ఎన్నికల్లో పోటీ చేయను: అళగిరి | Will not contest elections: Alagiri | Sakshi
Sakshi News home page

ఎన్నికల్లో పోటీ చేయను: అళగిరి

Published Sat, Jan 25 2014 3:23 PM | Last Updated on Sat, Sep 2 2017 3:00 AM

Will not contest elections: Alagiri

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడం లేదని డీఎంకే పార్టీ బహిష్కృత నేత అళగిరి శనివారం చెన్నైలో స్పష్టం చేశారు. డీఎంకే పార్టీలో అవినీతి పెచ్చురిల్లిందని పేర్కొన్నారు.తనపై వచ్చిన ఆరోపణలు రుజువు చేసుకునేందుకు త్వరలో మదురై వెళ్ల నున్నట్లు తెలిపారు. ఈ రోజు ఉదయం ఓ ప్రముఖ ఆంగ్ల చానెల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో డీఎంకే పార్టీపై అళగిరి నిప్పులు చెరిగిన విషయం విదితమే. డీఎంకే పార్టీలో ప్రజాస్వామ్యం మృగ్యమైందని అన్నారు. తన తండ్రి, కరుణానిధిని కొంత మంది బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు.

 

శుక్రవారం అళగిరిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు డీఏంకే అధినేత ఎం.కరుణానిధి ప్రకటించిన సంగతి తెలిసిందే. డీఎండీకే అధినేత, సినీనటుడు విజయ్ కాంత్తో పొత్తు పెట్టుకోవాలని డీఎంకే ఉవ్విళ్లూరుతుంది. ఆ అంశంపై డీఎంకే పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతుంది. అయితే ఇటీవల అలగిరి ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ కాంత్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దీంతో కరుణానిధి ఆగ్రహానికి గురైయ్యారు.

 

దాంతో అళగిరిని కరుణానిధి తన నివాసానికి పిలిపించి మాట్లాడారు. ఆ కొద్ది సేపటికే అళగిరిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు కరుణానిధి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అళగిరిని బహిష్కరించడంపై ఆయన వర్గం ఆగ్రహంతో ఉండగా, స్టాలిన్ వర్గం మాత్రం ఆనందోత్సాహలతో ఉంది. కరుణానిధి కుమారులు ఎం.కె.అళగిరి, ఎం.కె.స్టాలిన్ల మధ్య వర్గ పోరు ఇటీవల కాలంలో తీవ్రమైన సంగతి తెలిసిందే.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement