సీఎం పదవి ఇస్తేనే కూటమికి సై!
చెన్నై: కొలిక్కిరాని కూటమి కోసం భారతీయ జనతా పార్టీ రాయబారం ప్రారంభించినా అంతగా కలిసొచ్చినట్లుగా లేదు. తమిళపార్టీలతో రాజకీయ మంతనాలు సాగించేందుకు శనివారం చెన్నై చేరుకున్న కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ డీఎండీకే నేతలతో చర్చలు జరుపుతున్నారు. డీఎండీకే అధ్యక్షులు విజయకాంత్, పీఎంకే యువజన విభాగం అధ్యక్షులు అన్బుమణి రాందాస్ తో చర్చలు మొదలుపెట్టారు. విజయ్ కాంత్ మాత్రం కూటమి వైపు మొగ్గుచూపి, తనకు సీఎం పదవి ఇస్తేనే ఇందుకు సమ్మతిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్‌కు కౌంట్‌డౌన్ మొదలైనట్లుగా అన్ని పార్టీలు భావిస్తున్నాయి.
దక్షిణాదిలో బలం పుంజుకోవావలని ఆశిస్తున్న బీజేపీ అధినాయకత్వం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలతో తమ బలం ఏమిటో నిరూపించుకోవాలనే పట్టుదలతో ఉంది. డీఎండీకే నేత నేతృత్వంలోనే కూటమి ఏర్పడాలి, తనను సీఎం అభ్యర్దిగా ప్రకటించాలని విజయకాంత్ బీజేపీకి షరతులు విధించారు. ఇందుకు అంగీకరిస్తేనే బీజేపీతో చర్చలని విజయకాంత్ భీష్మించకుని ఉన్నారు. కెప్టెన్ వైఖరితో రెండు పార్టీల మధ్య అగాధం ఏర్పడింది. ఈ పరిస్థితిని చక్కదిద్ది కూటమిని కొలిక్కి తేచ్చేందుకు జవదేకర్ రంగంలోకి దిగానా విజయ్ కాంత్ తన నిర్ణయంలో మార్పులేదని చెప్పినట్లు తెలుస్తోంది.