tamilnadu elections
-
టీఆర్ఎస్ నాయకులపై ఎంపీ అరవింద్ ఫైర్!
సాక్షి, న్యూఢిల్లీ: తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టో పై టీఆర్ఎస్ నాయకులు పిచ్చికుక్కల్లా మాట్లాడుతున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ధ్వజమెత్తారు. తమిళనాడులో అన్నాడీఎంకే, బీజేపీ పార్టీలు మిత్రపక్షాలుగా పోటీ చేస్తున్నాయని, అక్కడ ఇరు పార్టీల కూటమి అధికారంలోకి వస్తే పసుపు రైతుల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. అక్కడ పసుపు బోర్డును కేంద్రమే ఏర్పాటు చేస్తే, ఆ రాష్ట్ర ఇంచార్జీగా ఉన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టతనిస్తారన్నారు. కేంద్ర ప్రభుత్వం.. నిజామాబాద్ పసుపు రైతులకు ఆశించిన స్థాయి కన్నా ఎక్కువగానే సహాయం చేస్తుందని పేర్కొన్నారు. పసుపు రైతుల కోసం కేంద్రం స్పైసెస్ ఎక్స్టెన్షన్ బోర్డును ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్త చేశారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దిగుమతులను తగ్గించి ఎగుమతులను పెంచిందని ప్రకటించారు. పసుపు రైతుల కోసం ప్రతి ఏటా బడ్జెట్ కేటాయింపుల్లో పది కోట్ల రూపాయలు పెంచుతున్నామని, వారికి మద్దతు ధరకు మించిన రేటునే ఇస్తున్నామని వెల్లడించారు. క్వాలిటీ పసుపు పదివేలకు పైగానే ధర పలుకుతోందని తెలిపారు. కేసీఆర్, కేటీఆర్‌లు రైతులకు రుణ మాఫీ చేస్తామని అన్యాయం చేస్తున్నారని, నిరుద్యోగ భృతి ఇస్తామని నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేక నాపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. -
నన్ను గెలిపిస్తే ప్రతి ఇంటికి రూ. కోటి...
తమిళనాడు: సాధారణంగా ఎన్నికలంటే ఓటుకు వెయ్యి నోటు ఇస్తారు గానీ ఏకంగా కోట్లిస్తానంటున్నాడు మధురైలోని ఓ మహానుభావుడు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నతరుణంలో, ఓ తమిళ తంబి హామీలను చూస్తే ఎవరికైనా షాక్‌తో దిమ్మతిరిగి బొమ్మ కనపడాల్సిందే. తనను గెలిపిస్తే ప్రజలను షికారుకి తీసుకెళ్తా అంటున్నాడు. షికారు అంటే పక్క రాష్ట్రమో, లేదా పొరుగు దేశమో కాదండి, ఏకంగా చంద్రుని పైకే ట్రిప్ అంట. తులమ్ శరవణన్ మధురై దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నఒక స్వతంత్ర అభ్యర్థి. ఇతని వెరైటీ వాగ్దానాల జాబితాలో మినీ-హెలికాప్టర్, ప్రతి ఇంటికి ఒక కోటి వార్షిక డిపాజిట్, వివాహాలకు బంగారు ఆభరణాలు, మూడు అంతస్థుల ఇల్లు, చంద్రుని పర్యటన ఉన్నాయి. తన మ్యానిఫెస్టోలో ఆయన ఇచ్చిన వాగ్దానాలు నియోజకవర్గ ప్రజల దృష్టిని ఆకర్షించాయి. ఈ బాబు అంతటి ఆగలేదు గృహిణుల పనిభారాన్ని తగ్గించే రోబోట్, ప్రతి కుటుంబానికి ఒక పడవ, తన నియోజకవర్గ ప్రజలను చల్లగా ఉంచడానికి 300 అడుగుల ఎత్తైన కృత్రిమ మంచు పర్వతం ఏర్పాటు, అంతరిక్ష పరిశోధన కేంద్రం, రాకెట్ లాంచ్ ప్యాడ్ కూడా ఇస్తానని హామీ ఇచ్చారు. ఇంకేముంది ఈ వార్త తమిళనాట వైరల్ అయ్యింది. కాగా తన హామీల వెనుక దాగున్న అంతర్యాన్ని మీడియాతో పంచుకున్నాడు. ఇంకైనా ప్రజలు తెలుసుకోవాలి మరీ వినడానికే విడ్డూరంగా ఉన్న ఈ హామీల గురించి అతను ఏమంటున్నాడంటే. ఎన్నికలంటే చాలు అభ్యర్థుల నోటి నుంచి హామీలు వర్షాకాలంలో వరదల్లా వస్తుంటాయ్ అవి ఆచరణకు సాధ్యమున్నా కాకపోయినా, అందుకే ప్రజలు మాటల అభ్యర్థులను కాకుండా చేతల అభ్యర్థులను ఎన్నుకోవాలని నేను కోరుకుంటున్నానని అందుకే ఈ వెరైటీ హామీలని శరవణన్ చెప్పారు. ప్రజల సంక్షేమం కోసం రాజకీయ పార్టీలు పని చేయడం లేదు. రాజకీయ నాయకులు " పనితో కాకుండా వారి మనీతో ప్రజలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు" నా ఈ హామీలను చూసైనా ప్రజల్లో మార్పు రావాలని అందుకే ఈ ప్రయత్నమంటూ చెప్పాడు. శరవణన్ సందేశాన్ని వ్యాప్తి చేయడానికి అతని స్నేహితులు, బంధువులు సహాయం చేస్తున్నారు. అతను మాట్లాడుతూ "నా వాట్సాప్ మెసెజ్ వైరల్ అయ్యింది, ప్రజలు ప్రస్తుతం నా వెరైటీ వాగ్దానాలను, దాని వెనుక దాగున్న అంతర్యాన్ని ఆలోచిస్తున్నారు. నేను గెలవకపోయినా ఇదే నా విజయంగా భావిస్తానని తెలిపాడు. ( చదవండి : ఒక ఓటు.. రూ.2 లక్షలు ) -
కుష్బూ సెట్టింగ్.. కంటైనరే కార్యాలయం
సాక్షి, చెన్నై: సినిమా వాళ్లు ఏ పనిచేసినా, అందులో వైవిధ్యం, వినూత్నం, అభిమాన ఆకర్షణ దిశగానే ఉంటాయి. ఆ దిశగా సినీ నటి, బీజేపీ నేత కుష్బూ పయనం ఉంటున్నది. సినీ తరహాలో తన పార్టీ ఎన్నికల కార్యాలయం సెట్టు వేయించుకుని ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. డీఎంకే, కాంగ్రెస్‌లో ఎన్నికల్లో పోటీకి అవకాశం రాకున్నా, తాజాగా బీజేపీలో తనకు ఆ అవకాశం దక్కుతుందన్న ధీమాతో ఉన్నారు. చేపాక్కం–ట్రిప్లికేన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేయడం ఖాయం అన్న సంకేతాలు కొంత కాలంగా వినిపిస్తున్నాయి. ఆ నియోజకవర్గంలో తిష్టవేసి, ఓటర్లను ఆకర్షించేందుకు విశ్వప్రయత్నాల్లో ఆమె ఉన్నారు. ఆ నియోజకవర్గం పరిధిలో ఎన్నికల కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇది తాత్కాలికమే కావడంతో, దానిని సినీ తరహా సెట్టింగ్‌తో రూపొందించుకున్నారు. అన్నాసాలైలోని ఎల్ఐసీ పక్కనే ఉన్న తొమ్మిది గ్రౌండ్ల స్థలంలో ఈ సెట్టింగ్ వేశారు. ఇక్కడ నాలుగు కంటైనర్లు ఏర్పాటు చేశారు. అందులో అన్ని రకాల వసతులు ఉన్నాయి. ఇందులో ఒక కంటైనర్ కుష్బూకు కార్యాలయంగా మార్చేశారు. మిగిలిన మూడింటిని నియోజకవర్గ నిర్వాహకులు, ఇతర ముఖ్యులు ఎన్నికల పనులపై దృష్టి పెట్టే రీతిలో ఆఫీసుగా మార్చేశారు. ఇక్కడ ఏసీ, కంప్యూటర్, ప్రింటర్ అంటూ అన్ని రకాలు వసతులు కలి్పంచడమే కాదు, కేడర్ తరలివచ్చినా, ఏదేని సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలన్నా, అందుకోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకుని ఉండడం విశేషం. హేమమాలిని రాక.. నటి హేమమాలిని తమిళనాడుకు చెందిన వారే. బాలీవుడ్లో స్థిర పడ్డా ఆమె ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్నారు. తాజాగా ఆమె సేవల్ని ప్రచారానికి ఉపయోగించుకునేందుకు బీజేపీ నేతలు సిద్ధమయ్యారు. నాలుగు రోజులపాటు హేమమాలిని ఎన్నికల ప్రచారానికి కసరత్తులు చేట్టారు. ఈ ప్రచారంలో ఆమె తమిళంలోనే ప్రచారం సాగించబోతున్నారని కమలనాథులు పేర్కొంటున్నారు. -
ఏఐఏడీఎంకేతో పొత్తు కొనసాగుతుంది
మదురై: తమిళనాడులోని అధికార ఏఐఏడీఎంకేతో తమ పొత్తు కొనసాగుతుందని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేస్తామని వెల్లడించారు. శనివారం మదురైలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. గతంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో తమిళనాడు వివక్షకు గురైందంటూ బీజేపీ హయాంలో ఆ పరిస్థితిలో మార్పు వచ్చిందన్నారు. మోదీ డిఫెన్స్ కారిడార్ వంటి ప్రాజెక్టులతోపాటు అవసరమైన మేర నిధులను తమిళనాడుకు మంజూరు చేశారన్నారు. ప్రత్యేక వాణిజ్య, ఆర్థిక, సాంస్కృతిక వారసత్వం తమిళుల సొంతమన్నారు. మదురైని భక్తిభూమి అని ఆయన అభివర్ణించారు. ఇక్కడి మీనాక్షి ఆలయంతో మహాత్మాగాంధీకి ప్రత్యేక అనుబంధం ఉందని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీనాక్షి ఆలయాన్ని సందర్శించుకున్నారు. పార్టీ కోర్ కమిటీ సమావేశంలో పాల్గొని, ఎన్నికల్లో గెలుపునకు అవకాశం ఉన్న స్థానాలపై చర్చించారు. -
తమిళనాడులో వీడిన ఉత్కంఠ
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో రాజకీయ సంక్షోభం ముగిసింది. ప్రస్తుత సీఎం పళనిస్వామికి మరో అవకాశం దక్కింది. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన పేరునే ఎంపిక చేశారు. ఈమేరకు చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కొద్దిసేపటి క్రితం జరిగిన భేటీలో నిర్ణయం తీసుకున్నారు. సీఎం అభ్యర్థిగా పళనిస్వామి పేరును పన్నీర్ సెల్వం ప్రతిపాదించారు. పార్టీ వ్యవహారాల పర్యవేక్షణ బాధ్యతను పన్నీర్ సెల్వంకు అప్పగించారు. ఇందుకు సంబంధించిన ఒప్పంద పత్రాలపై పళనిస్వామి, పన్నీర్ సెల్వం సంతకాలు చేశారు. ఇక.. 11 మంది సభ్యులతో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో పళనిస్వామి మద్దతుదారులు ఆరుగురు, పన్నీర్ సెల్వం మద్దతుదారులు ఐదుగురు ఉన్నారు. సీఎం అభ్యర్థి ఎవరనే అంశంపై పార్టీలో ఇప్పటి వరకు భారీ ఎత్తున వివాదం నడిచింది. నేనంటే నేనే అంటూ పళనిస్వామి, పన్నీర్ సెల్వం పరోక్షంగా ప్రకటనలిచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ పళనిస్వామికి అవకాశం దక్కడంతో సస్పెన్స్ వీడింది. (చదవండి: అన్నాడీఎంకేలో కుర్చీ వార్) -
మరింత వేడెక్కిన ఆర్కేనగర్ బరి
జయలలిత మరణంతో ఖాళీ అయిన చెన్నై ఆర్కేనగర్ నియోజకవర్గం ఉప ఎన్నికల బరి మరింత వేడెక్కింది. తాజాగా జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ సైతం అక్కడి నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఏప్రిల్ 12వ తేదీన జరగనున్న ఈ ఉప ఎన్నికలలో తాను ఎంజీఆర్ అమ్మ దీపా పెరవై పార్టీ తరఫున బరిలోకి దిగుతున్నట్లు ఆమె తెలిపారు. పోలింగ్ అధికారి ప్రవీణ్ నాయర్‌కు ఆమె తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. దానికి ముందుగా చెన్నై మెరీనా బీచ్‌లోని అమ్మ స్మారకం వద్ద నివాళులు అర్పించారు. జయలలిత మరణం తర్వాత ముందుగా వచ్చింది ఆర్కేనగర్ వాసులేనని, ఇప్పుడు అమ్మకు అసలైన వారసులు ఎవరన్న విషయాన్ని వాళ్లే ఈ ప్రపంచానికి చాటి చెబుతారని ఉద్వేగంగా చెప్పారు. ఈ ఎన్నికల్లో విజయం తన రాజకీయ జీవితంలో ఎప్పటికీ నిలిచిపోతుందన్నారు. అన్నాడీఎంకేకు మంచి నాయకత్వం అవసరమని, కేవలం తాను మాత్రమే జయలలిత చూపించిన మార్గంలో పార్టీని నడిపించగలనని కార్యకర్తలు భావిస్తున్నారని దీప అన్నారు. ఎన్నికల కమిషన్ తమకు ఏ గుర్తు కేటాయిస్తే దానిమీదే పోటీ చేస్తానని తెలిపారు. తాను ప్రచారం ప్రారంభించగానే తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేస్తామని వివరించారు. -
ఏపీ నకిలీ నంబర్ ప్లేట్లతో 570 కోట్ల రవాణా
- తమిళనాడు ఎన్నికల సమయంలో పట్టుబడిన మూడు కంటైనర్లపై కేసు - సీబీఐ అధికారి వెల్లడి సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో గడిచిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో పట్టుబడిన రూ.570 కోట్ల నగదు రవాణా కంటైనర్ లారీలకు విశాఖపట్నానికి చెందిన మోటార్ బైక్‌ల నంబర్లు వినియోగించినట్లు సీబీఐ ప్రాథమిక విచారణలో తేలింది. అప్పట్లో తిరుపూరు జిల్లాలో పట్టుబడిన ఈ మూడు కంటైనర్లను చెన్నైలోని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా అధికారులు విడిపించుకెళ్లారు. కంటైనర్లలో నగదు రవాణా వెనుక ఏదో కుట్ర ఉందని డీఎంకే అనుమానించింది. డీఎంకే అధికార ప్రతినిధి టీకేఎస్ ఇళంగోవన్ సీబీఐ విచారణ కోరుతూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కంటైనర్ల కేసును విచారించాల్సిందిగా సీబీఐని హైకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో దర్యాప్తులో తేలిన కొన్ని నిజాలను ఢిల్లీలోని సీబీఐ ఉన్నతాధికారి ఒకరు బయటపెట్టారు. ఆ మూడు కంటైనర్లు (ఏపీ13 ఎక్స్ 5204, ఏపీ 13 ఎక్స్ 8650, ఏపీ 13 ఎక్స్ 5203) విశాఖపట్నంలోని ఒక ట్రాన్స్‌పోర్టు క్యారియర్ వారి మోటార్ బైక్‌ల కోసం జారీ చేసినట్లు తెలుసుకున్నామన్నారు. ఈ కేసు వ్యవహారంలో ఇంకా ఒక నిర్ణయానికి రాకున్నా నగదు రవాణా వెనుక ఏదో అక్రమం దాగి ఉందని అనుమానిస్తున్నట్లు తెలిపారు. రూ.570 కోట్లను విడిపించుకునేందుకు ఎస్బీఐ అధికారులు 24 గంటల సమయం తీసుకోవడంలోనూ ఏదో మతలబు ఉందని భావిస్తున్నట్లు చెప్పారు. కంటైనర్లకు కాపలాగా అనుసరించిన వ్యక్తుల సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని, అందులోని సంభాషణలను విశ్లేషించనున్నట్లు తెలిపారు. -
157 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు
తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో 157 మంది అభ్యర్థులపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. వాటిలో హత్యకేసులు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని తమిళనాడు ఎలక్షన్ వాచ్, అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రైట్స్ సంస్థలు ఓ ప్రకటనలో తెలిపాయి. సీపీఎం అభ్యర్థులలో 47శాతం మంది, డీఎండీకే అభ్యర్థులలో 42 శాతం మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థులలో 27 శాతం మంది, బీజేపీ వాళ్లలో 15 శాతం మంది, అన్నాడీఎంకే అభ్యర్థులలో 22 శాతం మంది, డీఎంకే అభ్యర్థులలో 40 శాతం మంది మీద కేసులు ఉన్నాయి. ఇక అందరికంటే ధనవంతులలో కాంగ్రెస్ అభ్యర్థి హెచ్.వసంతకుమార్ ఉన్నారు. ఆయనకు రూ. 337 కోట్ల ఆస్తి ఉంది. ఆయన తర్వాతి స్థానాలలో ఎంకే మోహన్ (డీఎంకే- రూ. 170 కోట్లు), సీఎం జయలలిత (అన్నాడీఎంకే - రూ. 113 కోట్లు) ఉన్నారు. సగటున ప్రధాన పార్టీల వాళ్లలో 997 మందికి రూ. 4.35 కోట్ల చొప్పున ఉన్నాయి. బీజేపీ అభ్యర్థులు వి.కరుప్పన్, ఎస్.దండపాణి ఇద్దరూ తమకు ఆస్తిపాస్తులే లేవన్నారు. -
నాకు ఏమైనా అయితేనే అతడు సీఎం!
త్వరలో రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే గెలిస్తే తానే ముఖ్యమంత్రి అవుతానని ఆ పార్టీ అధ్యక్షుడు కరుణానిధి మరోసారి స్పష్టం చేశారు. తనకు ఏమైనా అయ్యేవరకు తన కొడుకు ఎంకే స్టాలిన్ వేచి ఉండాల్సిందేనని చెప్పారు. స్టాలిన్‌కు కూడా ముఖ్యమంత్రి అవ్వాలని లేదని, తాను 1957 నుంచి ఇప్పటివరకు ఒక్క ఎన్నికలోనూ ఓడిపోలేదని అన్నారు. ఈసారి తమ పార్టీ గెలిస్తే తాను ఆరోసారి సీఎం అవుతానని చెప్పారు. తాను ముఖ్యమంత్రి కావాలని కోరుకునేవాళ్లలో పార్టీ కోశాధికారి స్టాలిన్ మొదటివాడని తెలిపారు. పార్టీలో కొంతమంది స్టాలిన్ సీఎం కావాలని కోరుకుంటున్నారు కదా అన్న ప్రశ్నకు.. ప్రకృతి తనను ఏమైనా చేస్తేనే అతడికి అవకాశం వస్తుందని కరుణ సమాధానం ఇచ్చారు. ఇంతకుముందు డీఎంకే ప్రభుత్వం ఉన్నప్పుడు స్టాలిన్ ఉప ముఖ్యమంత్రిగా ఉండేవారు. కాగా, ఒకప్పుడు పార్టీలో ఉండే స్టాలిన్ అన్న ఎంకే అళగిరి కూడా ముఖ్యమంత్రి పదవి కోసం గట్టిగానే పోటీపడ్డారు గానీ, తర్వాతి కాలంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేపడుతున్నారన్న ఆరోపణలతో అతడిని బహిష్కరించారు. దాంతో ఇప్పుడు కరుణ రాజకీయ వారసుడిగా స్టాలిన్ ఒక్కరే మిగిలారు. -
3 లక్షల వెండి గొలుసులు స్వాధీనం
సేలం: తమిళనాడు ఈరోడ్ జిల్లా గోపిచెట్టిపాళయం వద్ద ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు శనివారం వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా . మైసూరు నుంచి మదురైకి వెళుతున్న కర్ణాటక ప్రభుత్వ బస్సులో సేలంకు చెందిన మహ్మద్ యాకూబ్ వద్ద నుంచి 3 లక్షల వెండి గొలుసులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు 12 కిలోల వెండి కడ్డీలు, రూ.50 వేల నగదు కూడా స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం అతడిని పోలీస్ స్టేషన్ కి తరలించారు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి ... విచారిస్తున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తమ తనిఖీలను ముమ్మరం చేశారు. -
ఒట్టేసి చెబుతున్నా..
ఓటుకు నోటు నో..నో 10న కోటి మందితో ప్రతిజ్ఞ చెన్నై: ఓటు హక్కు అనే మాటకు అర్థం మారి పోయి ఓటుకు నోటు హక్కు అనే మనస్తత్వాల్లో మార్పు తెచ్చేం దుకు ఎన్నికల కమిషన్ సిద్ధమైంది. అవును ఒట్టేసిచెబుతున్నా..‘ఓటుకు నోటు తీసుకోను, ఇవ్వను’ అని ఈనెల 10వ తేదీన కోటి మందితో ప్రమాణం చేయిస్తోంది. ఓటు వేసేందుకు డబ్బు పుచ్చుకోవడం, ఇచ్చుకోవడం కూ డా నేరమే. ఈ నేరాలకు పాల్పడిన వారిని అరెస్ట్ చేసి తగిన చర్యలు తీసుకుంటామని, నేర తీవ్రతను బట్టి ఏడాది జైలు శిక్ష కూడా తప్పదని ఈసీ ఇప్పటికే అనేకసార్లు హెచ్చరించింది. అయినా రాష్ట్రంలో విచ్చలవిడిగా నగదు పంచే ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. కోట్లాది రూపాయలను అధికారులు స్వాధీనం చేసుకుంటూనే ఉన్నారు. గతంలో జరిగిన అనేక ఎన్నికల్లో నోట్లు పంచడమే కాదు, నగదు అందని ఓటర్లు ఆయా పార్టీల అభ్యర్థుల వద్దకు వెళ్లి డిమాండ్ చేసిన సంద ర్భాలు ఉ న్నాయి. ఓటుకు నోటు లేదా, పంచెలు, చీరలు, మద్యం బాటి ళ్లు, బిరియానీ పొట్లాలు పంచడం నేతలు అలవాటుగా మార్చుకున్నారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం రాష్ట్రంలో పంచముఖ పోటీ నెలకొని ఉంది. పార్టీల నేతలు, అభ్యర్థులంతా అధికారంలోకి వచ్చేది నువ్వా నేనా అని సవాళ్లు విసురుకుంటున్న దశలో ఎన్నికల నిర్వహణ కఠినతరమైంది. ఎ న్నికల్లో అన్ని ఏర్పాట్ల కంటే నగదు పంపిణీ కాకుండా చేయడం ఈసీకి సవాలుగా మారింది. నగదు చలామణికి అడ్డుకట్ట వేసేందుకు ఎన్నడూ లేని విధంగా ఆదాయపు పన్నుశాఖ అధికారులను సైతం రంగంలోకి దించింది. ఈ పరిస్థితిలో ఓటర్లు, నేతల్లో మార్పు తెచ్చేందుకు కొత్త విధానాన్ని ప్రవేశపెట్టినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి రాజేష్ లఖానీ తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ ఈనెల 10వ తేదీన ఉదయం 10 గంటలకు ప్రజలు, వివిధ పార్టీల నేత ల చేత ఓటు వేసేందుకు నోటు తీసుకోం, ఇవ్వం అంటూ ప్రతి జ్ఞ చేయిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోని 66 పోలింగ్ బూతుల వద్ద సుమారు కోటి మందితో ఈ ప్రతిజ్ఞ చే యించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. క నీసం 50 వేల మందైనా వస్తారని ఆశిస్తున్నామని అన్నారు. అలాగే పంచాయతీ కార్యాలయాల్లో, ప్రభుత్వ కార్యాలయాలు, ఎ న్నికల కార్యాలయాల్లో సైతం సిబ్బం ది చేత ప్రతిజ్ఞలు చేయిస్తున్నామని తె లిపారు. పార్టీల నేతలు తమ ప్రచా రం ప్రారంభించేటప్పుడు ప్రతిజ్ఞ చే యవచ్చని అన్నారు. రోటరీ, లయన్స్క్లబ్బులు, ఎన్జీవో సంఘాలు, నివాసగృహాల అసోసియేషన్లు, గుడిసెవాసులు సైతం ప్రతిజ్ఞలో పాల్గొనేలా చూడాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశించామని అన్నారు. ఒట్టు తీసి చెరువు గట్టుమీద పెట్టకుండా కనీసం ప్రతిజ్ఞ చేసినవారైనా కట్టుబడి ఉంటారని ఆశిద్దాం. -
బృందా గానం!
చెన్నై :‘ సెంట్రల్లో మోదీ...స్టేట్‌లో లేడీ ’ అంటూ సీపీఎం జాతీయ నాయకురాలు బృందా కారత్ కొత్త పల్లవితో అందరి చేత చప్ప ట్లు కొట్టించే పనిలో పడ్డారు. అయితే, ఆ మోదీ, ఈ లేడి పుణ్యమా ప్రజలు కష్టాల కడలిలో మునగాల్సి వచ్చిందని శివాలెత్తుతున్నారు. ఎన్నికల బరిలో ఉన్న జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా వారి వారి అధినేతలు ప్రచారబాటలో ఉన్న విషయం తెలిసిందే. ఇక, తాము సైతం అంటూ సీపీఎం, సీపీఐ అభ్యర్థులకు మద్దతుగా ఆ పార్టీల జాతీయ నాయకులు తమిళనాడు బాటకు సిద్ధం అయ్యారటా..!. ఇందులో భాగంగా తంజావూరు, తిరుచ్చి, మదురైలలో బృందాకారత్ ప్రచారంలో దూసుకెళుతున్నారు. తమ అభ్యర్థులకు అండగా నిలవాలని పిలుపునిస్తూ, కేంద్రంలోని మోదీ సర్కారు, రాష్ట్రంలోని లేడీ సర్కారు అంటూ కొత్త పల్లవితో సెటైర్లు విసిరే పనిలో పడ్డారు. తన దైన శైలిలో మోదీ...లేడీ అంటూ ఆమె సంధిస్తున్న వ్యాఖ్యలకు జనం నుంచి చప్పట్లు దరువెత్తుతున్నాయట. దీంతో మరింత ఉత్సాహాన్ని నింపే విధంగా అమ్మకు అన్నీ తెలుసూ అంటూ, అందుకే తాగు నీళ్లకు బదులుగా మద్యం ఏరులై పారిచ్చేస్తున్నారు. బిడ్డల జీవితాల్ని పిప్పి చేసేస్తున్నారంటూ చలోక్తులు విసురుతున్నారు. అయితే, కేవలం సీపీఎం అభ్యర్థులకు మద్దతుగా ఆమె ప్రసంగాలు సాగుతుండడంతో, ఇక తమను ఆదరించరా..? అన్నట్టు ప్రజా సంక్షేమ కూటమిలోని ఇతర పార్టీల అభ్యర్థులు ఎదురు చూస్తున్నారట. -
తెలుగుశక్తికి ఓట్లతో విముక్తి
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితమీద పోటీచేస్తున్న తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి గురువారం నాడు హోసూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తన ఎన్నికల గుర్తు అయిన ఆటోరిక్షాకు ఓటేయాలని హోసూరు ప్రాంతంలో ఉన్న తెలుగువారిని అభ్యర్థించారు. 'నిర్బంధపు చెరలో తెలుగుశక్తి.. మీ ఓటుతో దానికి విముక్తి' అనే నినాదంతో ఆయన తన ప్రచారాన్ని కొనసాగించారు. దశాబ్దాలుగా తమిళనాడులో తెలుగు ప్రజలు అణచివేతకు గురవుతున్నారని, మైనారిటీలుగా ఉన్న తమిళులు మెజారిటీ అయిన తెలుగు వారిపై పెత్తనం సాగించడం సహించరాని విషయమని చెప్పారు. హోసూరు ప్రాంతంలో ఉన్న తెలుగువారిని కలిసి.. తనకు ఓట్లేసి గెలిపించాలని కోరారు. -
తనిఖీల్లో రూ. కోటి స్వాధీనం
మదురై : ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు వేర్వేరు ప్రాంతాల్లో జరిపిన వాహన తనిఖీల్లో కోటి రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. దిండుగల్‌లో సహాయ వాణిజ్య పన్నుశాఖ అధికారి దీనదయాళన్ ఆధ్వర్యంలో ఫ్లయింగ్ స్క్వాడ్ హెడ్‌పోస్టాఫీసు వద్ద జరిపిన వాహన తనిఖీల్లో సరైన ఆధారాలు లేకుండా వాహనంలో తీసుకెళుతున్న 83 లక్షలు విలువ చేసే నోట్ల కట్టలతో ఉన్న సూట్‌కేసు డ్రైవర్ వద్ద కనిపించింది. ఆ సొమ్మును దిండుకల్ ఎన్నికల కార్యాలయానికి తీసుకెళ్లి సరి చూశారు. ఎన్నికల్లో ఓటర్లకు ఇవ్వడానికి తీసుకెళుతున్నారా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మదురైలో: మదురై జిల్లా ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ నాట్రా మంగళంలో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు వాహన తనిఖీలు జరిపారు. ఆ సమయంలో సరైన ఆధారాలు లేకుండా కారు లో తీసుకెళుతున్న 31 లక్షలను స్వాధీనం చేసుకుని ట్రెజరీకి పంపారు. ఆ సొమ్మును జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ కె.వీరరాఘవరావు పరిశీలించి వాటిని ట్రెజరీలో ఉంచారు. -
బస్సులో రూ. కోటీ 34 లక్షలు స్వాధీనం
కోయంబత్తూరు: తమిళనాడులో మే 16న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కోయంబత్తూరులో ఎన్నికల వాతావరణం వేడిక్కింది. ఇప్పటికే పలు పార్టీలు రోడ్డు షోలతో జోరుగా ప్రచారంలో నిమగ్నమైయ్యాయి. ఈ ఎన్నికల దృష్ట్యా రంగంలోకి దిగిన ఎన్నికల అధికారులు పలు ప్రాంతాల్లో ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా గురువారం కోయంబత్తూరు నుంచి కేరళకు వెళుతున్న బస్సులో తనిఖీలు చేపట్టారు. బస్సులో తరలిస్తున్న రూ. కోటీ 34 లక్షల రూపాయలను ఇద్దరు వ్యక్తుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిద్దరినీ ఎన్నికల అధికారులు ఆదాయ పన్ను శాఖ అధికారులకు అప్పగించారు. అదుపులోకి తీసుకున్న ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఇంత సొమ్ము ఎవరిది.. ఎక్కడికి తరలిస్తున్నారంటూ పట్టుబడిన ఇద్దరి వ్యక్తులను విచారిస్తున్నట్టు సమాచారం. -
డీఎంకేది పిల్ల బెదిరింపు
కెప్టెన్ విజయ్‌కాంత్ పళ్లిపట్టు: డీఎంకేది పిల్ల బెదిరింపులని, అన్నాడీఎంకే అవినీతి సొమ్ముతో సామాన్యులను కొని జనాక్షరణగా చేస్తున్న ప్రచారాలు ఎన్నికల్లో చెల్లవని డీఎండీకే అద్యక్షుడు విజయకాంత్ ఎద్దేవా చేశారు. డీఎండీకే, ప్రజా సంక్షేమ కూటమి, తమాకాతో పాటు ఆరు పార్టీల ఆధ్వర్యంలో పొత్తు ఏర్పాటు చేసుకుని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. ఆ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా విజయకాంత్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో భాగంగా తిరుత్తణి డీఎండీకే అభ్యర్థి కృష్ణమూర్తికి మద్దతుగా శుక్రవారం రాత్రి తిరుత్తణిలో బహిరంగ సభ నిర్వహించారు. టీఎంసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రామన్, ఎండీఎంకే జిల్లా కార్యదర్శి డీఆర్ ఆర్ సెంగుట్టవన్, వీసీకే జిల్లా కార్యదర్శి సిద్ధార్థన్, సీపీఐ జిల్లా కార్యదర్శి కన్నన్, సీపీఎం జిల్లా కార్యదర్శి పన్నీరు సెల్వం, టీఎంసీ జిల్లా అధ్యక్షుడు శేఖర్‌తో సహా కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. సమావేశంలో కెప్టెన్ విజయకాంత్ పాల్గొని అభ్యర్థి కృష్ణమూర్తిని పరిచయం చేసి మాట్లాడారు. తను కూటమిలో ఆరు పార్టీలున్నాయని కూటమి పార్టీల అభ్యర్థులకు ఓట్లేసి గెలిపించాలని, తిరుత్తణిలో కృష్ణమూర్తికి ఢంకా గుర్తుకు ఓట్లేయాలని పిలుపు నిచ్చారు. డీఎంకే పిల్ల బెదిరింపులతో స్టాలిన్ జపం చేస్తున్నారని, అలాగే అన్నాడీఎంకే డబ్బుతో నిరుపేదలను కొనుగోలు చేసి భారీగా బహిరంగ సభలు చూపి ప్రచారాలకు పరిమితమవుతున్నట్లు చెప్పారు. అయితే తమ కూటమి ఎలాంటి ఆకర్షణలకు, ప్రలోభాలకు, ప్రజలను గురి చేయకుండా ప్రజలే ఆసక్తిగా తమ వెంట నడుస్తున్నట్లు చెప్పారు. -
ఒకే జాబితా !
ప్రకటించిన డీఎంకే 173 స్థానాల్లో అభ్యర్థులు మళ్లీ తిరువారూర్‌లో కరుణ కొళత్తూరులో స్టాలిన్ 19 మంది మహిళలకు సీట్లు పుదుచ్చేరిలోనూ కుదిరిన ఒప్పందం ఒకే జాబితాగా అభ్యర్థులు చిట్టాను డీఎంకే ప్రకటించింది. 173 స్థానాల్లో తమ అభ్యర్థులను రంగంలోకి దించుతూ జాబితాను అధినేత కరుణానిధి ప్రకటించారు. మళ్లీ తిరువారూర్ నుంచి కరుణానిధి, కొళత్తూరు నుంచి ఎంకే స్టాలిన్ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ముఖ్య నేతలతో పాటు, కొత్త ముఖాలకు పెద్ద పీట వేశారు. 19 మంది మహిళలకు చోటు కల్పించారు. ఇక పుదుచ్చేరిలోనూ కాంగ్రెస్‌తో పొత్తు సఫలీకృతమైంది. సాక్షి, చెన్నై : మళ్లీ అధికారమే లక్ష్యంగా డీఎంకే అధినేత ఎం కరుణానిధి తన రాజతంత్రాన్ని ప్రయోగించి వ్యూహాల్ని రచిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్, ఇండియన్యూనియన్ ముస్లిం లీగ్, మనిద నేయ మక్కల్ కట్చి, పుదియ తమిళగం, ఎండీఎండీకే, పెరుంతలైవర్ మక్కల్ కట్చి, సమూహ సమత్తువ పడై, వ్యవసాయ తొళిలార్ కట్చిలతో కలసి ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు సిద్ధం అయ్యారు. మిత్రలందరికీ సీట్ల పంపకాలు ముగియడంతో, ఇక 173 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దించేందుకు నిర్ణయించారు. ఈ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కరుణానిధి బుధవారం సాయంత్రం ప్రకటించారు. తిరువారూర్ నుంచి కరుణానిధి, కొలత్తూరు నుంచి ఎంకే స్టాలిన్ మళ్లీ పోటీ చేయనున్నారు. ఆ పార్టీలో కీలక నేతలుగా ఉన్న దురైమురుగన్ - కాట్పాడి నుంచి పోటీ చేస్తుండగా, వయోభారం దృష్ట్యా, ప్రధాన కార్యదర్శి అన్భళగన్, సీనియర్ నేట ఆర్కాటు వీరస్వామి రేసు నుంచి తప్పుకున్నారు. ఇక, పార్టీలు ముఖ్య నాయకులుగా, మాజీ మంత్రులుగా పనిచేసిన కేఎన్ నెహ్రూ, పొన్ముడి, ఎంఆర్కే పన్నీరు సెల్వం, పూంగోదై, సురేష్ రాజన్, తంగం తెన్నరసు, కేకేఎస్ఎస్ఆర్ రామచంద్రన్, ఐ పెరియస్వామి, ఏవీ వేలు, వంటి ముఖ్యులకు, మాజీ స్పీకర్ ఆవుడయప్పన్కు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు పలువురికి మళ్లీ సీటు కేటాయించారు. దక్షిణాది జిల్లాల్లో, కొంగు మండలం, డెల్టా జిల్లాల్లో అత్యధికంగా కొత్త ముఖాలకు చోటు కల్పించారు. ఇక, 19 మంది మహిళలకు డీఎంకేలో సీటు కేటాయించడం విశేషం. సీఎం జయలలిత బరిలో ఉన్న ఆర్కే నగర్ నుంచి మహిళా అభ్యర్థిగా సిమ్లా ముత్తు చొళన్ ఎన్నికల్లో ఢీ కొట్టనున్నారు. కొన్ని స్థానాల్లో అభ్యర్థుల వివరాలు : చెన్నై చేపాక్కం - ట్రిప్లికేన్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అన్భళగన్ మళ్లీ రేసులో దిగారు. పొన్నేరి- కె పరిమలం, తిరువళ్లూరు - విజి రాజేంద్రన్, పూందమల్లి- పరంథామన్, ఆవడి - నాజర్, మాదవరం - ఎస్సుదర్శన్, విల్లివాక్కం - రంగనాధన్, ఎగ్మూర్ - కేఎస్ రవిచంద్రన్, సైదా పేట - ఎం సుబ్రమణ్యన్, హార్బర్ పీకే శేఖర్ బాబు, అన్నానగర్ - ఎంకే మోహన్, థౌజండ్ లైట్స్ - సెల్వం విరుగంబాక్కం ధన శేఖరన్, వేళచ్చేరి - సినీ నటుడు వాగై చంద్రశేఖరన్, తాంబరం -ఎస్ఆర్ రాజ, పల్లావరం - ఇ కరుణానిధి, కాట్పాడి - దురై మురుగన్, తిరుచెందూరు - అనితా రాధాకృష్ణన్, తిరుకోవిలూరు - పొన్ముడి, ఆత్తూరు - ఐ పెరియస్వామి, తిరుచ్చి పశ్చిమం కేఎన్ నెహ్రు, ఆలంకులం - పూంగోదై, పాళయం కోట్టై - మైదీన్ ఖాన్, తిరుచ్చూలి - తంగం తెన్నరసు, తిరువణ్ణామలై - ఏవి వేలు, నాగర్‌కోవిల్ సురేష్ రాజన్, కురింజి పాడి - ఎం ఆర్కే పన్నీరు సెల్వంలతో పాటుగా 173 మంది ఈ ఎన్నికల్లో డిఎంకే అభ్యర్థులుగా పోటీ చేయనున్నారు. అలాగే, గుమ్మిడిపూండి నియోజకవర్గాన్ని డీఎండీకే నుంచి బయటకు వచ్చిన ఎండిఎండికేకు కేటాయించారు. పుదుచ్చేరిలోనూ : తమిళనాటే కాదు, పుదుచ్చేరిలోనూ కాంగ్రెస్ , డిఎంకేలు కలసి కట్టుగా ఎన్నికల్ని ఎదుర్కొంటున్నాయి. కేంద్ర పాలిత ప్రాంతంలో కాంగ్రెస్‌కు బలం ఎక్కువ కావడంతో ఆ పార్టీకి ఎక్కువ స్థానాల్ని కేటాయించారు. ఇక్కడ కాంగ్రెస్ 21 స్థానాల్లోనూ, డిఎంకే 9 స్థానాల్లోనూ పోటీ చేయనున్నాయి. ఇందుకు తగ్గ ఒప్పంద పత్రాలపై డిఎంకే అధినేత ఎం కరుణానిధి, పుదుచ్చేరి కాంగ్రెస్ తరపున మాజీ కేంద్ర మంత్రి నారాయణ స్వామి తదితరులు సంతకాలు చేశారు. -
తమిళ టీడీపీలో అందరూ పెద్దలే
అధ్యక్షులుగా చలామణి అధికారిక ఇన్చార్జలు మౌనం అటకెక్కిన సభ్యత్వ నమోదు చెన్నై: ప్రాంతీయం నుంచి జాతీయత్వాన్ని వంట బట్టించుకునే ప్రయత్నంలో తమిళనాడులోని తెలుగుదేశం పార్టీ తప్పటడుగులు వేస్తోంది. పదవుల ముసుగు లో ప్రచారం కోసం పాకులాడే నేతలతో తప్పుటడుగులకు సైతం పాల్పడుతోంది. వెరసి తమిళ టీడీపీలో ‘ఎందరో పెద్దలు అందరికీ అధ్యక్ష పదవులే’ అన్న చందంగా మారి పోయింది. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో తొలి ప్రాంతీయ పార్టీగా ఆంధ్రప్రదేశ్‌లో ఆవిర్భవించిన తెలుగుదేశం తమిళనాడులోని తెలుగువారి ఆత్మగౌరవాన్ని కూడా కాపాడుతామంటూ ముందుకు వచ్చింది. జాతీయ పార్టీ గా విస్తరించేందుకు వీలుగా పొరుగున ఉన్న తమిళనాడు ను ఎంచుకుంది. తమిళనాడులో తమిళుల తరువాత తెలుగువారి శాతం అధికం కావడంతో సులువుగా వేళ్లూనుకోవచ్చని ఆశించింది. పార్టీలో నంబర్‌టూగా చలామణి అవుతున్న చంద్రబాబు తనయుడు లోకేష్ చెన్నై పెత్తనాన్ని చేతుల్లోకి తీసుకున్నారు. తమిళనాడు పార్టీ ఇన్చార్జ్గా బీదా మస్తాన్‌రావును నియమించారు. ఈ సమాచారం అందిందే తడవుగా చెన్నైలోని టీడీపీ అభిమానులు వెంటనే హైదరాబాద్ రెలైక్కాశారు. చినబాబు చుట్టూ చేరేశారు. ఆ తరువాత కొన్నాళ్లకు బీదా మస్తాన్‌రావు తదితర పార్టీ పెద్దలు చెన్నైలో సమావేశం నిర్వహించారు. హాజరైన అభిమానులను ఆశీర్వదించి త్వరలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా పార్టీ ఆదేశించారు. తిరుపతి ఎన్‌కౌంటర్‌తో తిరోగమనం: పార్టీ పెద్దలు ఇచ్చిన పెత్తనాన్ని అడ్డుపెట్టుకుని సభ్యత్వ నమోదుకు కొందరు సిద్ధమయ్యారు. చెన్నై పాండీబజార్‌లోని ఒక హోటల్లో సభ్యత్వ నమోదు ప్రారంభమని ప్రచారం చేశారు. తమిళనాడుకు చెందిన ఎర్రచందనం కూలీలపై తిరుపతి కొండ ల్లో కాల్పులు జరగడం, 20 మందిని హతమార్చడంతో టీ డీపీపై ఆగ్రహావేశాలు వ్యక్తమైనాయి. ఈ పరిణామంతో త మిళనాడుకు విస్తరించే ప్రయత్నాలు బెడిసికొట్టాయి. టీడీ పీ సమావేశం జరిగితే ముట్టడిస్తామనే రీతిలో కొందరు హెచ్చరించడంతో సభ్యత్వ నమోదు కార్యక్రమం అటకెక్కేసింది. అంతటితో టీడీపీ కార్యక్రమాలకు తెరపడింది. పార్టీనే లేని చోట పెత్తందార్లు: టీడీపీ అధిష్టానమే తమిళనాడులో పార్టీ కార్యక్రమాలను తాత్కాలికంగా పక్కనపెట్టిన పరిస్థితిలో ఇదే అదనుగా కొందరు పెత్తందార్లు పుట్టుకొచ్చారు. తమిళ టీడీపీ కార్యక్రమాలను తానే చూస్తున్నానని చెప్పుకుంటూ సుమారు ఐదు మంది చలామణిలో ఉన్నా రు. ఇదిలా ఉండగా, ఒక వ్యక్తి అందరికంటే మరో ముందడుగు వేసి తాను టీడీపీ తమిళనాడు శాఖ అధ్యక్షుడినని తనకు తాను ప్రకటించేసుకున్నాడు. తమిళనాడు ఎన్నికల్లో టీడీపీ ఎవరికి మద్దతు ఇవ్వాలో రెండురోజుల్లో తెలియజేస్తామని కూడా ఆయన ప్రకటించేశారు. పార్టీ అధ్యక్షుడిగా స్వేచ్చగా చలామణి అవుతుండగా ఇతర పెద్దలు ఖండించకుండా మనకెందుకు లెమ్మని మిన్నకుండిపోతున్నారు. లో కేష్ ప్రకటించిన ఇన్‌చార్జ్‌లు ముఖం చాటేయగా, ‘పిల్లి గు డ్డిదైతే ఎలుక ఏదో చేసింది’ అనే సామెతలా తమిళ టీడీపీ లో అందరూ పెద్దలుగా మారిపోయారు. తమిళనాడులో నెలకొన్న ఈ గందరగోళంపై మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీని సాక్షి ప్రశ్నించగా, ఏపీ, తెలంగాణ మినహా ఎక్కడా రాష్ట్ర అధ్యక్షులు లేరని, తమిళనాడు రాష్ట్ర అధ్యక్షునిగా చలామణి అవుతున్న సంగతిని చంద్రబాబు దృష్టికి తీసుకెళతానని చెప్పారు. -
డీఎంకే మేనిఫెస్టో
రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధం లక్ష్యంగా ప్రత్యేక చట్టాన్ని డీఎంకే సిద్ధమైంది. అవినీతి నిర్మూలన లక్ష్యంగా లోకాయుక్త ఏర్పాటుకు చర్యలు చేపట్టనున్నది. అన్నదాతకు, విద్యార్థులకు రుణమాఫీ, నేతన్నకు ఉచిత విద్యుత్, జాలర్లకు ఐదు లక్షల గృహాలు, వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ నినాదాలతో ప్రజాకర్షణ లక్ష్యంగా ఎన్నికల మేనిఫెస్టోను డీఎంకే అధినేత ఎం కరుణానిధి ఆదివారం ప్రకటించారు. * మద్యనిషేధానికి చట్టం * రాష్ట్రంలో లోకాయుక్త * రైతన్న, విద్యార్థుల రుణాల మాఫీ * వరి, చెరకుకు మద్దతు ధర * నేతన్నకు ఉచిత విద్యుత్ * మళ్లీ పెద్దల సభ , సేతు నినాదం * జాలర్లకు ఐదు లక్షల గృహాలు * డీఎంకే మేనిఫెస్టోతో కరుణ ఎన్నికల హామీ * పాల ధర తగ్గింపు, వృద్ధులకు ఉచిత పయనం సాక్షి, చెన్నై : అధికార పగ్గాలు చేపట్టాలన్న లక్ష్యంగా డీఎంకే అధినేత ఎం కరుణానిధి ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ఎన్నికల మేనిఫెస్టో తయారీకి ఈసారి ప్రత్యేక కమిటీని సైతం రంగంలోకి దించారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ఈ కమిటీ ప్రజాకర్షణ మేనిఫెస్టోను రూపొందించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు అన్ని వర్గాల్ని కలుపుకుని 72 పేజీలతో కూడిన మేనిఫెస్టోను సిద్ధం చేశారు. అన్నదాతకు, జాలర్లకు, నేతన్నకు, విద్యార్థి లోకానికి, నిరుద్యోగులకు, ఉద్యోగులకు, గ్రామీణ ప్రజలకు వరాల హామీ గుప్పిస్తూ రూపొందించిన ఈ మేనిఫెస్టోను అన్నా అరివాలయంలో డీఎంకే అధినేత ఎం కరుణానిధి విడుదల చేశారు. డీఎంకే దళపతి స్వాగోతపన్యాసం, మేనిఫెస్టో కమిటీలోని టీఆర్ బాలు, కనిమొళి, వీపీ దురైస్వామి, సుబ్బలక్ష్మి జగదీశన్, టీకేఎస్ఇళంగోవన్, ప్రొఫెసర్ రామస్వామి, ఆర్ షణ్ముగ సుందరం, ఎన్ఆర్ ఇలంగో, తంగం తెన్నరసులను సత్కరించినానంతరం ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. తొలిప్రతిని డీఎంకే ప్రధాన కార్యదర్శి అన్భళగన్ అందుకున్నారు. తదుపరి తన ప్రసంగంతో ఆ మేనిఫెస్టోలో ఉన్న ప్రధాన అంశాలను కరుణానిధి ప్రకటించారు. రాజకీయ నాయకుడిగా కాకుండా, ప్రతి కుటుంబంలో సభ్యుడిగా ఈ హామీలను ఇస్తున్నానని వివరించారు. ఇందులోని ప్రతి హామీ తప్పనిసరిగా అమలు చేసి తీరుతానని స్పష్టం చేశారు. ఇందులో ప్రధానంగా రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధం అమలు చేసి తీరుతామని, ఇందు కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామని తొలి హామీగా ప్రకటించారు. టాస్మాక్‌ను రద్దు చేసి,అందులోని కార్మికులకు ప్రత్యామ్నాయంగా ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించారు. రాష్ర్టంలో అవినీతి నిర్మూలన లక్ష్యంగా లోకాయుక్తాను తీసుకొస్తామని, ఇందుకు ప్రత్యేక చట్టం, సేవ హక్కు చట్టం తీసుకురావడం జరుగుతుందని ప్రకటించారు. అన్నదాతల సంక్షేమార్థం వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్ ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలోని కొన్ని : ⇒ చిన్న, సన్న కారు రైతుల రుణాలన్నీ మాఫీ ⇒ వరి క్వింటాల్‌కు రూ. 2,500 మద్దతు ధర, చెరకుకు రూ.3,500 ⇒ రైతన్నలకు తక్షణం కొత్త విద్యుత్ కనెక్షన్లు. ప్రతి ఏడాది రైతులకు సంక్రాంతి పంచె, చీరతో పాటు రూ.ఐదు వందల నగదు. ⇒ 100 రోజుల ఉపాధి పథక ం 150 రోజులకు పెంపు ⇒ నీటి పారుదలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ, వాటర్ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు ⇒ పది వేల కోట్లతో జల వనరుల అభివృద్ధి, రూ. రెండు వేల కోట్లతో చెక్ డ్యాంలు ⇒ చెన్నైలో వరద నివారణ మేనేజ్ మెంట్ బోర్డు ⇒ జాలర్లకు ఐదు లక్షల గృహాలు, జాతీయ జాలర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటుకు కేంద్రంపై ఒత్తిడి. షెడ్యూల్ ట్రైబ్ జాబితాలోకి జాలర్లు ⇒ కాంచీపురంలో పట్టు పార్కు, వేలూరులో లెదర్‌పార్క్. నేతన్నకు 250, 750 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ⇒ పది సంవత్సరాలుగా పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులు పర్మినెంట్ ⇒ ఆటోల కొనుగోలుకు రూ. పదివేల రుణాలు ⇒ పారిశుద్ధ్య కార్మికులకు వరద నివారణ సాయంగా రూ. ఐదు వేల నగదు ⇒ 75 లక్షల మందికి వృత్తి శిక్షణ ⇒ 25 ఏళ్లు విధి నిర్వహణలో ఉన్న ఉపాధ్యాయులు, ఉద్యోగులకు ప్రోత్సాహ భత్యం ⇒ లక్ష మంది పట్టభద్రులకు స్వయం ఉపాధి నిమిత్త రూ. లక్ష రుణ సాయం ⇒ మహిళ ఉద్యోగులకు తొమ్మిది నెలల ప్రసూతి సెలవు. ⇒ పాఠశాలల్లో విద్యార్థులకు అదనంగా పౌష్టికాహార నిమిత్తం పాల పంపిణీ ⇒ ఆవిన్ పాలు లీటరుకు రూ. ఏడు తగ్గింపు ⇒ గ్రానెట్, ఇసుక, దాతు ఇసుకల నిర్వహణ ప్రభుత్వ గుప్పెట్లోకి ⇒ విద్యార్థులకు రుణమాఫీ, పేద విద్యార్థులకు ఉన్నత విద్యా ఫీజులు ప్రభుత్వం భరిస్తుంది ⇒ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 54 వేల ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ ⇒ వృద్ధులకు రూ.1300 పింఛన్, 60 ఏళ్లు పైబడ్డ వారికి బస్సుల్లో ఉచిత పయనం ⇒ కుటుంబంలో పెద్ద వారికి పట్టభద్రుడికి ప్రభుత్వ ఉద్యోగం ⇒ మదురై -తూత్తుకుడి, చెన్నై - హొసూరు మధ్య పారిశ్రామిక క్యారిడార్ ⇒ రేషన్‌కార్డులు లేని వారికి పదిహేను రోజుల్లో స్మార్ట్ కార్డు ⇒ నెల పొడవునా రేషన్ వస్తువుల పంపిణీ ⇒ కారుణ్య ఉద్యోగాల నియామకం తక్షణం ⇒ అన్ని జిల్లాల్లో సంక్షేమ హాస్టళ్లు ⇒ వికలాంగుల సంక్షేమ బోర్డు ద్వారా ప్రత్యేక రాయితీల పెంపు ⇒ రోడ్డు సైడ్ వ్యాపారులు, మోత వ్యాపారులకు రూ. రెండు వేలు వడ్డీ లేని రుణం ⇒ కేంద్ర ఏడో వేతన కమిషన్ వలే, రాష్ట్రంలో ఎనిమిదో వేతన కమిషన్ ⇒ ప్రజా సంక్షేమ సిబ్బందికి కుటుంబ నిర్వహణకు ఐదు లక్షల వరకు రుణం ⇒ పేద యువతుల వివాహానికి రూ. 60 వేల సాయం, నాలుగు గ్రాముల బంగారం ⇒ కుమరి, మదురై, నెల్లైలో పరిశోధన కేంద్రాలు ⇒ మళ్లీ రాష్ర్టంలో శాసన మండలి పునరుద్ధరణ ⇒ అన్నా క్యాంటీన్లు, తాజాగా, తుంగలో తొక్కబడ్డ పథకాలన్నీ మళ్లీ పునరుద్ధరణ ⇒ గుడిసెల రహిత రాష్ట్రం లక్ష్యం. గ్రామాల్లో కాంక్రీట్ ఇళ్లకు రూ. మూడు లక్షల సబ్సిడీ ⇒ సముద్ర తీర జిల్లాల్లో నిర్లవరణీ కరణ పథకం ⇒ ప్రతి నియోజకవర్గంలో మూడు నెలలకు ఓ మారు ప్రజా ఫిర్యాదులు, వినతి పత్రాల స్వీకరణ కార్యక్రమాలు ⇒ జల్లికట్టు, మంజు వీరాట్, రెక్లాల అనుమతికి చర్యలు ⇒ కుడంకులం అణు ఉద్యమ కారులపై కేసులన్నీ ఎత్తివేత ⇒ చెన్నై మెట్రో రైలు శ్రీ పెరంబదూరు వరకు విస్తరణ, తిరుచ్చి మదురై, కోయంబత్తూరులో మెట్రో రైలు సేవలు ⇒ సేవా హక్కు చట్టం ⇒ మళ్లీ సేతు సముద్రం ప్రాజెక్ట్ ⇒ నమ్మాళ్వార్ కృత్రిమ వ్యవసాయ కేంద్రం -
వరాల మూట విప్పిన కరుణానిధి
చెన్నై: డీఎంకే అధినేత కరుణానిధి ఆదివారం తమిళనాడు ప్రజలకోసం ఎన్నికల వరాల మూట విప్పారు. డీఎంకే పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో ప్రకటించారు. ప్రొహిబిషన్ చట్టం అమలు, లోకాయుక్త ఏర్పాటు, ప్రత్యేక నీటి పారుదల శాఖవంటి ఎన్నో వరాలు ప్రకటించారు. అంతేకాదు వరద నీటి సమస్యను పర్యవేక్షించడానికి ప్రత్యేక మంత్రి అవసరం అని కూడా మ్యానిఫెస్టో విడుదల సందర్భంగా చెప్పారు. ఇంకా ఆయన మ్యానిఫెస్టోలో చెప్పిన విషయాలు ఏమిటంటే.. ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ టీఏఎస్ఎంఏసీ ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగాల కల్పన విద్యార్థులకు ఉచిత నెట్ నమాజ వార్ పథకం ద్వారా ఆర్గానిక్ ఉత్పత్తులు తయారుచేయడంలో శిక్షణ సేతు సముద్రం కెనాల్ ప్రాజెక్టు ప్రారంభం రైతులకు కనీస మద్దతు ధర ప్రొహిబిషన్ చట్టం అమలు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా తమిళం అధికారిక భాషగా ప్రవేశపెట్టడం ప్రసూతి సెలవులు 9 నెలలకు పెంపు లోకాయుక్త ఏర్పాటు కొత్త పారిశ్రామిక వేత్తలకు రూ.లక్ష పెట్టుబడి అన్ని జిల్లాల్లో ఉపాధి కేంద్రాలు 750 చేనేత యూనిట్లకు ఉచిత విద్యుత్ రేషన్ కార్డు లేనివారికి పదిహేను రోజుల్లో స్మార్డ్ కార్డు అన్న ఉనావగమ్ ప్రారంభం ప్రత్యేక నీటి పారుదల శాఖ వరదల నివారణకు 200 ప్రత్యేక చెక్ డ్యాములు మధ్యాహ్న భోజనంలో ఉచిత పాల పథకం అన్ని రకాల పరువునష్టం కేసులు వెనక్కి కుడాంకుళం ప్రాజెక్టుకు సంబంధించి పెట్టిన కేసులన్నీ రద్దు శాసన మండలి ఏర్పాటు విద్యార్థులకు ఎడ్యుకేషన్ లోన్ పాఠశాలల్లో అన్ని ఖాళీల భర్తీ నెలకు 20 కేజీల ఉచిత బియ్యం ప్రతి జిల్లాలో కొత్త మెడికల్ కాలేజీ ఏర్పాటు నాలుగో పోలీసు కమిషన్ ఏర్పాటు స్వచ్ఛ తమిళనాడుగా మార్పు జల్లికట్టు కొనసాగింపునకు కృషి పేదల గృహనిర్మాణాలకు రూ.3లక్షల సబ్సిడీ సబ్సిడీ ధరల్లో మొబైల్ ఫోన్లు -
జయలలితతో శరత్ కుమార్ భేటీ
చెన్నై : తమిళనాడులో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళనాట రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సమథువా మక్కల్ కచ్చి పార్టీ అధినేత, నటుడు శరత్ కుమార్ బుధవారం తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలితతో భేటీ అయ్యారు. పోయిస్ గార్డెన్లో సీఎం నివాసంలో వీరి భేటీ జరిగింది. సమావేశం అనంతరం శరత్ కుమార్ మాట్లాడుతూ అన్నాడీఎంకే కూటమికి తమ మద్దతు కొనసాగిస్తామని తెలిపారు. కాగా ఆయన ఈ ఏడాది ఫిబ్రవరిలో జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే కూటమికి గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. అయితే తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో శరత్ కుమార్ మళ్లీ అన్నాడీఎంకే కూటమికి చేరువయ్యారు. మరోవైపు నిన్న మొన్నటివరకూ పొత్తులపై ఉత్కంఠకు తెరలేపిన డీఎండీకే అధినేత విజయకాంత్ డీఎంకే, బీజేపీలకు ఝలక్ ఇచ్చారు. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వమే లక్ష్యంగా పావులు కదిపిన కెప్టెన్ ఇవాళ పీడబ్ల్యూఎఫ్, ఎండీఎంకే, వీసీకే, సీపీఎం, సీపీఐలతో పొత్తు కుదుర్చుకున్నారు. కెప్టెన్ చర్యకు డీఎంకేతో పాటు బీజేపీకి షాక్ తగిలినట్లు అయింది. పదేళ్ల క్రితం 2005లో పార్టీని స్థాపించిన విజయకాంత్...తొలిసారిగా ఎదుర్కొన్న ఎన్నికల్లో ఆయన మినహా అందరూ ఓడిపోయారు. డీఎండీకే ఏకైక ఎమ్మెల్యేగా కొనసాగారు. 2011 ఎన్నికల్లో అతిపెద్ద రెండవపార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. -
అమ్మ మార్కు రాజకీయం
ముఠా తగాదాల ప్రచారాలకు చెక్ అభ్యర్థుల కోసం స్వయంగా ఇంటర్వ్యూలు వంద మందితో త్వరలో తొలి జాబితా అన్నాడీఎంకేలో ముఠా తగాదాలు మిన్నంటాయనే ప్రచారాలకు పార్టీ అధినేత్రి జయలలిత చెక్ పెట్టడం ప్రారంభించారు. ఎన్నికల్లో పోటీకి అభ్యర్థుల ఎంపికలో వేగం పెంచడం ద్వారా అమ్మ మార్కు రాజకీయానికి తెరలేపారు. చెన్నై: ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే అంటే జనవరి 20వ తేదీ నుంచి అన్నాడీఎంకేలో ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. తాము ఆశిస్తున్న నియోజకవర్గాలను పేర్కొంటూ దరఖాస్తు చేసుకోవాల్సిందిగా పార్టీ అధినేత్రి జయలలిత స్వయంగా ప్రకటించారు. అధికార పార్టీ కావడంతో అన్నాడీఎంకే కేంద్ర కార్యాలయం వద్ద కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఎగిసిపడ్డారు. తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు 17,698 మంది దరఖాస్తులు సమర్పించారు. ఇవిగాక జయలలిత తమ నియోజకవర్గం నుండి పోటీచేయాలని కోరుతూ 7,936 దరఖాస్తులు అందాయి. అయితే గత ఏడాది 4వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తరువాత నుండి పార్టీ కార్యకలాపాల్లో వెనుకబాటుతనం మొదలైంది. అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికపై ఇంటర్వ్యూలు ప్రారంభించగా అన్నాడీఎంకేలో మంత్రులపై వేటు, కార్యకర్తల తొలగింపు, ఎన్నికల్లో పార్టీ టిక్కెట్లు అమ్ముకుంటున్నాడని, కుమారుల పెత్తనం అంటూ మంత్రి పన్నీర్‌సెల్వం చుట్టూ వివాదాలు ముసురుకున్నాయి. ఎన్నికల వేళ ప్రతిపక్షాలకు అన్నాడీఎంకేలోని ఈ పరిస్థితులు ఆయాచిత వరంగా మారాయి. ఈ దశలో జయలలిత ఏదో మొక్కుబడిగా ఐదుగురిని పోయెస్ గార్డెన్‌కు పిలిపించుకుని ఇంటర్వ్యూలను చేశారు. దీంతో ఆశావహులంతా టిక్కెట్ల కోసం పలువురు మంత్రులను ఆశ్రయించడం ప్రారంభించారు. టిక్కెట్ల కేటాయింపు పేరుతో కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయని మరో ప్రచారం ఊపందుకుంది. ఇదే ఆరోపణలపై ఐదుగురు అరెస్ట్ కావడంతో ప్రతిపక్షాల ప్రచారానికి బలం చేకూరింది. రంగంలోకి దిగిన అమ్మ ఎన్నికల వేళ అప్రతిష్టపాలైతే దాని ప్రభావం ఫలితాలపై ఉంటుందని అప్రమత్తమైన అమ్మ సోమవారం నేరుగా రంగంలోకి దిగారు. ఇంటెలిజెన్స్ నుంచి నివేదికను తెప్పించుకుని ఇంటర్వ్యూలను ప్రారంభించారు. తిరునెల్వేలి, తూత్తుకూడి, కన్యాకుమారి, వేలూరు తదితర 25 నియోజకవర్గాలకు పోటీచేయగోరు అభ్యర్థులు రావాల్సిందిగా పార్టీ కార్యాలయం ఆదివారం కబురు పంపింది. సుమారు 50 మంది ఆశావహులు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు అమ్మ వద్దకు చేరుకున్నారు. 1.30 గంటల నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభమైనాయి. నియోజకవర్గానికి ఇద్దరు చొప్పున నిర్ణయించి ఒకరు అభ్యర్థి, మరొకరు అభ్యర్థి గెలుపు కోసం పాటుపడాలని అమ్మ ఆదేశించినట్లు తెలుస్తోంది. టిక్కెట్టు లభించలేదని స్వంత పార్టీ అభ్యర్థినే ఓడించేందుకు ప్రయత్నిస్తే పార్టీ పరంగా తీవ్రపరిణామాలు తప్పవని అమ్మ హెచ్చరించినట్లు సమాచారం. అలాగే మంగళవారం నాడు శివగంగై, రామనాథపురం, మధురై, విరుదునగర్, దిండుగల్లు... ఈ ఐదు జిల్లాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈ నెల 23వ తేదీన మిత్రపక్ష పార్టీలకు టిక్కెట్లు ఖరారు చేసి తొలి జాబితాల్లో వంద స్థానాలకు అభ్యర్థుల పేర్లు ప్రకటించవచ్చని తెలుస్తోంది. -
కలవని కమలం
ఒంటరి పోరుకు సిద్ధం పీఎంకే తిరస్కృతి 234 మంది అభ్యర్థులతో ఢిల్లీలో జాబితా ఒంటరి పయనం సాగించేందుకు కమలం సిద్ధమైంది. పీఎంకే సైతం తమ ఆహ్వానాన్ని తిరస్కరించడంతో తదుపరి కసరత్తుల్లో కమలనాథులు మునిగారు. 234 స్థానాలకు అభ్యర్థుల్ని ఎంపిక చేసి ఢిల్లీ పెద్దల ముందు ఉంచారు. చెన్నై : కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలో ఉన్నా, వారి పాచికలు తమిళనాట పారడం లేదు. లోక్ సభ ఎన్నికల్లో తమ చుట్టూ తిరిగిన పార్టీల కోసం, ప్రస్తుతం బీజేపీ పడిగాపులు కాయాల్సిన పరిస్థితి. వారి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం శూన్యం. ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీ బీజేపీని తిరస్కరించడంతో ఆ పార్టీ కేడర్ అయోమయంలో పడ్డారని చెప్పవచ్చు. చివరి ప్రయత్నంగా డీఎండీకే అధినేత గాలం వేసినా ఫలితం శూన్యం. ఇక, పీఎంకేను దారిలోకి తెచ్చుకునేందుకు తీవ్రంగానే కలవని కమలం కుస్తీలు పట్టారు. ఓ దశలో బీజేపీ వైపుగా తలొగ్గినట్టు కన్పించిన పీఎంకే అధినేత రాందాసు ఓ మీడియాతో మాట్లాడుతూ ఎవరితోనూ పొత్తు లేదని స్పష్టం చేశారు. ఇక అన్నాడీఎంకే, డీఎంకేలతో ఎట్టి పరిస్థితుల్లోనూ కలవబోమంటూనే, బీజేపీ మీద సానుకూలత వ్యక్తం చేసే వ్యాఖ్యలు సంధించినా, వారితో కలసి ముందుకు సాగడం ఇష్టం లేదని స్పష్టం చేయడం కమలనాథులకు షాక్ ఇచ్చినట్టు అయింది. పీఎంకే కలిసి వస్తుందనుకుంటే, వాళ్లు తమకు ఇష్టం లేదని స్పష్టం చేయడంతో ఇక, ఒంటరిగా ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు తగ్గ ప్రయత్నాల్ని కమలం పెద్దలు వేగవంతం చేశారు. ఇప్పటికే 234 స్థానాలకు గాను అభ్యర్థుల్ని సిద్ధం చేసి ఢిల్లీకి పంపించిన పార్టీ వర్గాలు, ఇక జా బితాకు ఆమోద ముద్ర పడగానే, ఎన్నికల పనుల్ని వేగవంతం చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఢిల్లీలో జరుగుతున్న పార్టీ సమావేశాల్లో తమిళనాడు ఎన్నికల వ్యవహారాలపై నాయకులతో జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సమాలోచించి ఉన్నారు. పార్టీలు కలిసి రాని పక్షంలో మద్దతు ఇచ్చిన సంఘాలు, చిన్న చితక పార్టీలతో కలసి ఒంటరిగానే ఎన్నికల్ని ఎదుర్కొందామన్న సంకేతాన్ని అమిత్ షా ఇచ్చి ఉండటంతో పార్టీ వర్గాలు అందుకు తగ్గ కార్యాచరణతో ముందుకు సాగేందుకు సిద్ధమవుతున్నారు. అన్ని స్థానాలకు అభ్యర్థులను బరిలో నిలబెడదామని కలసి వచ్చే వారికి బీజేపీ చిహ్నం మీదే పోటీకి సీట్లు ఇస్తామన్న సూచనను చిన్న చితక పార్టీలు, సంఘాలకు అమిత్ షా సంకేతాన్ని పంపుతూ నిర్ణయం తీసుకున్నట్టుగా కమలనాథులు పేర్కొంటుండడం గమనార్హం. చెన్నైకు రెండు మూడు రోజుల్లో రానున్న పార్టీ ఎన్నికల ఇన్చార్జ్ ప్రకాష్ జవదేకర్ ఒంటరి నినాదంతో పాటుగా అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారని చెబుతున్నారు. -
సీఎం పదవి ఇస్తేనే కూటమికి సై!
చెన్నై: కొలిక్కిరాని కూటమి కోసం భారతీయ జనతా పార్టీ రాయబారం ప్రారంభించినా అంతగా కలిసొచ్చినట్లుగా లేదు. తమిళపార్టీలతో రాజకీయ మంతనాలు సాగించేందుకు శనివారం చెన్నై చేరుకున్న కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ డీఎండీకే నేతలతో చర్చలు జరుపుతున్నారు. డీఎండీకే అధ్యక్షులు విజయకాంత్, పీఎంకే యువజన విభాగం అధ్యక్షులు అన్బుమణి రాందాస్ తో చర్చలు మొదలుపెట్టారు. విజయ్ కాంత్ మాత్రం కూటమి వైపు మొగ్గుచూపి, తనకు సీఎం పదవి ఇస్తేనే ఇందుకు సమ్మతిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్‌కు కౌంట్‌డౌన్ మొదలైనట్లుగా అన్ని పార్టీలు భావిస్తున్నాయి. దక్షిణాదిలో బలం పుంజుకోవావలని ఆశిస్తున్న బీజేపీ అధినాయకత్వం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలతో తమ బలం ఏమిటో నిరూపించుకోవాలనే పట్టుదలతో ఉంది. డీఎండీకే నేత నేతృత్వంలోనే కూటమి ఏర్పడాలి, తనను సీఎం అభ్యర్దిగా ప్రకటించాలని విజయకాంత్ బీజేపీకి షరతులు విధించారు. ఇందుకు అంగీకరిస్తేనే బీజేపీతో చర్చలని విజయకాంత్ భీష్మించకుని ఉన్నారు. కెప్టెన్ వైఖరితో రెండు పార్టీల మధ్య అగాధం ఏర్పడింది. ఈ పరిస్థితిని చక్కదిద్ది కూటమిని కొలిక్కి తేచ్చేందుకు జవదేకర్ రంగంలోకి దిగానా విజయ్ కాంత్ తన నిర్ణయంలో మార్పులేదని చెప్పినట్లు తెలుస్తోంది. -
మళ్లీ చేతులు కలిపిన డీఎంకే, కాంగ్రెస్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కలసి పోటీ చేయనున్నట్టు వెల్లడి సాక్షి, చెన్నై: మూడేళ్ల తరువాత కాంగ్రెస్, డీఎంకే పార్టీలు మళ్లీ చేతులు కలిపాయి. తమిళనాడు అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో కలసి పోటీ చేయాలని నిర్ణయించాయి. డీఎంకే అధినేత కరుణానిధితో కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ శనివారమిక్కడ సమావేశమయ్యారు. పొత్తు పునరుద్ధరణపై చర్చించారు. కరుణ నివాసంలో జరిగిన ఈ భేటీలో తమిళనాడు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి ముకుల్ వాస్నిక్, టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇలంగోవన్ కూడా పాల్గొన్నారు. అనంతరం ఆజాద్ విలేకరులతో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేతో కలసి పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. డీఎంకే సారథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమని, అది నెరవేరుతుందని చెప్పారు. డీఎంకే తమకు నమ్మకమైన మిత్రపక్షమన్నారు. కాంగ్రెస్, డీఎంకేలతోపాటు మరికొన్ని ఇతర పార్టీలూ సంకీర్ణంలో చేరినట్లయితే బలీయమైన శక్తిగా మారుతుందని పేర్కొన్నారు. డీఎంకేతో పొత్తుకు బీజేపీ కూడా యత్నించి, కరుణ, బీజేపీ ఛీఫ్ అమిత్ షాల భేటీకి ఏర్పాటు జరిగిన నేపథ్యంలో కాంగ్రెస్ ఆజాద్‌ను పంపి పొత్తును ఖరారు చేసుకుంది. గతంలో యూపీఏ ప్రభుత్వాల్లో తొమ్మిదేళ్లపాటు డీఎంకే భాగస్వామిగా ఉంది. అయితే శ్రీలంక తమిళుల అంశం విషయంలో కాంగ్రెస్ వైఖరిని నిందిస్తూ 2013లో యూపీఏ నుంచి వైదొలగడమేగాక కాంగ్రెస్‌తో బంధాన్ని సైతం తెంచుకుంది.