
తిరువనంతపురం: కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌పై సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కారత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.కావాలంటే ఖాన్ త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేయాలని సూచించారు.
‘గౌరవ గవర్నర్‌కు ఒకవేళ రాజకీయాలంటే ఆసక్తి ఉంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన పోటీ చేయాలి. పోటీచేసి రాజకీయాల్లో తన సత్తా ఏంటో నిరూపించుకోవాలి. బీజేపీ టికెట్ తీసుకుని కేరళలోని ఏ స్థానం నుంచి అయినా ఆయన పోటీ చేయొచ్చు. పాలకు పాలు, నీళ్లకు నీళ్లు తేలిపోతాయి. గవర్నర్ రోజూ పబ్లిక్ స్టేట్‌మెంట్‌లు ఇచ్చే బదులు సీఎంతో ఉన్న విభేదాలను పరిష్కరించుకుంటే మంచిది’అని బృందా కారత్ సూచించారు.
కేరళ ప్రభుత్వం పంపిన యూనివర్సిటీ బిల్లులపై సంతకాలు చేయకుండా గవర్నర్ పెండింగ్‌లో పెట్టారు. దీంతో గవర్నర్‌కు ప్రభుత్వానికి మధ్య సంబంధాలు చెడిపోయాయి. యూనివర్సిటీ బిల్లులు మనీ బిల్లులయినందున గవర్నర్ ఆమోదం లేకుండా వాటిని అసెంబ్లీలో ప్రవేశపెట్టడం కుదరదు. దీంతో ఆ బిల్లులపై ప్రభుత్వం ముందడుగు వేయలేకపోతోంది. గవర్నర్‌కు ఈ బిల్లులపై డైరెక్షన్స్