ఎట్టకేలకు కెప్టెన్ పొత్తు ఖరారైంది! | Alliance talks between DMDK and People's Welfare Front (PWF) successful | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు కెప్టెన్ పొత్తు ఖరారైంది!

Published Wed, Mar 23 2016 12:00 PM | Last Updated on Sun, Sep 3 2017 8:24 PM

ఎట్టకేలకు కెప్టెన్ పొత్తు ఖరారైంది!

ఎట్టకేలకు కెప్టెన్ పొత్తు ఖరారైంది!

చెన్నై: రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో  ఎవరితో జతకడతాడో అన్న విషయంలో గత కొంతకాలంగా ఉన్న సందిగ్ధతకు కెప్టెన్ విజయ్కాంత్ బుధవారం తెరదించాడు. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వమే లక్ష్యంగా పావులు కదిపిన కెప్టెన్ ఎట్టకేలకు తన పంతం నెగ్గించుకున్నాడు. నాలుగు పార్టీల కూటమి పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్(పీడబ్ల్యూఎఫ్) నాయకులు.. వైగో(ఎండీఎంకే), తోల్ తిరుమవలవన్(వీసీకే), జీ. రామకృష్ణన్(సీపీఎం), ఆర్. ముతరాసన్(సీపీఐ)లు బుధవారం ఉదయం డీఎండీకే కార్యాలయంలో విజయ్కాంత్తో జరిపిన చర్చలు సఫలమయ్యాయి.

కెప్టెన్ ఆధ్వర్యంలోని డీఎండీకే 124 స్థానాల్లో, పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ అభ్యర్థులు 110 స్థానాల్లో పోటీ చేయడానికి పొత్తు కుదిరింది. దీనిలో భాగంగా డీఎండీకే-పీడబ్ల్యూఎఫ్ కూటమికి కెప్టెన్ విజయ్కాంత్ సీఎం అభ్యర్థిగా ఖరారయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement