బస్సులో రూ. కోటీ 34 లక్షలు స్వాధీనం | Election Commission seizes Rs.1 crore 34 lakhs from two persons in Coimbatore | Sakshi
Sakshi News home page

బస్సులో రూ. కోటీ 34 లక్షలు స్వాధీనం

Published Thu, Apr 21 2016 10:15 AM | Last Updated on Thu, Sep 27 2018 4:47 PM

బస్సులో రూ. కోటీ 34 లక్షలు స్వాధీనం - Sakshi

బస్సులో రూ. కోటీ 34 లక్షలు స్వాధీనం

కోయంబత్తూరు: తమిళనాడులో మే 16న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కోయంబత్తూరులో ఎన్నికల వాతావరణం వేడిక్కింది. ఇప్పటికే పలు పార్టీలు రోడ్డు షోలతో జోరుగా ప్రచారంలో నిమగ్నమైయ్యాయి. ఈ ఎన్నికల దృష్ట్యా రంగంలోకి దిగిన ఎన్నికల అధికారులు పలు ప్రాంతాల్లో ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నారు.

ఈ తనిఖీల్లో భాగంగా గురువారం కోయంబత్తూరు నుంచి కేరళకు వెళుతున్న బస్సులో తనిఖీలు చేపట్టారు. బస్సులో తరలిస్తున్న రూ. కోటీ 34 లక్షల రూపాయలను ఇద్దరు వ్యక్తుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిద్దరినీ ఎన్నికల అధికారులు ఆదాయ పన్ను శాఖ అధికారులకు అప్పగించారు. అదుపులోకి తీసుకున్న ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అధికారులు ఇంత సొమ్ము ఎవరిది.. ఎక్కడికి తరలిస్తున్నారంటూ పట్టుబడిన ఇద్దరి వ్యక్తులను విచారిస్తున్నట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement