నాకు ఏమైనా అయితేనే అతడు సీఎం! | I will be CM if DMK wins assembly polls, says Karunanidhi | Sakshi
Sakshi News home page

నాకు ఏమైనా అయితేనే అతడు సీఎం!

Published Tue, May 10 2016 6:39 PM | Last Updated on Sun, Sep 3 2017 11:48 PM

నాకు ఏమైనా అయితేనే అతడు సీఎం!

నాకు ఏమైనా అయితేనే అతడు సీఎం!

త్వరలో రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే గెలిస్తే తానే ముఖ్యమంత్రి అవుతానని ఆ పార్టీ అధ్యక్షుడు కరుణానిధి మరోసారి స్పష్టం చేశారు. తనకు ఏమైనా అయ్యేవరకు తన కొడుకు ఎంకే స్టాలిన్ వేచి ఉండాల్సిందేనని చెప్పారు. స్టాలిన్‌కు కూడా ముఖ్యమంత్రి అవ్వాలని లేదని, తాను 1957 నుంచి ఇప్పటివరకు ఒక్క ఎన్నికలోనూ ఓడిపోలేదని అన్నారు. ఈసారి తమ పార్టీ గెలిస్తే తాను ఆరోసారి సీఎం అవుతానని చెప్పారు. తాను ముఖ్యమంత్రి కావాలని కోరుకునేవాళ్లలో పార్టీ కోశాధికారి స్టాలిన్ మొదటివాడని తెలిపారు.

పార్టీలో కొంతమంది స్టాలిన్ సీఎం కావాలని కోరుకుంటున్నారు కదా అన్న ప్రశ్నకు.. ప్రకృతి తనను ఏమైనా చేస్తేనే అతడికి అవకాశం వస్తుందని కరుణ సమాధానం ఇచ్చారు. ఇంతకుముందు డీఎంకే ప్రభుత్వం ఉన్నప్పుడు స్టాలిన్ ఉప ముఖ్యమంత్రిగా ఉండేవారు. కాగా, ఒకప్పుడు పార్టీలో ఉండే స్టాలిన్ అన్న ఎంకే అళగిరి కూడా ముఖ్యమంత్రి పదవి కోసం గట్టిగానే పోటీపడ్డారు గానీ, తర్వాతి కాలంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేపడుతున్నారన్న ఆరోపణలతో అతడిని బహిష్కరించారు. దాంతో ఇప్పుడు కరుణ రాజకీయ వారసుడిగా స్టాలిన్ ఒక్కరే మిగిలారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement