మదురై : ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు వేర్వేరు ప్రాంతాల్లో జరిపిన వాహన తనిఖీల్లో కోటి రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. దిండుగల్‌లో సహాయ వాణిజ్య పన్నుశాఖ అధికారి దీనదయాళన్ ఆధ్వర్యంలో ఫ్లయింగ్ స్క్వాడ్ హెడ్‌పోస్టాఫీసు వద్ద జరిపిన వాహన తనిఖీల్లో సరైన ఆధారాలు లేకుండా వాహనంలో తీసుకెళుతున్న 83 లక్షలు విలువ చేసే నోట్ల కట్టలతో ఉన్న సూట్‌కేసు డ్రైవర్ వద్ద కనిపించింది. ఆ సొమ్మును దిండుకల్ ఎన్నికల కార్యాలయానికి తీసుకెళ్లి సరి చూశారు. ఎన్నికల్లో ఓటర్లకు ఇవ్వడానికి తీసుకెళుతున్నారా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
మదురైలో: మదురై జిల్లా ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ నాట్రా మంగళంలో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు వాహన తనిఖీలు జరిపారు. ఆ సమయంలో సరైన ఆధారాలు లేకుండా కారు లో తీసుకెళుతున్న 31 లక్షలను స్వాధీనం చేసుకుని ట్రెజరీకి పంపారు. ఆ సొమ్మును జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ కె.వీరరాఘవరావు పరిశీలించి వాటిని ట్రెజరీలో ఉంచారు.