ముఖ్యమంత్రి జయలలిత తరపున రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది దాఖలు చేసిన ఎనిమిది పరువు నష్టం కేసుల్లో హాజరయ్యేం దుకు డీఎండీకే అధ్యక్షుడు
టీనగర్, న్యూస్‌లైన్: ముఖ్యమంత్రి జయలలిత తరపున రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది దాఖలు చేసిన ఎనిమిది పరువు నష్టం కేసుల్లో హాజరయ్యేం దుకు డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌కు మినహాయింపు ఇస్తూ హైకో ర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి జయలలితను కించపరిచేలా మాట్లాడినట్లు డీఎండీకే నేత విజయకాంత్‌పై 20కి పైగా కేసులను రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసింది. ఇందులో ఎనిమిది కేసుల విచారణకు స్టే విధించాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో విజ యకాంత్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ క్రమంలో న్యాయమూర్తులు రాజేశ్వరన్, ప్రకాష్ ఎదుట ఈ కేసు విచారణకు వచ్చింది. విజయకాంత్ తరపున హాజరైన న్యాయవాది బాలాజీ వాదిస్తూ చెన్నై, ఊటీ, కన్యాకుమారి సహా ఎనిమిది ప్రాంతాల్లో జరిగిన బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి జయలలితను కించపరుస్తూ మాట్లాడినట్లు విజయకాంత్‌పై రాజకీయ దురుద్దేశంతో కేసులు దాఖలు చేశారని పేర్కొన్నారు. బాధితురాలైన ముఖ్యమంత్రి జయలలిత మాత్రమే కేసు దాఖలు చేయాల్సి ఉందని పేర్కొన్నారు.
ఆమె తరపున ప్రభుత్వ న్యాయవాది కేసులు దాఖలు చేయ డం చట్టవిరుద్ధమని వివరించారు. అందుచేత కేసు విచారణపై స్టే విధించాలని కోరారు. అదేవిధంగా ఈ కేసుపై హాజరయ్యేందుకు విజయకాంత్‌కు సమన్లు పంపారని, ఈ సమన్లకు కూడా స్టే విధించాలని కోరారు. విజయకాంత్‌కు కేసులో హాజరయ్యేం దుకు మినహాయింపు ఇవ్వాలని విజ ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌ను పరిశీలిం చిన న్యాయమూర్తులు ఈ కేసుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల 21వ తేదీన సంజాయిషి పిటిషన్ దాఖలు చేయాలని ఉత్తర్వులు ఇస్తున్నామని, ఎనిమిది కేసుల్లో విజయకాంత్ హాజరయ్యేందుకు మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు.