Thalapathy Vijay's Father SA Chandrasekhar Acted In Serial with Actress Radhika - Sakshi
Sakshi News home page

SA Chandrasekhar: సీనియర్‌ నటి రాధికకు జంటగా విజయ్‌ తండ్రి.. సినిమాలో మాత్రం కాదు

Published Fri, Apr 7 2023 3:43 PM | Last Updated on Fri, Apr 7 2023 4:03 PM

Thalapathy Vijay Father SA Chandrasekhar Acted In Serial With Actress Radhika - Sakshi

తమిళ స్టార్‌ డైరెక్టర్‌, హీరో విజయ్‌ తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తమిళంలో స్టార్‌ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన ఆయన తెలుగులోనూ ఎన్నో చిత్రాలు రూపొందించారు. మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటించిన దేవాంతకుడు, చట్టానికి కళ్లులేవు, పల్లెటూరి మొనగాడు వంటి సినిమాలను రూపొందించి టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. తన సొంత డైరెక్షన్‌లోనే తనయుడిని హీరోగా మార్చారు.

చదవండి: ఉత్తమ దర్శకుడిగా అంతర్జాతీయ అవార్డును కైవసం చేసుకున్న ‘బలగం’ వేణు

‘వెట్రి’ అనే సినిమాతో విజయ్‌ని బాలనటుడిగా తెరంగేట్రం చేయించిన ఆయన ‘నాలైయ’ తీర్పు మూవీతో హీరోగా మార్చారు. అలా తన దర్శకత్వంలో విజయ్‌తో సినిమాలు చేసి స్టార్‌ హీరోగా గుర్తింపు ఇచ్చారు. అలా కోలీవుడ్‌కు ఎన్నో బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌ ఇచ్చిన ఆయనకు ఈ మధ్య పెద్దగా సక్సెస్‌ రావడం లేదు. ప్రస్తుతం అడపదడపా చిత్రాలు చేస్తూ వస్తున్న ఆయన తాజాగా బుల్లితెర ఎంట్రీ ఇచ్చారు. త్వరలో ప్రసారం కాబోయే ఈ సీరియల్లో ప్రముఖ నటి రాధిక శరత్‌ కుమార్‌తో ఆయన జతకట్టబోతున్నారు.

చదవండి: హైదరాబాద్‌లోని ఆలయంలో ఓం రౌత్‌ ప్రత్యేక పూజలు, ఫొటోలు వైరల్‌

ఈ సీరియల్‌ పేరు కిజాగు వాస‌ల్. దీనిని నటి రాధిక నిర్మించడం విశేషం. ఇక స్టార్‌ డైరెక్టర్‌, విజయ్‌ తండ్రి అయిన ఆయన టీవీ సీరియల్లో నటించడంపై దళపతి ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు మీ కొడుకు పరువు తీస్తున్నారంటూ ఫ్యాన్స్‌ ట్రోల్‌ చేస్తున్నారు. కాగా విజయ్‌కి ఆయన గతంలో మనస్పర్థలు వచ్చిన సంగతి తెలిసిందే. విభేదాల వల్ల విజయ్‌, ఆయన తండ్రి కోర్టు మెట్లు కూడా ఎక్కారు. అప్పట్లో ఈ వ్యవహరం కోలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement