చెన్నై: తమిళనాడులో కెప్టెన్ విజయ్‌కాంత్ నేతృత్వంలోని డీఎండీకేలో ముసలం మొదలైంది. పీడబ్ల్యూఎఫ్(పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్)తో పొత్తు కుదుర్చుకోవాలన్న విజయ్‌కాంత్ నిర్ణయాన్ని ప్రశ్నించినందుకు ముగ్గురు ఎమ్మెల్యేలు సహా 10 మందిని పార్టీ నుంచి బహిష్కరించారు. ‘వారు పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి, అప్రతిష్ట తెచ్చారు. పార్టీ పదవులు, ప్రాథమిక సభ్యత్వం నుంచి వారిని తొలగిస్తున్నాం’ అని విజయ్‌కాంత్ మంగళవారం తెలిపారు. అసమ్మతిని సహించబోమని చెప్పడానికే సీనియర్ నేతలపై వేటు వేశారని పార్టీ వర్గాలు చెప్పాయి.
అంతకుముందు, పీడబ్ల్యూఎఫ్‌తో పొత్తు వద్దని, కరుణానిధి నేతృత్వంలోని డీఎంకేతో కలసి ఎన్నికల్లో పోటీచేయాలని ముగ్గురు ఎమ్మెల్యేలు సహా పదిమంది సీనియర్ నేతలు విజయ్‌కాంత్‌కు అల్టిమేటం ఇచ్చారు. ఎమ్మెల్యే, ప్రచార కార్యదర్శి వీసీ చంద్రకుమార్ మాట్లాడుతూ, ‘జయ ప్రభుత్వాన్ని గద్దెదించాలన్న పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పొత్తు నిర్ణయం జరగలేదు. డీఎంకేతో పొత్తుతోటే విజయం సాధ్యమవుతుంది. పీడబ్ల్యూఎఫ్‌తో పొత్తు పార్టీలోని 95 శాతం మందికి ఇష్టం లేదు’ అని అన్నారు. డీఎండీకే 124 స్థానాల్లో, పీడబ్ల్యూఎఫ్ 110 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.
విజయ్‌కాంత్ పార్టీలో ముసలం
Published Wed, Apr 6 2016 2:28 AM | Last Updated on Sun, Sep 3 2017 9:16 PM
Advertisement
Advertisement