'రజనీకాంత్లా పిరికివాడిని కాను' | vijayakanth makes controversial comments on rajinikanth | Sakshi
Sakshi News home page

'రజనీకాంత్లా పిరికివాడిని కాను'

Published Sat, Apr 16 2016 4:20 PM | Last Updated on Thu, Sep 12 2019 10:40 AM

'రజనీకాంత్లా పిరికివాడిని కాను' - Sakshi

'రజనీకాంత్లా పిరికివాడిని కాను'

చెన్నై: తమిళ సినీ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ ఎన్నికల ప్రచారం సందర్భంగా సూపర్ స్టార్ రజనీకాంత్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులు భయపెడితే భయపడటానికి తానేమీ రజనీకాంత్ మాదిరిగా పిరికివాడిని కాదంటూ విజయ్ కాంత్ వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది.

విజయ్ కాంత్ వ్యాఖ్యలపై రజనీకాంత్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులో పలుచోట్ల రజనీ అభిమానులు విజయ్ కాంత్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు.

విజయ్కాంత్ గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో ఎన్నికల పొత్తు గురించి అడిగిన మీడియా ప్రతినిధులను దుర్భాషలాడారు. అప్పట్లో మీడియా ప్రతినిధులు నిరసన వ్యక్తం చేశారు. ఇక సొంత పార్టీ నాయకుల పట్ల కూడా ఆయన అనుచితంగా ప్రవర్తించిన సంఘటనలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement