Rs. one crore
-
తనిఖీల్లో రూ. కోటి స్వాధీనం
మదురై : ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు వేర్వేరు ప్రాంతాల్లో జరిపిన వాహన తనిఖీల్లో కోటి రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. దిండుగల్‌లో సహాయ వాణిజ్య పన్నుశాఖ అధికారి దీనదయాళన్ ఆధ్వర్యంలో ఫ్లయింగ్ స్క్వాడ్ హెడ్‌పోస్టాఫీసు వద్ద జరిపిన వాహన తనిఖీల్లో సరైన ఆధారాలు లేకుండా వాహనంలో తీసుకెళుతున్న 83 లక్షలు విలువ చేసే నోట్ల కట్టలతో ఉన్న సూట్‌కేసు డ్రైవర్ వద్ద కనిపించింది. ఆ సొమ్మును దిండుకల్ ఎన్నికల కార్యాలయానికి తీసుకెళ్లి సరి చూశారు. ఎన్నికల్లో ఓటర్లకు ఇవ్వడానికి తీసుకెళుతున్నారా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మదురైలో: మదురై జిల్లా ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ నాట్రా మంగళంలో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు వాహన తనిఖీలు జరిపారు. ఆ సమయంలో సరైన ఆధారాలు లేకుండా కారు లో తీసుకెళుతున్న 31 లక్షలను స్వాధీనం చేసుకుని ట్రెజరీకి పంపారు. ఆ సొమ్మును జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ కె.వీరరాఘవరావు పరిశీలించి వాటిని ట్రెజరీలో ఉంచారు. -
కడప జిల్లాలో రూ. కోటి ఎర్రచందనం స్వాధీనం
కడప: కడప జిల్లాలో వాగేటికోన వద్ద శేషాచల అటవీ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీశాఖ అధికారులకు ఎర్రచందనం స్మగ్లర్లు ఎదురుపడ్డారు. దాంతో స్మగ్లర్లు... అధికారులపైకి రాళ్లు రువ్వారు. వెంటనే అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు స్మగ్లర్లపై కాల్పులు జరిపారు. దీంతో స్మగ్లర్లు పరారైయ్యరు. తరలించేందుకు సిద్ధంగా ఉన్న ఎర్రచందనాన్ని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువ రూ. కోటి ఉంటుందని అటవీశాఖ అధికారులు వెల్లడించారు. స్మగ్లర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వారు చెప్పారు. -
పోలీసులు కాల్పులు: ఎర్రచందనం స్మగ్లర్లు పరారీ
వైఎస్ఆర్ కడప జిల్లా ఓబులవారిపల్లె మండలం గాదెల గ్రామ సమీపంలో లోతువంక అటవీ ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లర్ల కోసం పోలీసులు, అటవీశాఖ అధికారులు, సిబ్బంది గత అర్థరాత్రి నుంచి సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించారు. ఆ విషయాన్ని పసిగట్టిన స్మగ్లర్లు కూబింగ్ నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందిపై రాళ్ల దాడికి దిగారు. దాంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు స్మగ్లర్లపై రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో స్మగ్లర్లు అక్కడి నుంచి పరారైయ్యారు. ఘటనాస్థలంలో స్మగ్లర్ల డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. డంప్‌లో 200 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే దాదాపు 20 బస్తాలకుపైగా ధాన్యం బస్తాలను కూడా స్వాధీనం చేసుకున్నాఉ. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగల విలువు రూ. కోటిపైగా ఉంటుందని అటవీశాఖ అధికారులు వెల్లడించారు. స్మగ్లర్ల కోసం గాలింపు చర్యలు తీవ్రతరం చేసినట్లు చెప్పారు.