ఒట్టేసి చెబుతున్నా.. | NO bribe take in elections | Sakshi
Sakshi News home page

ఒట్టేసి చెబుతున్నా..

Published Sun, May 8 2016 8:19 AM | Last Updated on Sun, Sep 3 2017 11:41 PM

ఒట్టేసి చెబుతున్నా..

ఒట్టేసి చెబుతున్నా..

ఓటుకు నోటు నో..నో
10న కోటి మందితో ప్రతిజ్ఞ
 
చెన్నై: ఓటు హక్కు అనే మాటకు అర్థం మారి పోయి ఓటుకు నోటు హక్కు అనే మనస్తత్వాల్లో మార్పు తెచ్చేం దుకు ఎన్నికల కమిషన్ సిద్ధమైంది. అవును ఒట్టేసిచెబుతున్నా..‘ఓటుకు నోటు తీసుకోను, ఇవ్వను’ అని ఈనెల 10వ తేదీన కోటి మందితో ప్రమాణం చేయిస్తోంది.
 
ఓటు వేసేందుకు డబ్బు పుచ్చుకోవడం, ఇచ్చుకోవడం కూ డా నేరమే. ఈ నేరాలకు పాల్పడిన వారిని అరెస్ట్ చేసి తగిన చర్యలు తీసుకుంటామని, నేర తీవ్రతను బట్టి ఏడాది జైలు శిక్ష కూడా తప్పదని ఈసీ ఇప్పటికే అనేకసార్లు హెచ్చరించింది. అయినా రాష్ట్రంలో విచ్చలవిడిగా నగదు పంచే ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. కోట్లాది రూపాయలను అధికారులు స్వాధీనం చేసుకుంటూనే ఉన్నారు.
 
గతంలో జరిగిన అనేక ఎన్నికల్లో నోట్లు పంచడమే కాదు, నగదు అందని ఓటర్లు ఆయా పార్టీల అభ్యర్థుల వద్దకు వెళ్లి డిమాండ్ చేసిన సంద ర్భాలు ఉ న్నాయి. ఓటుకు నోటు లేదా, పంచెలు, చీరలు, మద్యం బాటి ళ్లు, బిరియానీ పొట్లాలు పంచడం నేతలు అలవాటుగా మార్చుకున్నారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం రాష్ట్రంలో పంచముఖ పోటీ నెలకొని ఉంది. పార్టీల నేతలు, అభ్యర్థులంతా అధికారంలోకి వచ్చేది నువ్వా నేనా అని సవాళ్లు విసురుకుంటున్న దశలో ఎన్నికల నిర్వహణ కఠినతరమైంది. ఎ న్నికల్లో అన్ని ఏర్పాట్ల కంటే నగదు పంపిణీ కాకుండా చేయడం ఈసీకి సవాలుగా మారింది. నగదు చలామణికి అడ్డుకట్ట వేసేందుకు ఎన్నడూ లేని విధంగా ఆదాయపు పన్నుశాఖ అధికారులను సైతం రంగంలోకి దించింది.
 
 ఈ పరిస్థితిలో ఓటర్లు, నేతల్లో మార్పు తెచ్చేందుకు కొత్త విధానాన్ని ప్రవేశపెట్టినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి రాజేష్ లఖానీ తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ ఈనెల 10వ తేదీన ఉదయం 10 గంటలకు ప్రజలు, వివిధ పార్టీల నేత ల చేత ఓటు వేసేందుకు నోటు తీసుకోం, ఇవ్వం అంటూ ప్రతి జ్ఞ చేయిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోని 66 పోలింగ్ బూతుల వద్ద సుమారు కోటి మందితో ఈ ప్రతిజ్ఞ చే యించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. క నీసం 50 వేల మందైనా వస్తారని ఆశిస్తున్నామని అన్నారు.

అలాగే పంచాయతీ కార్యాలయాల్లో, ప్రభుత్వ కార్యాలయాలు, ఎ న్నికల కార్యాలయాల్లో సైతం సిబ్బం ది చేత ప్రతిజ్ఞలు చేయిస్తున్నామని తె లిపారు. పార్టీల నేతలు తమ ప్రచా రం ప్రారంభించేటప్పుడు ప్రతిజ్ఞ చే యవచ్చని అన్నారు. రోటరీ, లయన్స్‌క్లబ్బులు, ఎన్‌జీవో సంఘాలు, నివాసగృహాల అసోసియేషన్లు, గుడిసెవాసులు సైతం ప్రతిజ్ఞలో పాల్గొనేలా చూడాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశించామని అన్నారు. ఒట్టు తీసి చెరువు గట్టుమీద పెట్టకుండా కనీసం ప్రతిజ్ఞ చేసినవారైనా కట్టుబడి ఉంటారని ఆశిద్దాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement