బృందా గానం! | brinda karat election campaign in tamilnadu | Sakshi
Sakshi News home page

బృందా గానం!

Published Sat, May 7 2016 3:05 PM | Last Updated on Mon, Aug 13 2018 8:10 PM

brinda karat election campaign in tamilnadu

చెన్నై :‘ సెంట్రల్‌లో మోదీ...స్టేట్‌లో లేడీ ’ అంటూ  సీపీఎం జాతీయ నాయకురాలు బృందా కారత్ కొత్త పల్లవితో అందరి చేత చప్ప ట్లు కొట్టించే పనిలో పడ్డారు. అయితే, ఆ మోదీ, ఈ లేడి పుణ్యమా ప్రజలు కష్టాల కడలిలో మునగాల్సి వచ్చిందని శివాలెత్తుతున్నారు.

ఎన్నికల బరిలో ఉన్న జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా వారి వారి అధినేతలు ప్రచారబాటలో ఉన్న విషయం తెలిసిందే. ఇక, తాము సైతం అంటూ సీపీఎం, సీపీఐ అభ్యర్థులకు మద్దతుగా ఆ పార్టీల జాతీయ నాయకులు తమిళనాడు బాటకు సిద్ధం అయ్యారటా..!. ఇందులో భాగంగా తంజావూరు, తిరుచ్చి, మదురైలలో బృందాకారత్ ప్రచారంలో దూసుకెళుతున్నారు. తమ అభ్యర్థులకు అండగా నిలవాలని పిలుపునిస్తూ, కేంద్రంలోని మోదీ సర్కారు, రాష్ట్రంలోని లేడీ సర్కారు అంటూ కొత్త పల్లవితో సెటైర్లు విసిరే పనిలో పడ్డారు.


 తన దైన శైలిలో మోదీ...లేడీ అంటూ ఆమె సంధిస్తున్న వ్యాఖ్యలకు జనం నుంచి చప్పట్లు దరువెత్తుతున్నాయట. దీంతో మరింత ఉత్సాహాన్ని నింపే విధంగా అమ్మకు అన్నీ తెలుసూ అంటూ, అందుకే తాగు నీళ్లకు బదులుగా మద్యం ఏరులై పారిచ్చేస్తున్నారు. బిడ్డల జీవితాల్ని పిప్పి చేసేస్తున్నారంటూ చలోక్తులు విసురుతున్నారు. అయితే,  కేవలం సీపీఎం అభ్యర్థులకు మద్దతుగా ఆమె ప్రసంగాలు సాగుతుండడంతో, ఇక తమను ఆదరించరా..? అన్నట్టు ప్రజా సంక్షేమ కూటమిలోని ఇతర పార్టీల అభ్యర్థులు ఎదురు చూస్తున్నారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement