SA chandrasekhar
-
నటి రాధికకు జంటగా దళపతి విజయ్ తండ్రి.. సినిమాలో మాత్రం కాదు
తమిళ స్టార్ డైరెక్టర్, హీరో విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తమిళంలో స్టార్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన ఆయన తెలుగులోనూ ఎన్నో చిత్రాలు రూపొందించారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన దేవాంతకుడు, చట్టానికి కళ్లులేవు, పల్లెటూరి మొనగాడు వంటి సినిమాలను రూపొందించి టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. తన సొంత డైరెక్షన్లోనే తనయుడిని హీరోగా మార్చారు. చదవండి: ఉత్తమ దర్శకుడిగా అంతర్జాతీయ అవార్డును కైవసం చేసుకున్న ‘బలగం’ వేణు ‘వెట్రి’ అనే సినిమాతో విజయ్‌ని బాలనటుడిగా తెరంగేట్రం చేయించిన ఆయన ‘నాలైయ’ తీర్పు మూవీతో హీరోగా మార్చారు. అలా తన దర్శకత్వంలో విజయ్‌తో సినిమాలు చేసి స్టార్ హీరోగా గుర్తింపు ఇచ్చారు. అలా కోలీవుడ్‌కు ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్స్ ఇచ్చిన ఆయనకు ఈ మధ్య పెద్దగా సక్సెస్ రావడం లేదు. ప్రస్తుతం అడపదడపా చిత్రాలు చేస్తూ వస్తున్న ఆయన తాజాగా బుల్లితెర ఎంట్రీ ఇచ్చారు. త్వరలో ప్రసారం కాబోయే ఈ సీరియల్లో ప్రముఖ నటి రాధిక శరత్ కుమార్‌తో ఆయన జతకట్టబోతున్నారు. చదవండి: హైదరాబాద్‌లోని ఆలయంలో ఓం రౌత్ ప్రత్యేక పూజలు, ఫొటోలు వైరల్ ఈ సీరియల్ పేరు కిజాగు వాసల్. దీనిని నటి రాధిక నిర్మించడం విశేషం. ఇక స్టార్ డైరెక్టర్, విజయ్ తండ్రి అయిన ఆయన టీవీ సీరియల్లో నటించడంపై దళపతి ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు మీ కొడుకు పరువు తీస్తున్నారంటూ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. కాగా విజయ్‌కి ఆయన గతంలో మనస్పర్థలు వచ్చిన సంగతి తెలిసిందే. విభేదాల వల్ల విజయ్, ఆయన తండ్రి కోర్టు మెట్లు కూడా ఎక్కారు. అప్పట్లో ఈ వ్యవహరం కోలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. Life takes us on different journeys and teaches us many things. We will grow to be the best version of ourselves. Need everyone’s good wishes as Radaan launches “Kizhaku Vaasal” on #VijayTV @vijaytelevision , with #sachandrasekar sir leading the cast, with a great crew🙏🙏 pic.twitter.com/hxV2wDNHF1 — Radikaa Sarathkumar (@realradikaa) April 5, 2023 -
విజయ్ తొలి అభిమానిగా మారి సంఘం ఏర్పాటు చేశాను: దళపతి తండ్రి
తమిళసినిమా: కమర్షియల్ చిత్రాలకు కేరాఫ్ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్. చట్టం ఒరు ఇరుట్టరై చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన ఈయన చిత్రాలన్నీ అవినీతి, అక్రమాలపై పోరాడేవిగానే ఉంటాయి. రాజకీయ సెటైర్లు ఎక్కువగానే ఉంటాయి. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో 70 చిత్రాలు చేసిన 40 ఏళ్ల నాన్‌స్టాప్ సినీ ప్రస్థానం ఎస్ ఏ.చంద్రశేఖర్ ది. ఈయన తాజాగా స్వీయ దర్శకత్వంలో నిర్మించి కీలక పాత్రలో నటించిన చిత్రం నాన్ కడవుల్ ఇల్లై. దర్శకుడు సముద్రఖని కథానాయకుడిగా నటించిన ఇందులో నటి ఇనియా, సాక్షి అగర్వాల్, శరవణన్ ముఖ్యపాత్రలు పోషించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. ఒక పోలీస్ అధికారికి కరుడుకట్టిన రౌడీకి మధ్య పోరే ఈ చిత్ర కథ. ఇందులో సాక్షి అగర్వాల్ యాక్షన్ హీరోయిన్గా అవతారం ఎత్తారు. దర్శకుడు చంద్రశేఖర్ మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేశారు. అందులో తన కుమారుడు విజయ్ను డాక్టర్ కావాలని ఆశించానని అయితే తను మాత్రం యాక్టర్ కావాలని కోరారు అన్నారు. దీంతో విజయ్ను హీరోగా పరిచయం చేసి, తన స్వీయ దర్శకతంలో చిత్రం చేసి ఒక తండ్రిగా తన బాధ్యతను నిర్వర్తించానన్నారు. ఆ తర్వాత విజయ్ తన ప్రతిభతో దళపతిగా అభిమానుల గుండెల్లో నిలిచే స్థాయికి చేరుకున్నారని చెప్పారు. ఈరోజు అభిమాన సంఘం చాలా అవసరం అన్నారు. దీంతో తానే తొలి అభిమానిగా విజయ్ అభిమాన సంఘాన్ని ప్రారంభించానని, అది ఇప్పుడు విజయ్ మక్కల్ ఇరుక్కంగా మారిందని చెప్పారు. ఇకపోతే తాను జీవించినంతవరకు సక్సెస్ఫుల్ కళాకారుడిగానే కొనసాగాలని భావిస్తున్నారన్నారు. అందులో భాగమే ఇప్పుడు చేసిన నాన్ కడవుల్ ఇల్లై చిత్రం అని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి ప్రేక్షకుల ఆదరణ లభిస్తుందనే నమ్మకం ఉందన్నారు. -
నడవలేని స్థితిలో నటుడు విజయకాంత్.. వీల్ చైర్లోనే..
తమిళసినిమా: నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌ను సీనియర్ దర్శకుడు, విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ మంగళవారం ఆయన ఇంట్లో కలిశారు. వీరి కాంబినేషన్లో పలు విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. ఇంకా చెప్పాలంటే 1971లో విజయకాంత్ కథానాయకుడిగా చట్టం ఒరు ఇరుట్టరై చిత్రం ద్వారా ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ తరువాత తమిళం, తెలుగు, హిందీ భాషల్లో 70కి పైగా చిత్రాలకు ఈయన దర్శకత్వం వహించారు. ఇదిలా ఉంటే తాజాగా చంద్రశేఖర్, విజయకాంత్‌ని కలిసి ఆయనను పలకరించారు. కాగా మంగళవారం(జనవరి 30) నటుడు విజయకాంత్ ప్రేమలత పెళ్లిరోజు. చదవండి: ‘మాస్టర్’ హీరోయిన్ సాక్షి ఇప్పుడు ఎలా ఉంది, ఏం చేస్తుందో తెలుసా? ఈ సందర్భంగా దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ ఆ దంపతులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విజయకాంత్‌ను ఆప్యాయంగా పలకించి కొంతసేపు ఆయనతో ముచ్చటించారు. ఆ ఫొటోలను ఎస్ఏ చంద్రశేఖర్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అవి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కాగా 70 ఏళ్ల విజయకాంత్ కొంతకాలంగా డయాబెటిస్తో బాధపడుతున్నారు. ఇటీవల ఆయన కాలు మూడు వేళ్లను తొలగించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన నడవలేని స్థితిలో ఉన్నారు. అంతేకాదు చూస్తుంటే ఆయన ఆరోగ్యం కూడా క్షిణించినట్లు కనిపిస్తోంది. ఇలా తమ అభిమాన నటుడిని చూసి ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. என் உயிரை நான் சந்தித்த போது 😀@iVijayakant pic.twitter.com/KZ1bP0yyp0 — S A Chandrasekhar (@Dir_SAC) January 31, 2023 -
వివాదంగా మారిన విజయ్ తండ్రి పార్టీ
సాక్షి, చెన్నై : దళపతి విజయ్ పేరు, ఫొటో వ్యవహారంలో తనపై కేసులు పెట్టి జైల్లో పెట్టిచ్చినా పర్వాలేదు అని ఆయన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. విజయ్ మంచి కోసమే తాను రాజకీయ పార్టీ ఏర్పాటుకు సిద్ధమయ్యానని పేర్కొన్నారు. సినీ నటుడు విజయ్ పేరిట ఆయన తండ్రి, దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ రాజకీయ పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికల కమిషన్ గుర్తింపుకోసం దరఖాస్తు వెల్లడం చర్చకు దారి తీసింది. ఇది పూర్తిగా తన వ్యక్తిగతం అని ఎస్ఏ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఈ పార్టీకి తనకు సంబంధం లేదని, తన ఫొటో, పేరును వాడుకుంటే చట్టపరంగా చర్యలు తప్పవని విజయ్ హెచ్చరించారు. ఈ పరిస్థితుల్లో శనివారం ఓ ఛానల్‌కు ఎస్ఏ చంద్రశేఖర్ ఇంటర్వూ్య ఇచ్చారు. (నాన్న పార్టీ.. నాకు సంబంధం లేదు: విజయ్) ఉన్నత స్థానంలో ఉండాలన్నదే.. తన కుమారుడు విజయ్ ఉన్నత స్థానంలో ఉండాలన్నదే తన ఆకాంక్ష అని ఎస్ఏ చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. అందుకే 1993లో విజయ్ అభిమాన సంఘాన్ని తాను ఏర్పాటు చేశానని గుర్తు చేశారు. ఇప్పుడు విజయ్ పెద్ద స్టార్ అయినంత మాత్రాన తన కుమారుడు కాదా అని ప్రశ్నించారు. తన బిడ్డకు ఏమి చేస్తే మంచిదో అని ఓ తండ్రిగా ఆలోచించానని, తన రాజకీయ పార్టీ అంటే విజయ్ ఇప్పుడు ఇష్టం లేకుండా ఉండ వచ్చు అని, అయితే, దీని రూపంలో భవిష్యత్తులో ఆయనకు మంచి జరిగి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీ గురించి విజయ్ను తాను సంప్రదించలేదని, ఏర్పాటు తదుపరి కొంత కాలానికి అర్థం చేసుకుంటాడని భావించినట్టు ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. తన పార్టీలోకి చేర వద్దు అని అభిమానులకు సూచించారని, వేచి చూద్దాం.. విజయ్ అర్థం చేసుకునే సమయం వస్తుందని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఫొటో, పేరు వాడుకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని విజయ్ హెచ్చరించారని, అలాగే, చర్యలు తీసుకోనివ్వండి, కేసు పెట్టి జైల్లో పెట్టించినా పర్వాలేదు అని చివరి ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. తండ్రిపై చర్యలు తీసుకున్న తనయుడు అని ఇది కూడా ఓ చరిత్ర అవుతుందని ముగించారు. -
ఆ వార్తల్లో నిజం లేదు: హీరో విజయ్ తండ్రి
సాక్షి, చెన్నై: తన కుమారుడితో తనకు ఎలాంటి విభేదాలు లేవని తమిళ స్టార్ హీరో, ఇళయ దళపతి విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. రాజకీయ పార్టీతో తన పేరు ముడిపెట్టవద్దన్న విజయ్ వ్యాఖ్యలపై తననే సంప్రదించాలని మీడియాకు సూచించారు. కాగా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ‘ఆలిండియా దళపతి విజయ్ మక్కల్ ఇయాక్కం’’పేరిట పొలిటికల్ పార్టీని రిజిస్టర్ చేయించినట్లు చంద్రశేఖర్ గురువారం వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో విజయ్ రాజకీయ రంగ ప్రవేశం ఖరారైందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ విషయంపై స్పందించిన విజయ్.. తాను ఎలాంటి రాజకీయ పార్టీ పెట్టలేదని ప్రకటన విడుదల చేశారు.(చదవండి: నాన్న పార్టీ.. నాకు సంబంధం లేదు) అదే విధంగా తండ్రి నిర్ణయంతో తనకు సంబంధం లేదని, ఆయన రిజిస్టర్ చేయించి పార్టీ కార్యకలాపాల కోసం తన పేరు, ఫొటో వాడితే చర్యలు తీసుకుంటానని కూడా స్పష్టం చేశారు. మరోవైపు.. ఈ పార్టీ స్థాపన అనేది తన వ్యక్తిగత నిర్ణయమని చంద్రశేఖర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో తండ్రీకొడుకుల మధ్య విభేదాలు తలెత్తాయంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ విషయంపై తాజాగా స్పందించిన ఎస్ఏ చంద్రశేఖర్, తమ మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేవని, అంతాబాగానే ఉందంటూ వివరణ ఇచ్చారు. ఇక ఈ అంశంపై విజయ్ స్పందిస్తారా లేదా అన్న అంశంపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. -
హీరో తండ్రిపై కమిషనర్‌కు ఫిర్యాదు
చెన్నై,టీ.నగర్: నగదు మోసానికి పాల్పడినట్లు తెలిపి హీరో విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్‌పై కమిషనర్ కార్యాలయంలో మంగళవారం చిత్రనిర్మాత మణిమారన్ ఫిర్యాదు చేశారు. పిటిషన్లో ఇలా తెలిపారు. చంద్రశేఖర్ రూపొందించిన ట్రాఫిక్ రామస్వామి చిత్రం తమిళనాడు విడుదల హక్కులను బ్రహ్మానందం సుబ్రమణియం అనే వ్యక్తికి ఇస్తున్నట్లు తెలిపి రూ.21 లక్షలు అడ్వాన్సు తీసుకున్నారని, కొన్ని రోజుల తర్వాత తానే విడుదల చేస్తానని తెలిపిన చంద్రశేఖర్ చిత్రం విడుదల తర్వాత రూ.21 లక్షలు ఇస్తానని తెలిపారని, అయితే ఒకటిన్నర ఏడాది అయినప్పటికీ బ్రహ్మానందం నుంచి పొందిన నగదును చంద్రశేఖర్ తిరిగి ఇవ్వలేదని పేర్కొన్నారు. దీనిగురించి బ్రహ్మానందం తనను ఫోన్లో సంప్రదించి చంద్రశేఖర్ నుంచి నగదు ఇప్పించాల్సిందిగా కోరాడని, దీనిగురించి తాను చంద్రశేఖర్ వద్ద మాట్లాడగా మూడు నెలల్లో నగదు ఇస్తానని తెలిపాడని, ఆయన చెప్పిన గడువు గత నెలతో ముగిసిందని తెలిపారు. తాను అతని కార్యాలయానికి వెళ్లి నగదు కోరగా కావాలంటే కొంత చెల్లిస్తానని చెప్పడమే కాకుండా బెదిరింపు ధోరణిలో మాట్లాడారని తెలిపారు. దీనిగురించి తగిన చర్యలు తీసుకుని నగదు ఇప్పించాలని మణిమార న్ ఇచ్చిన పిటిషన్లో కోరారు. -
రాజకీయాలే టార్గెట్
తమిళసినిమా: ఇళయదళపతి విజయ్ చిత్రాల్లో సమకాలీన రాజకీయ సంఘటనలపై సన్నివేశాలు చోటుచేసుకుంటుండడంతో వివాదాలు చుట్టుముడుతున్నాయి. విజయ్. చాలా కాలం క్రితమే తన అభిమాన సంఘాలను ప్రజా సంఘాలుగా మార్చి ప్రజల్లోకి దూసుకొచ్చారు. విజయ్ రాజకీయ రంగప్రవేశం గురించి ఆయన తండ్రి, సీనియర్ దర్శకుడు ఎస్ఏ.చంద్రశేఖరన్ చాలా కాలం క్రితమే బహిరంగంగా వెల్లడించారు కూడా. విజయ్ తన రాజకీయ రంగానికి బాట వేసుకునే విధంగా తలైవా అనే చిత్రంలో కథానాయకుడిగా నటించారు. ఆ చిత్రం విడుదల సమయంలో పలు ఒడిదుడుకులను ఎదుర్కొంది. దీంతో విజయ్ తన రాజకీయ ఆలోచనను పక్కన పెట్టక తప్పలేదు. మెర్శల్ కలకలం సమసిందనుకుంటే.. ఇటీవల విజయ్ నటించిన మెర్శల్ చిత్రానికి రాజకీయ రంగు అంటుకుంది. ఆ చిత్రంలో ఉచిత వైద్య, జీఎస్టీ పన్ను విధానానికి వ్యతిరేకంగా చోటు చేసుకున్న సన్నివేశాలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ రచ్చ చల్లారిందనుకుంటున్న తరుణంలో విజయ్ మరో వివాదానికి తలుపులు తెరవడానికి సిద్ధం అవుతున్నారా? అనే చర్చకు కోలీవుడ్ కలకలం లేపుతోంది. రాజకీయ నేపథ్యంలో తాజా చిత్రం..? విజయ్ తాజాగా ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో తన 62వ చిత్రం చేస్తున్నారు. ఇది రాజకీయ నేపథ్యంతో కూడిన చిత్రం అనే ప్రచారం జోరందుకుంది. ఈ చిత్రంలో విజయ్ రైతులు, మత్స్యకారుల కోసం రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా పోరాడే ధనవంతుడిగా నటిస్తున్నట్లు ప్రచారంలో ఉంది. రైతులకు ద్రోహం చేసే నాయకుడి పాత్రలో నటుడు రాధారవి, పళ కరుప్పయ్య నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం ఇటీవల ఒక సన్నివేశాన్ని దర్శకుడు చిత్రీకరించారు. మాతృ పార్టీ నుంచి విడిపోయి బయటకు వచ్చిన పళ కరుప్పయ్య తిరిగి సొంత పార్టీలో చేరడానికి ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంగా ఆ సన్నివేశం చోటు చేసుకుంది. రాధారవితో పళ.కరుప్పయ్య మళ్లీ కలిసే కలిసే కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహంచే సన్నివేశం అది. ఇదే సన్నివేశంలో వేదికపై బాంబు పేలేలా చిత్రీకరించారు. ఇక ఆ పార్టీ పేరును ఏఐఎంఎంకే అని పెట్టారు. సమకాలీన రాజకీయాలే టార్గెట్ పై సన్నివేశం తమిళనాడులోని సమకాలీన రాజకీయాలకు అద్ధం పట్టే విధంగా ఉందని చెప్పవచ్చు. జయలలిత మరణం అనంతరం అన్నాడీఎంకే పార్టీకి చెందిన ఓ.పన్నీర్‌సెల్వం వర్గం, ఎడపాడి పళనిస్వామి వర్గం అంటూ విడిపోయి, ఆ తరువాత ఒకటిగా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ సన్నివేశంలో మిత్ర రాజకీయాలను విజయ్ తీవ్రంగా విమర్శించినట్లు సన్నివేశాలు చోటు చేసుకుంటాయని చిత్ర వర్గాల సమాచారం. దీంతో విజయ్ తాజా చిత్రం ఎలాం టి రాజకీయ వ్యతిరేకతకు గురౌతుందోనన్న ఆసక్తి చిత్ర పరిశ్రమలో నెలకొంది. -
విజయ్ తండ్రిపై కేసు నమోదు చేయండి
సాక్షి, చెన్నై: నటుడు విజమ్ తండ్రి, దర్శకుడు ఎస్ఏ.చంద్రశేఖర్‌పై ఆధారాలుంటే కేసు నమోదు చేయాల్సిందిగా చెన్నై హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. దర్శకుడు ఎస్ఏ. చంద్రశేఖర్ గత నవంబరు నెలలో చెన్నైలో జరిగిన ఒక చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అప్పుడాయన భక్తులు తిరుపతి దేవస్థానంలో సమర్పించే కానుకలు ఆ దేవునికి లంచం ఇచ్చినట్లేనని వివాదాష్పద వ్యాఖ్యలు చేశారు. ఆలయ హుండీల్లో కానుకలు వేస్తే పరిక్షల్లో ఉత్తీర్ణత కోసం ఇక పరిక్షలే రాయవలసిన అవసరం లేదని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేకెత్తించాయి. కాగా ఈ వ్యవహారంపై హిందు మున్నాని సంఘం నిర్వాహకులు దర్శకుడు ఎస్ఏ.చంద్రశేఖర్ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను గాయపరచేవిగా ఉన్నాయనీ పేర్కొంటూ చెన్నై పోలీస్ కమీషనర్ కార్యలయంలో గత నెల 25వ తేధీన పిర్యాదు చేశారు. అయితే ఆ పిర్యాదుపై పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టక పోవడంతో వారు చెన్నై హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటీషన్లో దర్శకుడు ఎస్ఏ. చంద్రశేఖర్‌పై తగిన చర్యలు తీసుకునేలా పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ కేసు శనివారం న్యాయమూర్తి ఎంఎస్.రమేశ్ సమక్షంలో విచారణకు రాగా తగిన ఆధారాలుంటే దర్శకుడు ఎస్ఏ.చంద్రశేఖర్‌పై కేసు నమోదు చేయాలని న్యాయమూర్తి పోలీసులకు ఉత్తర్వులు జారీ చేశారు. -
రాజకీయ తెరపై మరో సినీకెరటం
తమిళనాడు రాజకీయ తెరపై మరో సినీకెరటం ఎగిసిపడనుందా? హీరో విజయ్ తెరంగేట్రం నుంచి రాజకీయ అరంగేట్రం చేయాలని ఒత్తిళ్లు పెరుగుతున్నాయా?.. అవుననే అంటోంది తమిళనాడు ప్రజానీకం. సంచలనాత్మక విజయం సాధించిన మెర్శల్ చిత్రం పుణ్యమాని విజయ్‌కు ఇంటినుంచే రాజకీయ వాసనలు మొదలయ్యాయి. విజయ్ రాజకీయాల్లోకి రావాలి, రాష్ట్రంలో మార్పు తేవాలి అంటూ సాక్షాత్తు ఆయన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ తన అభిప్రాయాన్ని మంగళవారం బహిరంగంగా ప్రకటించేశారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: మెర్శల్ చిత్ర వివాదం నేపథ్యంలో మరో కోణం వెలుగుచూసింది. తమిళనాట మార్పు కోసం హీరో విజయ్ రాజకీయాల్లో రావాలని ఆశిస్తున్న ఆయన తండ్రే ఓ ఇంటర్వూ్యలో అభిప్రాయపడ్డారు. తమిళనాడులో రాజకీయాలు, సినిపరిశ్రమను వేరువేరుగా చూడలేం. ఆనాటి ముఖ్యమంత్రి అన్నాదురై మొదలుకుని కరుణానిధి, ఎంజీ రామచంద్రన్ ఇటీవల మరణించిన జయలలిత వరకు అందరూ సినీ నేపథ్యం ఉన్నవారే. సినిమాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వారికి రాజకీయాల్లోకి వెళ్లడం అంటే రెడ్‌కార్పెట్ స్వాగతంలా భావిస్తారు. ఎంజీఆర్ తరువాత అంతటి మాస్ ఫాలోయింగ్ ఉన్న సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై రెండు దశాబ్దాలుగా రాజకీయ ఒత్తిడి ఉంది. విముఖత ప్రదర్శిస్తూ వచ్చిన రజనీ ఇటీవల చూచాయగా తన రాజకీయ ఆసక్తిని చాటుకున్నారు. పార్టీ పెట్టడం ఖాయమనే పరిస్థితులు కల్పించిన రజనీకాంత్ ఈ ఏడాది డిసెంబరు 12వ తేదీన తన పుట్టిన రోజున పార్టీని ప్రకటిస్తారని అందరూ ఎదురుచూస్తున్నారు. రాజకీయాలకు దూరంగా మెలిగే కమల్‌హాసన్‌లో జయలలిత మరణం మార్పు తెచ్చింది. రాష్ట్రంలోని ప్రతి చిన్న అంశానికి స్పందించడం, అధికార అన్నాడీఎంకేను దుయ్యబట్టడం ద్వారా రాజకీయాల్లోకి రావడం ఖాయమని చాటారు. అయితే కమల్, రజనీ స్పష్టమైన ప్రకటన చేయకుండా రాజకీయ ప్రవేశాన్ని నాన్చుతూ వస్తున్నారు. మద్దతుల వెల్లువ రజనీకాంత్, కమల్‌హాసన్, నిర్మాత మండలి అధ్యక్షులు, నటులు విశాల్తోపాటూ తమిళ సినీపరిశ్రమ మద్దతుగా నిలవడంతో మెర్శల్ నిర్మాతలు కొన్ని సన్నివేశాలను తొలగించాలనే ఆలోచనను విరమించుకున్నారు. సినిమాల్లో ప్రజాసమస్యలను ప్రస్తావించడం భావప్రకటన స్వేచ్ఛ కిందకు వస్తుంది కాబట్టి ఫలానా సన్నివేశాలను తొలగించాలని కోరడం సమజసం కాదని అన్నారు. సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికెట్ పొందిన తరువాత విడుదలైన చిత్రంపై పరిశీలనలు చేయడం సినిమా పరిశ్రమకే ముప్పు అని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సినిమాలో చోటుచేసుకున్న సన్నివేశాలు వాస్తవమైనవి, వీటిని రాజకీయ పార్టీలు విమర్శించరాదని అభిమానులు పేర్కొంటున్నారు. విజయ్‌కు రాజకీయ రంగు కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్‌గాంధీ సహా పలు రాజకీయ పార్టీల నేతలు మెర్సల్ సినిమాలోని డైలాగులకు హర్షం వెలిబుచ్చడంతో విజయ్‌కు రాజకీయరంగు అంటుకుంది. రాబోయే కాలంలో రాష్ట్రాన్ని పాలించగల సత్తా ఉన్న నేత విజయ్ అంటూ అభిమానులు చేస్తున్న ప్రచారానికి ప్రజల్లో మద్దతు లభిస్తోంది. అంతేగాక, కమల్, రజనీలకు పోటీగా విజయ్ రాజకీయాల్లోకి రావాలనే కోరికను కొందరు వెలిబుచ్చుతున్నారు. రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతో మెర్శల్ చిత్రం ద్వారా విజయ్ తొలి అడుగు వేశాడనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. విజయ్ రాకతో మార్పు : తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ రాష్ట్రంలో మార్పుకోసం తన కుమారుడు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని నటుడు విజయ్ తండ్రి, ప్రముఖ దర్శకులు ఎస్ఏ చంద్రశేఖర్ ఆశాభావం వ్యక్తం చేశారు. మెర్శల్ వివాదం నేప«థ్యంలో చంద్రశేఖర్ ప్రముఖ తమిళ టీవీ చానల్ పుదియతలైమురైకి ఇచ్చిన ఇంటర్వూ్య మంగళవారం సాయంత్రం ప్రసారమైంది. చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ‘‘సినిమాల్లో మంచి సందేశం ఇచ్చినపుడు రాజకీయ నేతలు ఆదరిస్తున్నారు. ఇలాంటి సన్నివేశాలు పదేపదే చోటుచేసుకుంటే వారిలో రాజకీయ ప్రవేశ ఆలోచనలు రావడం సహజం. ఈ సత్యాన్ని తెలుసుకోకుండానే నేతలు, కార్యకర్తలు రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారు. ఆ తరువాత అర్థం చేసుకుంటున్నారు. ఈరోజు పోరాడుతున్నవారే రేపటి నాయకులు, ఈ పరిస్థితుల్లో తమ జీవితం గురించి ఆలోచించకూడదు. తన కోసం ఆలోచించేవాడు కాక సమాజం కోసం ఆలోచించే నాయకుడని ప్రజలే తయారు చేసుకోవాలి. ఇలాంటి నాయకులు వచ్చినపుడు వారి వెంట నడిచేందుకు నేను సిద్ధంగా ఉంటాను. ఎంజీ రామచంద్రన్‌ను ఎవరూ సినీనటుడిగా చూడలేదు. ఆయన స్థానంలో మరెవరినీ పోల్చిచూడలేం. ప్రజల్లో ఆయన ఆ స్థాయిలో నమ్మకం పెంచుకున్నారు. నేటి రాజకీయ నాయకులు రేపు ప్రభుత్వంలో ఉండవచ్చు, ఈరోజు బెదిరింపులకు గురవుతున్న నటుడు (విజయ్) రేపు అధికారంలోకి రావచ్చు. విజయ్ తనలోని కోపాన్ని వెలిబుచ్చేందుకే మెర్శల్ చిత్రంలో నటించాడు. విజయ్ ఒక గాంధేయవాది. గత మూడేళ్లకు పైగా అతను రాజకీయాలు మాట్లాడటం లేదు. అతను ఒక రాజకీయనేతగా మారి తనను నమ్ముకున్న వారికి ఒక మార్పును తీసుకురావాలి. విజయ్ రాజకీయాల్లోకి రావాలని నా వ్యక్తిగత అభిప్రాయం. రాజకీయ ప్రవేశంపై విజయ్ మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది’’అని అన్నారు. -
ట్రాఫిక్ రామస్వామి బయోపిక్‌లో ఎస్ఏసీ
తమిళసినిమా: ట్రాఫిక్ రామస్వామి జీవిత చరిత్ర తెరకెక్కనుంది. ఇందులో ట్రాఫిక్ రామస్వామిగా సీనియర్ దర్శకుడు ఎస్ఏ.చంద్రశేఖర్ నటించడానికి సిద్ధమవుతున్నారు. ట్రాఫిక్ రామస్వామి గురించి తమిళనాడులో కాస్త లోకజ్ఞానం ఉన్న వారందరికీ తెలుసు. సామాజిక సమస్యలపై నిరంతర పోరాటయోధుడు ట్రాఫిక్ రామస్వామి. ఇక మిల్లు వర్కర్‌గా జీవితాన్ని ప్రారంభించిన ఈయన తమిళనాడు హోమ్‌గార్డ్‌ల అసోషియేషన్‌లో శాశ్వత సభ్యుడిగా ఉన్నారు. అనేక ప్రజా సమస్యలపై కోర్టులో ప్రజావాజ్యం వేసి న్యాయం కోసం పోరాడుతున్నారు. మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్‌ల అవినీతి పైనా అలుపెరుగని పోరాటం చేశారు. 2013లో ప్రభుత్వ స్కీమ్‌లపై అమ్మ పేరు ఉండరాదంటూ అన్నాడీఎంకే నేత జయలలితపైనే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తి ట్రాఫిక్ రామస్వామి. ఆయనతో పాటు పుట్టిన 10మంది దూరం అయినా, కట్టుకున్న భార్య వదిలి వెళ్లినా తన సామాజిక బాధ్యతలను మాత్రం విడనాడని నిజమైన సంఘసంస్కర్త ట్రాఫిక్ రామస్వామి. 83ఏళ్ల ఆయన ఇప్పటికీ తన పోరాట పఠిమ కొనసాగిస్తున్నారు. అలాంటి వ్యక్తి జీవిత చరిత్ర వెండితెరకెక్కనుంది. ఆయన పాత్రలో సీనియర్ దర్శకుడు ఎస్ఏ.చంద్రశేఖర్ నటించనున్నారు. దీని గురించి ఎస్ఏ.చంద్రశేఖర్ తెలుపుతూ, మూడు నెలల క్రితమే ట్రిఫిక్ రామస్వామి గురించి పూర్తిగా తెలుసుకున్నానన్నారు. నిర్మాత భాస్కర్ వచ్చి ట్రాఫిక్ రామస్వామి జీవిత ఇతివృత్తంగా చిత్రం చేద్దాం. దానికి మీరే దర్శకత్వం వహించాలని కోరారన్నారు. అయితే వయసు రీత్యా తాను దర్శకత్వం వహించలేనని, ఆయన పాత్రలో నటిస్తానని చెప్పానన్నారు. ఈ చిత్రానికి తన శిష్యుడు విజయ్ విక్రమ్ దర్శకత్వం వహించనున్నాడని తెలిపారు. ఈ చిత్రం కోసం ట్రాఫిక్ రామస్వామిని కలిసి అనుమతి పొందామని, తాను ఆయన పాత్రలో నటించనున్నట్లు చెప్పగా చాలా సంతోషించారని తెలిపారు. అయితే ఇందులో విజయ్ నటించనున్నారనే ప్రచారంలో వాస్తవం లేదని, అసలు తానీ చిత్రంలో నటించనున్న సంగతి అతనికి ఇంకా చెప్పలేదని ఎస్ఏ.చంద్రశేఖర్ అన్నారు. -
విజయ్ రాజకీయ ప్రవేశం ఉంటుందా?
చెన్నై: తమిళ సినీప్రేక్షకుల మధ్య ఇళయ దళపతిగా అభిమానం పొందుతున్న ప్రముఖ నటుడు విజయ్. ఇటీవల కాలంలో చాలా మంది సినిమా తారలు రాజకీయ రంగప్రవేశం చేసి, కరుణాస్ లాంటి వారు శాసన సభ్యులుగానూ బాధ్యతలు చేపట్టారు. అయితే చాలా కాలం క్రితమే నటుడు విజయ్ రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నించి ఆ తరువాత వెనక్కు తగ్గారు. తమిళనాట ప్రస్తుత పరిణాల్లో విజయ్ రాజకీయ తెరంగేట్రం చేస్తారా? అన్న విలేకరుల ప్రశ్నకు ఆయన తండ్రి, సీనియర్ దర్శకుడు ఎస్ఏ.చంద్రశేఖర్ శుక్రవారం కన్యాకుమారిలో బదులిస్తూ నటుడు రాజకీయాల్లోకి రావడం సులభమేనన్నారు. అయితే ప్రస్తుత రాజకీయాలు వ్యాపారంగా మారాయని పేర్కొన్నారు. గత 10 ఏళ్ల క్రితం తాను విజయ్ రాజకీయ రంగప్రవేశానికి ప్రయత్నించానన్నారు. అయితే ఇప్పటి రాజకీయ వ్యాపారం పరిస్థితుల్లో విజయ్ రాజకీయాల్లోకి రాకూడదని నిర్ణయించుకున్నానన్నారు. త్వరలో జరగనున్న నిర్మాతల మండలి ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ చట్ట నిబంధనల ప్రకారం నటుడైనా, నిర్మాత అయినా నిర్మాతల మండలి ఎన్నికల్లో పోటీ చేయవచ్చని చంద్రశేఖర్ అన్నారు. అయితే తమకున్న విధి విధానాల ప్రకారం ఒక సంఘానికి ప్రధాన బాధ్యతలు నిర్వహిస్తూ, మరో సంఘంతో అదే స్థాయి పదవీ బాధ్యతల్ని నిర్వహించడం సాధ్యం కాదని పరోక్షంగా నటుడు విశాల్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా ఇతర రాష్ట్రాల్లో పైరసీని అడ్డుకోవడానికి ప్రభుత్వాలు పోలీసు అధికారుల ద్వారా చర్యలు తీసుకుంటున్నాయని, తమిళ ప్రభుత్వం అలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.