వరాల మూట విప్పిన కరుణానిధి
చెన్నై: డీఎంకే అధినేత కరుణానిధి ఆదివారం తమిళనాడు ప్రజలకోసం ఎన్నికల వరాల మూట విప్పారు. డీఎంకే పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో ప్రకటించారు. ప్రొహిబిషన్ చట్టం అమలు, లోకాయుక్త ఏర్పాటు, ప్రత్యేక నీటి పారుదల శాఖవంటి ఎన్నో వరాలు ప్రకటించారు. అంతేకాదు వరద నీటి సమస్యను పర్యవేక్షించడానికి ప్రత్యేక మంత్రి అవసరం అని కూడా మ్యానిఫెస్టో విడుదల సందర్భంగా చెప్పారు. ఇంకా ఆయన మ్యానిఫెస్టోలో చెప్పిన విషయాలు ఏమిటంటే..
- ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్
- టీఏఎస్ఎంఏసీ ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగాల కల్పన
- విద్యార్థులకు ఉచిత నెట్
- నమాజ వార్ పథకం ద్వారా ఆర్గానిక్ ఉత్పత్తులు తయారుచేయడంలో శిక్షణ
- సేతు సముద్రం కెనాల్ ప్రాజెక్టు ప్రారంభం
- రైతులకు కనీస మద్దతు ధర
- ప్రొహిబిషన్ చట్టం అమలు
- కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా తమిళం అధికారిక భాషగా ప్రవేశపెట్టడం
- ప్రసూతి సెలవులు 9 నెలలకు పెంపు
- లోకాయుక్త ఏర్పాటు
- కొత్త పారిశ్రామిక వేత్తలకు రూ.లక్ష పెట్టుబడి
- అన్ని జిల్లాల్లో ఉపాధి కేంద్రాలు
- 750 చేనేత యూనిట్లకు ఉచిత విద్యుత్
- రేషన్ కార్డు లేనివారికి పదిహేను రోజుల్లో స్మార్డ్ కార్డు
- అన్న ఉనావగమ్ ప్రారంభం
- ప్రత్యేక నీటి పారుదల శాఖ
- వరదల నివారణకు 200 ప్రత్యేక చెక్ డ్యాములు
- మధ్యాహ్న భోజనంలో ఉచిత పాల పథకం
- అన్ని రకాల పరువునష్టం కేసులు వెనక్కి
- కుడాంకుళం ప్రాజెక్టుకు సంబంధించి పెట్టిన కేసులన్నీ రద్దు
- శాసన మండలి ఏర్పాటు
- విద్యార్థులకు ఎడ్యుకేషన్ లోన్
- పాఠశాలల్లో అన్ని ఖాళీల భర్తీ
- నెలకు 20 కేజీల ఉచిత బియ్యం
- ప్రతి జిల్లాలో కొత్త మెడికల్ కాలేజీ ఏర్పాటు
- నాలుగో పోలీసు కమిషన్ ఏర్పాటు
- స్వచ్ఛ తమిళనాడుగా మార్పు
- జల్లికట్టు కొనసాగింపునకు కృషి
- పేదల గృహనిర్మాణాలకు రూ.3లక్షల సబ్సిడీ
- సబ్సిడీ ధరల్లో మొబైల్ ఫోన్లు