జీకే వాసన్‌కు ‘కెప్టెన్’ మద్దతు | DMDK Leader Vijaykanth Support to gk Vasan | Sakshi
Sakshi News home page

జీకే వాసన్‌కు ‘కెప్టెన్’ మద్దతు

Published Thu, Nov 6 2014 3:44 AM | Last Updated on Sat, Sep 2 2017 3:55 PM

జీకే వాసన్‌కు ‘కెప్టెన్’ మద్దతు

జీకే వాసన్‌కు ‘కెప్టెన్’ మద్దతు

చెన్నై, సాక్షి ప్రతినిధి : కొత్త పార్టీ పెట్టబోతున్న జీకే వాసన్‌కు శుభాకాంక్షలు చెప్పడం ద్వారా డీఎండీకే అధినేత విజయకాంత్ మరోసారి కలకలం సృష్టించారు. తిరుచ్చిలో జరగనున్న జీకేవీ మహానాడుకు డీఎండీకే శ్రేణు లు సైతం హాజరుకానున్నట్లు సమాచారం.
 
 పార్టీ ఆవిర్భావం నుంచి సంచలనానికి కెప్టెన్ కేంద్ర బిందువయ్యూ రు. పదేళ్ల క్రితం డీఎండీకే తొలిసారి ఎన్నికలను ఎదుర్కొన్నపుడు ఒక్క విజయకాంత్ మినహా ఎవ్వరూ గెలవకపోవ డం అప్పట్లో సంచలనం. ఆ తరువాత అన్నాడీఎంకేతో పొత్తుపెట్టుకుని డీఎంకే కంటే ఎక్కువ స్థానాల్లో గెలుపొంది ప్రతిపక్షహోదాను దక్కించుకోవడం మరో కలకలం. స్వల్పకాలంలోనే అన్నాడీఎంకే అధినేత్రి జయలలితతో విబేధించి, ఇటీవలి పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ కూటమిలో చేరడం ద్వారా మరో సం చలనానికి తెరదీశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రధాని మోదీకి సన్నిహితునిగా మారడంతోపాటూ 2016న రాబోయే అసెం బ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి ద్వారా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకోవాలని విజయకాంత్ ఆశిస్తున్నారు.
 
 ఇలా బీజేపీ కూటమిలోనే కొనసాగుతున్న విజయకాంత్ అకస్మాత్తుగా జీకే వాసన్‌కు శుభాకాంక్షలు చెప్పడం ద్వారా మరోసారి కలకలం రేపారు. కాంగ్రెస్‌తో విభేదించి జీకే వాసన్ పెట్టబోతున్న పార్టీతో చేతులు కలిపేందుకు సుముఖత చూపుతున్నారు. జీకేవాసన్, కెప్టెన్ రాజకీయాలకు అతీతంగా మిత్రు లు. ప్రస్తుతం మలేషియాలో ఉన్న విజ యకాంత్ సెల్‌ఫోన్ ద్వారా జీకేవీకి శుభాకాంక్షలు తెలపడం వరకే పరిమి తం అయితే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తిరుచ్చిలో జరగనున్న కొత్త పార్టీ ఆవిర్భావ వేడుకకు జీకే వాసన్ ఆహ్వానించడం, తాను విదేశాల్లో ఉన్నందున తమ పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరవుతారని విజయకాంత్ చెప్పినట్లు సమాచారం. బీజేపీ కూటమి తనను సీఎం అభ్యర్థిగా ప్రకటించిన పక్షంలో ఇదే కూటమిలో జీకే వాసన్ పార్టీ సైతం చేరినట్లయితే మరింత బలం చేకూరుతుందని కెప్టెన్ అంచనాగా ఉంది.  అయితే కూటమికి నాయకత్వం వహిస్తున్న బీజేపీ అభిప్రాయం తో నిమిత్తం లేకుండా కెప్టెన్ తనకు తానుగా జీకేవీకి చేరువవుతున్నారు. జీకే వాసన్ పార్టీతో డీఎండీకే జతకడుతుందా లేక బీజేపీ కూటమిలోకి వాసన్ వస్తారా అనే చర్చకు కెప్టెన్ తెరలేపారు.
 
 సభకోసం సమీకరణలు
 తిరుచ్చి సభను విజయవంతం చేసేం దుకు జీకే వాసన్ సమీకరణల బాట పట్టారు.  సభకు కనీసం 2 లక్షల మందిని హాజరుపరచాలని పట్టుదలతో ఉన్నారు.   ఈనెల 20 లేదా 21వ తేదీ తిరుచ్చి సభకు ముహూర్తంగా చెబుతున్నారు. జీ కార్నర్ ప్రాంగణంలో సభను నిర్వహించాలని నిర్ణయించారు.
 
 ఆ ఇద్దరు
 జీకే వాసన్‌వైపు మొగ్గుచూపుతున్న ఇద్ద రు (కాంగ్రెస్) ఎమ్మెల్యేల సభ్యత్వం ఉంటుందా, ఊడుతుందా అనే  చర్చ సాగుతోంది. కన్యాకుమారి జిల్లా కిలి యూర్ ఎమ్మెల్యే జాన్‌జాకబ్, తంజావూరు జిల్లా పట్టుకోట్టై ఎమ్మెల్యే రంగరాజన్‌లు కొత్త పార్టీ పెట్టబోతున్న జీకే వాసన్‌కు మద్దతుగా నిలిచారు. హస్తం గుర్తుపై గెలిచి మరోపార్టీలో చేరుతున్నట్లు అధికారికం గా నిర్ధారణ కాగానే పార్టీ అధిష్టానం వెంటనే వారిద్దరినీ పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి ఆ ఉత్తరాన్ని అసెంబ్లీ కార్యదర్శికి పంపే అవకాశం ఉంది. అసెంబ్లీ కార్యదర్శి వెంటనే వారిద్దరి సభ్యత్వం రద్దయినట్లు ప్రకటించవచ్చు. డీఎంకే నుంచి ఒకరు, డీఎండీకే నుంచి 8 మంది ఎమ్మెల్యేలు ఏడాది కిందటే అన్నాడీఎంకే పంచన చేరిపోయారు. రంగరాజన్, జాన్‌జాకబ్ సభ్యత్వం కోల్పోగానే ఆ  స్థానాల్లో ఉప ఎన్నికలు జరపక తప్పదు. రాష్ట్రంలో వ్యతిరేక పవనాలు వీస్తున్న దశలో ఉపఎన్నికలపై కాంగ్రెస్ విముఖత ప్రదర్శించవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ గందరగోళ పరిస్థితిలో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎటువంటి వైఖ రిని అవలంభిస్తారో వేచిచూడాల్సిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement