా నవ్విస్తుంటాయి. సినిమాలతోనే కాదు.. మన బ్రహ్మీలాగా మీమ్స్‌తోనూ వడివేలు విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ఇక 2001లో వచ్చిన ఫ్రెండ్స్(తెలుగులో స్నేహమంటే ఇదేరాగా రీమేక్) మూవీ. త్్్ విజయ్, సూర్య హీరోలు. ఇందులో వడివేలు నేసమణి అనే క్యారెక్టర్ పోషించాడు. ఓ సీన్లో ఆయన నెత్తి మీద సుత్తి పడుతుంది. రెండేళ్ల క్రితం ఈ సీన్ పాక్‌లోని ఓ ట్విటర్ అకౌంట్ ద్వారా ట్రెండ్ కాగా.. నేసమణి పరిస్థితి ఎలా ఉందంటూ ఎంతో మంది ఆరాతీశారు. ఆయన కోలుకోవాలంటూ ‘ప్రే ఫర్ నేసమణి’ ట్రెండ్‌ను కొనసాగించారు. అలా చాలా ఏళ్ల తర్వాత ఆ సీన్ వైరల్ అయ్యి.. వడివేలుకు ఇంటర్నేషనల్ గుర్తింపు తెచ్చిపెట్టింది. - సాక్షి, వెబ్‌స్పెషల్ -
ప్రేమలతకు కరోనా.. రంగంలోకి దిగిన కెప్టెన్
సాక్షి, చెన్నై : డీఎండీకే నేత విజయకాంత్ ఎట్టకేలకు ప్రజల్లోకి వచ్చారు. బుధవారం గుమ్మిడి పూండిలో రోడ్ షోతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఇక ప్రచారంలో ఉన్న ప్రేమలత విజయకాంత్‌కు అధికారులు షాక్ ఇచ్చారు. అమ్మ మక్కల్ కూటమితో కలిసి డీఎండీకే ఎన్నికల్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసింది. డీఎండీకే అభ్యర్థులు 60 స్థానాల్లో పోటీచేస్తున్నారు. అయితే, ఈ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో దూసుకెళ్లే డీఎండీకే నేతలు కరువయ్యారు. విజయకాంత్ సతీమణి ప్రేమలత విరుదాచలంలో పోటీచేస్తుండటంతో, ఆమె ఆ నియోజకవర్గానికే పరిమితం అయ్యారు. ఇతర అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించలేని పరిస్థితి ఉంది. ఇక, విజయకాంత్ బావ మరిది, పార్టీ సంయుక్త ప్రధాన కార్యదర్శి సుదీష్ కరోనా బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో డీఎండీకే అభ్యర్థులకు మద్దతుగా కదిలే నేతలు ఆ పార్టీలో కరువయ్యారు. ఈ పరిస్థితుల్లో అనారోగ్యంతో ఇంటికీ, లేదా కార్యాలయానికి పరిమితమైన విజయకాంత్, తన అభ్యర్థుల కోసం అడుగుబయట పెట్టకతప్పలేదు. బు«ధవారం సాయంత్రం హఠాత్తుగా ఆయన ప్రచార పర్వంలోకి అడుగు పెట్టారు. ఐదు రోజుల పర్యటన... విజయకాంత్ ఎన్నికల ప్రచారంలో విరుదాచలంతోపాటుగా మరో నియోజకవర్గంలో ఓటర్లను కలిసేందుకు తొలుత నిర్ణయించారు. అయితే, తమకు మద్దతుగా ప్రచారం చేసే వాళ్లు లేరంటూ నియోజకవర్గాల నుంచి అభ్యర్థులు పెడుతున్న కేకల్ని విన్న విజయకాంత్ తానొస్తున్నానని అడుగు తీసి ముందుకు వేశారు. ఐదు రోజుల పాటుగా ఆయన ప్రచారం సాగనుంది. బుధవారం సాయంత్రం గుమ్మిడి పూండిలో సుడిగాలి పర్యటనతో ముందుకు సాగారు. అయితే, ఎక్కడా ప్రసంగాలకు తావివ్వలేదు. కేవలం పార్టీ వర్గాలను వాహనం నుంచి పలకరిస్తూ విజయకాంత్ ప్రచారం చేశారు. గురువారం తిరుత్తణిలో, శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు చెన్నైలో తమ అభ్యర్థులు పోటీలో ఉన్న నియోజకవర్గాల్లో ప్రచారానికి ఆయన నిర్ణయించారు. పరీక్ష చేసుకోవాల్సిందే తన సోదరుడు సుదీష్, ఆయన భార్య పూర్ణిమ ఇద్దరు కరోనా బారిన పడటంతో ప్రేమలత విజయకాంత్‌కు సంకటం తప్పలేదు. ఆమె విరుదాచలంలో సుడిగాలి పర్యటనతో ఓట్ల వేటలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో బుధవారం ఆమెకు అధికారులు షాక్ ఇచ్చారు. తప్పనిసరిగా కరోనా పరీక్ష చేసుకోవాల్సిందేనని, తదుపరే ప్రచారంలోకి వెళ్లాలని ఆరోగ్య శాఖ వర్గాలు హెచ్చరించాయి. దీంతో కరోనా టెస్ట్ చేసుకోక తప్పలేదు. ఫలితం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. -
‘ధనుష్, విజయ్ కాంత్ ఇళ్లలో బాంబు’
చెన్నై: గత రాత్రి ఓ అపరిచిత వ్యక్తి చేసిన ఫోన్ చెన్నై పోలీసులకు నిద్ర లేకుండా చేసింది. చివరకు అది ఎవరో ఆకతాయి చేసిన పనిగా తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకు ఏం జరిగిందంటే.. ఓ అపరిచిత వ్యక్తి పోలీసులకు కాల్ చేసి చెన్నైలోని ధనుష్ అభిరామపురం ఇంట్లో, విరుగంబక్కంలోని విజయకాంత్ ఇంట్లో బాంబులు ఉన్నట్లు బెదిరించాడు. దాంతో ఒక్కసారిగా అలర్ట్ అయిన పోలీసులు వెంటనే హీరోల ఇళ్లకు చేరుకున్నారు. బాంబులను నిర్వీర్యం చేసే బృందం హీరోల ఇంటి పరిసరాలు మొత్తం జల్లెడ పట్టారు. గంటల కొలది హై టెన్షన్ అక్కడ చోటు చేసుకుంది. అణువణువూ గాలించిన పోలీసులు, అక్కడ ఎటువంటి పేలుడు పదార్ధం లేదని నిర్ధారణకు వచ్చారు. దీనితో ఇది ఎవరో ఆకతాయి పని కావచ్చని పోలీసులు భావించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, విచారణ మొదలుపెట్టారు. ఫోన్ నంబర్ ఆధారంగా ఆ నిందితుడిని పట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. (చదవండి: హీరో ధనుష్‌కి మధురై హైకోర్టు షాక్) అయితే ఈ మధ్య కాలంలో చెన్నైలో ప్రముఖ హీరోలకు ఈ తరహా బెదిరింపు కాల్స్ ఎక్కువైపోయాయి. కొన్ని నెలల క్రితం రజనీ కాంత్ ఇంటిలో బాంబ్ ఉందని ఒకరు బెదిరించారు. దాంతో పోలీసులు రజనీ ఇల్లు జల్లెడ పట్టి చివరకు అది ఒక ఫేక్ కాల్ అని గుర్తించారు. ఆ ఫోన్ చేసిన బాలుడు మతిస్థిమితం లేనివాడని తెలుసుకొని, అతన్ని వదిలేశారు. అలానే హీరో అజిత్, విజయ్ నివాసాలలో బాంబులు పెట్టినట్లు ఫేక్ కాల్స్ రావడం జరిగింది. ప్రముఖులు కావడంతో పాటు విషయాన్ని తేలికగా తీసుకోకుండా పోలీసులు ప్రతిసారి పరుగులు పెట్టాల్సివస్తుంది. ఆకతాయిలు మాత్రం తరచుగా ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారు. ధనుష్ ఇంటిలో బాంబ్ లేదన్న విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. -
నడిగర్ సంఘం ఎన్నికల్లో రాజకీయాల్లేవు
పెరంబూరు: నడిగర్‌సంఘం ఎన్నికల్లో రాజకీ య ప్రభావం లేదని ఐసరిగణేశ్ పేర్కొన్నారు. ఈ సంఘానికి 2019–2022 ఏడాదికిగానూ రానున్న 23వ తేదీన ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో విశాల్ పాండవర్ జట్టు, కే.భాగ్యరాజ్ స్వామిశంకరదాస్ జట్టు బరిలోకి దిగుతున్నాయి. ఈ సారి కూడా పోటీ బలంగా ఉండడం, ఎన్నికలకు మరో 9 రోజులే గడువు ఉండడంతో ప్రచార మోత మొదలైంది. సభ్యులను ప్రభావితం చేసేలా వాగ్దానాస్త్రాలను ఇరు జట్లు తమ అంబులపొదలలో వేసుకుని సంధించడానికి సిద్ధం అయ్యారు. కాగా ఈ సారి ప్రచారంలో స్వామిశంకర్దాస్ జట్టు ముందుంది. నడిగర్ సంఘం ప్రస్తావనలో నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ పేరు గుర్తుకు రాక తప్పదు. సంఘం అప్పుల భారం మోస్తున్న తరుణంలో పార్టీకి అధ్యక్ష పదవిని చేపట్టిన విజయకాంత్ సంఘాన్ని రుణ విముక్తి చేసి లాభాల బాట పట్టించారు. దీంతో సంఘంలో ఆయనకు అత్యంత గౌరవ మర్యాదలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో ఏ జట్టు అయినా ఆయనను కలిసి మద్దతు తీసుకుంటారు. అలా గురువారం ఉదయం స్వామిశంకరదాస్ జట్టు విజయకాంత్‌ను ఆయన ఇంట్లో కలిసి మద్దతు కోరారు. అనంతరం ఆ జట్టు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న దర్శక, నటుడు కే,.భాగ్యరాజ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇటీవల ఆయన నాటక కళాకారులకు డబ్బు ఇస్తానన్న మాటలు చర్చనీయాంశంగా మారాయి. ఈ విషయాన్ని ఆయన ముందు ప్రస్తావించగా, అందుకు బదలిచ్చిన కే.భాగ్యరాజ్ తాను ఓటుకు నోటులిస్తానని చెప్పలేదని, సాధారణంగా సినీ కళాకారులు ఆర్థి కంగా చితికిపోయిన నాటక కళాకారులను కలసినప్పుడు వారికి డబ్బు ఇవ్వడం జరుగుతుందని, ఇందుకు నటుడు విశాల్, కార్తీ వంటి వారూ అతీ తులు కాదని పేర్కొన్నారు. విజయకాంత్‌ను కలవడం గురించి అడిగిన ప్రశ్నకు విజయకాంత్‌ను కలవడం సంతోషంగా ఉందని, ఆయన తమ చేతులు పట్టుకుని ఆశీర్వదించారని చెప్పారు. ఆ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అదే విధంగా నడిగర్‌సంఘం ఎన్నికల్లో రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయని సీనియర్ నటుడు,నడిగర్‌సంఘం మాజీ కార్యదర్శి రాధారవి చేసిన వ్యాఖ్యల గురించి ప్రశ్నించగా నటుడు,నిర్మాత, ప్రస్తుతం సంఘ కార్యదర్శి పదవికి పోటీలో ఉన్న ఐసరిగణేశ్ స్పందిస్తూ తమ జట్టుకు పలువులు సహకరిస్తున్నారనీ, అయితే నటుడు రాధారవి తమకు మద్దతుగా వ్యవహరిస్తున్నారని చెప్పలేమనీ అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అని అన్నారు.తమకు సంబంధించినంత వరకూ ఈ ఎన్నికల్లో రాజకీయ జోక్యం లేదనీ ఐసరిగణేశ్ పేర్కొన్నారు. -
మెట్టుదిగని కెప్టెన్
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే–బీజేపీ కూటమి దాదాపు ఖరారైపోగా ఒక్క డీఎండీకే విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. 9 స్థానాలకు డీఎండీకే పట్టుబడుతుండగా నాలుగు లేదా ఐదు స్థానాలు మాత్రమేనని అన్నాడీఎంకే స్పష్టం చేసింది. మొత్తం 40 పార్లమెంటు స్థానాల్లో కనీసం 20 స్థానాల్లో ఖచ్చితంగా పోటీచేయాలని అన్నాడీఎంకే నేతలు భావిస్తున్నారు. మిగిలిన 20 స్థానాలను మిత్రపక్షాలకు వదిలేశారు. ఇందులో బీజేపీకి ఐదు, పీఎంకేకు ఏడు స్థానాలపై ఒప్పందం జరిగిపోయింది. ఇక మిగిలిన 8 స్థానాల్లో పుదియతమిళగం, తమిళ మానిల కాంగ్రెస్ (ఇంకా చర్చల దశలో), ఇండియా జననాయక కట్చి, పుదియనీదికట్చిలకు తలా ఒకటి కేటాయించాలని నిర్ణయించారు. ఇక డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌కు మిగిలింది నాలుగుస్థానాలే. అయితే ఆయన 9 స్థానాలను కోరుతుండగా ఎంతమాత్రం వీలుకాదని అన్నాడీఎంకే తేల్చిచెప్పేసింది. మూడు లేదా నాలుగుస్థానాలు మాత్రమే కేటాయించగలమని స్పష్టం చేసింది. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్, కేంద్రమంత్రి పీయూష్‌గోయల్ మంగళవారం రాత్రి వరకు విజయకాంత్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఎంతకూ ఆయన మెట్టుదిగకపోవడంతో పీయూష్‌గోయల్ ఢిల్లీకి వెళ్లిపోయారు. ఈ దశలో ఇరుపక్షాల మధ్య ప్రతిష్టంభన నెలకొంది. ఇదిలా ఉండగా బీజేపీ కూటమిలో పీఎంకే చేరడానికి నిరసనగా పీఎంకే యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి రాజేశ్వరి ప్రియా రాజీనామా చేశారు. ఉప ఎన్నికల షరతుపై డీఎండీకే నో: సీట్ల సర్దుబాట్లు అలా ఉంచితే ఖాళీగా ఉన్న 21 అసెంబ్లీ స్థానాల్లో మిత్రపక్షంగా ఎన్నికల ప్రచారం చేయాలని, పోటీ అభ్యర్థులను పెట్టరాదు, ఎన్నికల ప్రచారం చేయాలనే నిబంధనలకు బీజేపీ, పీఎంకే సమ్మతించినట్లు సమాచారం. అయితే డీఎండీకే మాత్రం ఈ నిబంధనకు ససేమిరా అని కుండబద్దలు కొట్టడం ప్రతిష్టంభనకు మరోకారణౖమైంది. పార్లమెంటు స్థానాల్లో్ల మిత్రపక్షం, అసెంబ్లీ స్థానాలో ప్రతిపక్షంగా వ్యవహరించడం ఏమిటని డీఎండీకేను అన్నాడీఎంకే ప్రశ్నిస్తోంది. ఉప ఎన్నికల్లో అభ్యర్థులను పోటీపెట్టబోమని హామీ ఇచ్చినట్లయితేనే నాలుగు లేదా ఐదు స్థానాలను కేటాయించగలమని అన్నాడీఎంకే వాదిస్తోంది. ఇదిలా ఉండగా, తాము కోరినన్ని సీట్లు కేటాయించని పక్షంలో తీవ్రమైన నిర్ణయం తీసుకోకతప్పదని విజయకాంత్ హెచ్చరించారు. బుధవారం రాత్రికి డీఎండీకే, అన్నాడీఎంకే మధ్య సామరస్యపూర్వకమైన ఒప్పందం జరుగుతుందని అంచనా వేస్తున్నారు. -
ప్రతిపక్షం అన్నింటా వైఫల్యం
తిరువళ్లూరు: రాష్ట్రంలో అసమర్ధుడైన ప్రతిపక్ష నాయకుడు ఉండడం వల్లే ప్రజా సమస్యలపై గళమెత్తే పరిస్థితి లేకుండా పోయిందని డీఎండీకే అధినేత విజయకాంత్ సతీమణి ప్రేమలత ఆరోపించారు. బస్సు చార్జీల మోతకు నిరసనగా డీఎండీకే ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం తిరువళ్లూరులోని బజారువీధిలో ధర్నాకు జిల్లా కన్వీనర్ కృష్ణమూర్తి నాయుడు అధ్యక్షత వహించారు. ప్రేమలతా విజయకాంత్ హాజరై ప్రసంగించారు. మొదట ఆమె ఎద్దుల బండిపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినా దాలు చేస్తూ, బస్సు చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆమె ప్రసంగిస్తూ రాష్ట్రంలో స్టాలిన్ లాంటి అసమర్థ నేత ప్రతిపక్షంగా ఉండడం ప్రజల దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. స్టాలిన్ ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేడని జోస్యం పలికారు. అన్నాడీఎంకే ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని స్పష్టం చేసిన ఆమె, వచ్చే ఎన్నికల్లో అన్నాడీఎంకే అడ్రస్ లేకుం డా పోతుందని విమర్శించారు. రవాణా శాఖలో రూ.5,700 కోట్ల కుంభకోణం, కార్మిక సంఘాల పేరిట విధులకు హాజరు కాకుండా జీతాలు తీసుకుంటున్న నేతల వైఖరే నష్టాలకు కారణమని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో సినీ నటులు రాజకీయ పార్టీలను ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నారని పరోక్షంగా కమల్ రజనీకాంత్‌లను ఉద్దేశించి ప్రసంగించిన ప్రేమలత, జయలలిత ఉన్నప్పుడు వారెం దుకు పార్టీని స్థాపించలేదని ప్రశ్నించారు. ఆందోళనలో పార్టీ నేతలు శేఖర్, శరవణన్, రజనీకాంత్ పాల్గొన్నారు. -
వేడెక్కిన స్థానికం
సాక్షి, చెన్నై: స్థానిక ఎన్నికల సమరం వేడెక్కింది. నామినేషన్ల పర్వం వేగం పెరిగింది. డీఎంకే తొలి జాబితా ప్రకటించింది. ఇందులో కాంగ్రెస్‌కు కంటి తుడుపు సీట్లే దక్కాయి. ఇక, అభ్యర్థుల్ని మార్చాల్సిందేనని పట్టుబడుతూ అన్నాడీఎంకేలో నిరసనలు హోరెత్తుతున్నాయి. టవర్ ఎక్కి మరీ తమ అభిమానాన్ని నాయకులు చాటుకున్నారు. కాగా, అన్ని పార్టీలు ఉరకలు పరుగులు తీస్తుంటే, డీఎండీకే అధినేత విజయకాంత్ శిబిరంలో హడావుడి కానరావడం లేదు. స్థానిక ఎన్నికల బరిలో నిలిచేందుకు అన్నాడీఎంకే అభ్యర్థుల జాబితా ప్రకటన ఆ పార్టీలో పలు చోట్ల ప్రకంపనలు సృష్టిస్తోంది. పార్టీ కోసం శ్రమిస్తున్న వాళ్లకు కాకుండా, కొత్త ముఖాలకు సీట్లు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని చోట్ల, పాత వాళ్లకే మళ్లీ సీటు ఇవ్వడాన్ని ఖండిస్తూ మరి కొన్ని చోట్ల నిరసనలు బుధవారం కూడా హోరెత్తాయి. ప్రధానంగా చెన్నైలో అయితే, పలు వార్డుల్లో నిరసనలు ఉద్రిక్తతకు దారి తీస్తున్నాయి. 158వ వార్డు సీటును సిట్టింగ్ కౌన్సిలర్ రాజశేఖర్ సతీమణి కవితకు ఇవ్వడాన్ని ఖండిస్తూ, బర్మా కన్నన్ వర్గీయులు ఆందోళనకు దిగారు. వారి మద్దతు దారులు ముగ్గురు నందంబాక్కం ట్రేడ్ సెంటర్ వద్ద సెల్ టవర్ ఎక్కడం ఉత్కంఠ రేపింది. వీరిని బుజ్జగించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. చివరకు అన్నాడీఎంకే పెద్దల జోక్యంతో వారు టవర్ దిగారు. 163, 125, 127, 129 వార్డుల్లోని అభ్యర్థులను మార్చాలని పట్టుబడుతూ మహిళలు పోరు బాట పట్టారు. కొన్ని చోట్ల అభ్యర్థుల మార్పునకు పట్టుబడుతూ నిరాహర దీక్ష చేపట్టారు. ఇలాంటి నిరసనల తంతు రాష్ర్ట వ్యాప్తంగా సాగుతుండడంతో వారిని బుజ్జగించడం సీట్లు దక్కించుకున్న వాళ్లకు భారంగా మారింది. ఒక సీటు రూ.కోటి: కొన్ని చోట్ల ఏకగ్రీవాలు హోరెత్తుతున్నాయి. కార్పొరేషన్, మున్సిపాలిటీ, పట్టణ పంచాయతీ, జిల్లా, యూనియన్ పంచాయతీల ఎన్నికలు పార్టీల వారీగా సాగుతుండడంతో ఇక్కడ ఏకగ్రీవాలకు ఛాన్స్ అరుదే. అయితే, గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవాలకు అవకాశాలు ఎక్కువే. దీంతో కొన్ని గ్రామాల్లో వేలం ద్వారా పంచాయతీ అధ్యక్షుడి ఎంపిక సాగించే పనిలో గ్రామ పెద్దలు నిమగ్నమయ్యారు. ఇందుకు అద్దం పట్టే విధంగా బుధవారం నీడామంగళం పంచాయతీ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవి ఎంపిక సాగింది. అధ్యక్ష పదవికి స్థానికంగా ఉన్న ఓ సామాజిక వర్గ పెద్ద రూ.1.10కోట్లకు వేలం ద్వారా ఎంపికయ్యారు. ఇక, ఉపాధ్యక్ష పదవికి ఆ దరిదాపుల్లో వేలం సాగినట్టు సమాచారం. అయితే, ఈ విషయం ఎన్నికల వర్గాల దృష్టికి చేరలేదు. మీడియాల్లో వచ్చిన వార్తతో విచారించే పనిలో పడ్డారు. కాగా, తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ, స్థానిక ఎన్నికల్ని బహిష్కరిస్తున్నామని పుదుకోట్టై జాలర్లు ప్రకటించడం గమనార్హం. డీఎంకే తొలి జాబితా: ఎన్నికల రేసులో తమ అభ్యర్థుల తొలి జాబితాను డీఎంకే ప్రకటించింది. అయితే, అన్నాడీఎంకే కంటే భిన్నంగా జిల్లాల వారీగా సేకరించిన వివరాలు, సమాచారాలతో అభ్యర్థుల ఎంపిక సాగింది. తొలి జాబితాను డీఎంకే ప్రధాన కార్యదర్శి అన్భళగన్ ప్రకటించారు. ఆ మేరకు సేలం కార్పొరేషన్‌లోని 60 స్థానాల్లో కాంగ్రెస్‌కు ఐదు, ఇండియన్ యూనియన్ ముస్లీం లీగ్‌కు ఒకటి కేటాయించారు. మిగిలిన 54 వార్డుల్లో డీఎంకే అభ్యర్థులు రేసులో దిగారు. తిరుచ్చి పరిధిలో 65 వార్డులు ఉండగా, ఇందులో కాంగ్రెస్‌కు మూడు మాత్రం కేటాయించి, 62 వార్డుల్లో డీఎంకే పోటీ చేయనుంది. తూత్తుకుడిలో 51 వార్డుల్లో డీఎంకే, ఐదు వార్డుల్లో కాంగ్రెస్, రెండు చోట్ల ఇండియన్ యూనియన్ ముస్లీం లీగ్ అభ్యర్థులు పోటీ చేయనున్నారు. జిల్లాల్లో డీఎంకే, కాంగ్రెస్ , ఇతర మిత్ర పక్షాల నాయకులు కూర్చుని చర్చించి, సిద్ధం చేసి తమకు పంపుతున్న మేరకు జాబితాలను డీఎంకే విడుదల చేస్తుండటం గమనార్హం. కెప్టెన్ డౌటేనా..?: స్థానిక ఎన్నికల్లో డీఎండీకే అభ్యర్థులు రేసులో ఉంటారా..? అన్న అనుమానం మొదలైంది. నామినేషన్ల పర్వం మొదలై మూడు రోజులు గడిచినా ఆ శిబిరంలో ఎలాంటి హడావుడి కన్పించడం లేదు. పోటీకి నేతలు ఉత్సాహం చూపించని దృష్ట్యా, అభ్యర్థుల ఎంపికలో డీఎండీకే అధినేత విజయకాంత్ మల్లగుల్లాలు పడుతున్నారు. ఒంటరిగా ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు సిద్ధపడ్డా, రేసులో నిలిచే వారి సంఖ్య అంతంత మాత్రంగానే ఉండడంతో ఎన్నికల్ని బహిష్కరిద్దామా..? అనే యోచనలో కెప్టెన్ ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. కసరత్తుల్లో సీతారామన్: ఓ వైపు రాజకీయ పక్షాలు ఉరకలు పరుగులు తీస్తుంటే, మరో వైపు రాష్ట్ర ఎన్నికల కార్యాలయం నుంచి ఏర్పాట్ల మీద అధికారి సీతారామన్ దృష్టి పెట్టారు. ఎన్నికల పర్యవేక్షకులు, పరిశీలకులతో బుధవారం కోయంబేడు కార్యాలయంలో సమాలోచించారు. నగదు బట్వాడా కట్టడి, నిఘా కట్టుదిట్టం లక్ష్యంగా చర్యలు తీసుకుంటూ నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే, కోడ్ ఉల్లంఘించే వారి భరతం పట్టే విధంగా కేసుల మోతకు ఆదేశాలిచ్చారు. రేషన్ కార్డుల జారీకి తాత్కాళిక బ్రేక్ వేయడంతో పాటుగా చాపకింద నీరులా ప్రభుత్వ పథకాల పంపిణీ సాగకుండా నిఘా పెంచే పనిలో పడ్డారు. ఇక, రాష్ట్రంలో నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి తొలి రోజు పది కేసులు నమోదయ్యాయి. ఇందులో అన్నాడీఎంకే వర్గాలే ఎక్కువ. ఇక, నామినేషన్ల వేగం పుంజుకోవడంతో, ఆయా స్థానిక సంస్థల్లో సందడి మొదలైంది. కొందరు అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్లే పనిలో పడ్డారు. సంప్రదింపులు నేడు రెండు రాష్ట్రాల మధ్య సంప్రదింపులు: కావేరి జలాల విషయంగా కర్ణాటక, తమిళనాడు అధికారులు ఒకే వేదిక మీదుగా సంప్రదింపులకు సిద్ధం అయ్యారు. గురువారం ఢిల్లీలో కేంద్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉమాభారతి నేతృత్వంలో జరిగే ఈ సమీక్షకు రాష్ట్ర మంత్రి ఎడపాడి పళని స్వామి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు నేతృత్వంలో అధికారుల కమిటీ పయనం అయింది. ఇక, కర్ణాటక సీఎం సిద్దరామయ్య నేతృత్వంలో కమిటీ ఢిల్లీలో చర్చలకు సిద్ధమైంది. అయితే, నీళ్లు ఇచ్చే ప్రసక్తే లేదన్నట్టుగా తమ వాదనలు ఉంటాయని ఆయన వ్యాఖ్యానించడం తమిళనాట ఆక్రోశాన్ని రగుల్చుతోంది. -
అన్నా డబ్బుల్లేవు..
కెప్టెన్‌కు నేతల షాక్ ఇక దరఖాస్తుల హోరు తమిళనాడు ‘స్థానిక’ సమరం డీఎండీకే వర్గాలకు జీవన్మరణ సమస్యగా మారింది. ఓ వైపు బల నిరూపణ, మరో వైపు ఎన్నికల ఖర్చుకు నిధి కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఉన్నదంతా పార్టీ కోసం ఇన్నాళ్లు ఖర్చు పెట్టిన వాళ్లంతా, ఇప్పుడు ‘అన్నా’ డబ్బుల్లేవు...నీవే దిక్కు అని కెప్టెన్ కోర్టులోకి బంతిని నెట్టే పనిలో పడ్డారు. ఇందుకు తగ్గ షాక్‌లను పార్టీ అధినేత విజయకాంత్‌కు ఇచ్చే పనిలో జిల్లా నేతలు ఉన్నారు. చెన్నై : రాష్ట్రంలో డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయ శక్తి డీఎండీకే అన్నట్టుగా ప్రజల మన్ననల్ని అందుకున్న నాయకుడు విజయకాంత్. పార్టీ ఆవిర్భావ సమయంలో సినీ అభిమానం ఆయన వెంట కదిలింది. అభిమాన లోకం రాజకీయంగా ఎదిగారు. తమ నేత ఇచ్చే పిలుపుమేరకు చేపట్టే కార్యక్రమాలకు ఇళ్లు గుళ్ల చేసుకున్న వాళ్లెందరో ఉన్నారు. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష నేతగా అవతరించినా, చివరకు అధికార పక్షంతో విజయకాంత్ పెట్టుకున్న వైరం డీఎండీకే వర్గాల్ని ఆర్థికంగా మరింత కష్టాల్లోకి నెట్టిందని చెప్పవచ్చు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో అయితే, చావు దెబ్బే తిన్నారు. ఇక, తాము ఇమడలేమంటూ పెద్ద సంఖ్యలో కేడర్ డీఎండీకేను వీడింది. దీంతో మిగిలిన వాళ్లను రక్షించుకునేందుకు విజయకాంత్ తీవ్రంగానే కుస్తీలు పట్టారు. ఇప్పుడు ఉన్న కేడర్‌లో ఆర్థికంగా దెబ్బ తిన్న వాళ్లు కొందరు అయితే, మరి కొందరు చేతిలో చిల్లిగవ్వకూడా లేకుండా రాజకీయాలు చేసే వాళ్లు ఉన్నారని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ నేతల్లో స్థానిక ఎన్నికల ఖర్చు గుబులు బయలు దేరింది. ఎక్కడ తమ నెత్తిన వేసే రీతిలో కెప్టెన్ పిలుపునిస్తారో అన్న ఉత్కంఠ బయలు దేరింది. దీంతో ముందస్తుగా మేల్కొన్న జిల్లాల నేతలు అన్నా..డబ్బుల్లేవు...నీవే దిక్కు అన్నట్టు విజయకాంత్ వద్ద మొరపెట్టుకునే పనిలో పడ్డారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? పొత్తా? ఒంటరా..? అన్న అంశాలపై కేడర్ అభిప్రాయాల్ని విజయకాంత్ స్వీకరించే పనిలో పడ్డారు. మంగళవారం నుంచి ఈ ప్రక్రియ సాగుతూ వస్తోంది. ఇందులో జిల్లాలు, డివిజన్ల నుంచి వస్తున్న నేతలు విజయకాంత్‌కు షాక్‌లు ఇచ్చే పనిలో పడ్డారట..!. బలోపేతం లక్ష్యంగా కెప్టెన్ ఇచ్చే సూచనలు, సలహాలను నేతలు చక్కగా ఆలకిస్తున్నారు. అదే అభిప్రాయాల విషయానికి వచ్చే కొద్ది నేతలు తమ గళాన్ని విప్పే పనిలో పడడం కెప్టెన్‌కు పెద్ద షాక్కే అంట..!. డబ్బుల్లేవు, మళ్లీ..మళ్లీ తాము సొంత డబ్బులు ఖర్చు పెట్టలేం అన్న సమాధానాలు పెద్ద సంఖ్యలో వచ్చినట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలకు దూరంగా ఉంటే మంచిదన్నట్టుగా సలహాలు ఇచ్చే పనిలో పడ్డట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. అందరి అభిప్రాయాల్ని శ్రద్ధంగా వినే విజయకాంత్, చివరలో ఎన్నికల్లోకి వెళ్తున్నాం...తాను సూచించే వ్యక్తి గెలుపునకు శ్రమించాల్సిందే అంటూ కేడర్‌కు హుకుం జారీ చేసి పంపించేస్తున్నట్టు సమాచారం. ఇంత మాత్రానికి తమను పిలిపించి అభిప్రాయాలు సేకరించడం ఏమిటో అంటూ పలువురు నేతలు కోయంబేడులోని పార్టీ కార్యాలయం నుంచి బయట పడ్డాక పెదవి విప్పే పనిలో పడడం గమనార్హం. అదే సమయంలో తాను మాత్రం తగ్గేది లేదన్నట్టుగా విజయకాంత్ ముందుకు సాగుతుండడంతో స్థాని కంలో బలాన్ని చాటగలమా అన్న అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారట! ఇక, ఓ వైపు కేడర్ అభిప్రాయాలు అంటూ, మరో వైపు దరఖాస్తుల స్వీకరణ అంటూ విజయకాంత్ తనదైన రూట్లో పయనం సాగిస్తుండడం గమనార్హం. దరఖాస్తుల హోరు : ఎన్నికలపై అభిప్రాయ సేకరణ ఓ వైపు కోయంబేడులోని పార్టీ కార్యాలయంలో సాగితే, మరో వైపు బుధవారం నుంచి ఎన్నికల బరిలో నిలబడే ఆశావహులు దరఖాస్తులు సమర్పించుకునే విధంగా ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేయడం ఆలోచించదగ్గ విషయమే. ఇక విజయకాంత్ రూటే సెపరేటుగా ఉంటే, పీఎంకే అయితే, తాము ఒంటరే అన్నది స్పష్టం చేశారు. ఎన్నికల బరిలో నిలబడే ఆశావహుల నుంచి దరఖాస్తుల ఆహ్వానానికి శ్రీకారం చుట్టారు. అలాగే, బీజేపీ సైతం ఒంటరి అన్నట్టుగానే దరఖాస్తుల పర్వానికి శ్రీకారం చుట్టింది. కోడంబాక్కంలో ఈ దరఖాస్తుల పంపిణీని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ ప్రారంభించేశారు. దీంతో ఆయా పార్టీలో దరఖాస్తుల పర్వం వేగం పుంజుకుంది. -
విజయకాంత్ కు ఊరట
న్యూఢిల్లీ: పరువు నష్టం కేసులో డీఎండీకే అధినేత విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలతకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. వీరికి తిరుప్పూర్ కోర్టు జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ పై అత్యున్నత న్యాయస్థానం గురువారం స్టే ఇచ్చింది. ముఖ్యమంత్రి జయలలితపై అనుచిత వ్యాఖ్యలు, ఆధార రహిత ఆరోపణలు చేశారని ఆరోపిస్తూ విజయకాంత్, ప్రేమలతపై తమిళనాడులోని పలు జిల్లాల్లో పరువు నష్టం దావా వేశారు. ఈ నేపథ్యంలో విచారణకు హాజరుకాకపోవడంతో వీరికి తిరుప్పూర్ కోర్టు పీటీ వారెంట్ జారీచేసింది. మరోవైపు ఆగస్టు 9న తమ ఎదుట హాజరుకావాలని విల్లుపురం కోర్టు బుధవారం సమన్లు జారీ చేసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన విజయకాంత్ కు పరువునష్టం కేసులు తలనొప్పిగా మారాయి.