SA Chandrasekhar Meets Actor Vijayakanth On His Wedding Anniversary, Pics Goes Viral - Sakshi
Sakshi News home page

Vijayakanth: నడవలేని స్థితిలో నటుడు విజయకాంత్‌.. వీల్‌ చైర్‌లోనే..

Published Thu, Feb 2 2023 12:14 PM | Last Updated on Thu, Feb 2 2023 3:50 PM

SA Chandrasekhar Meets Actor Vijayakanth On His Wedding Anniversary - Sakshi

తమిళసినిమా: నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌ను సీనియర్‌ దర్శకుడు, విజయ్‌ తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్‌ మంగళవారం ఆయన ఇంట్లో కలిశారు. వీరి కాంబినేషన్‌లో పలు విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. ఇంకా చెప్పాలంటే 1971లో విజయకాంత్‌ కథానాయకుడిగా చట్టం ఒరు ఇరుట్టరై చిత్రం ద్వారా ఎస్‌ఏ చంద్రశేఖర్‌ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ తరువాత తమిళం, తెలుగు, హిందీ భాషల్లో 70కి పైగా చిత్రాలకు ఈయన దర్శకత్వం వహించారు. ఇదిలా ఉంటే తాజాగా చంద్రశేఖర్‌, విజయకాంత్‌ని కలిసి ఆయనను పలకరించారు. కాగా మంగళవారం(జనవరి 30) నటుడు విజయకాంత్‌ ప్రేమలత పెళ్లిరోజు.

చదవండి: ‘మాస్టర్‌’ హీరోయిన్‌ సాక్షి ఇప్పుడు ఎలా ఉంది, ఏం చేస్తుందో తెలుసా?

ఈ సందర్భంగా దర్శకుడు ఎస్‌ఏ చంద్రశేఖర్‌ ఆ దంపతులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విజయకాంత్‌ను ఆప్యాయంగా పలకించి కొంతసేపు ఆయనతో ముచ్చటించారు. ఆ ఫొటోలను ఎస్‌ఏ చంద్రశేఖర్‌ తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. అవి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. కాగా 70 ఏళ్ల విజయకాంత్‌ కొంతకాలంగా డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. ఇటీవల ఆయన కాలు మూడు వేళ్లను తొలగించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన నడవలేని స్థితిలో ఉన్నారు. అంతేకాదు చూస్తుంటే ఆయన ఆరోగ్యం కూడా క్షిణించినట్లు కనిపిస్తోంది. ఇలా తమ అభిమాన నటుడిని చూసి ఫ్యాన్స్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement