157 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు
తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో 157 మంది అభ్యర్థులపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. వాటిలో హత్యకేసులు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని తమిళనాడు ఎలక్షన్ వాచ్, అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రైట్స్ సంస్థలు ఓ ప్రకటనలో తెలిపాయి. సీపీఎం అభ్యర్థులలో 47శాతం మంది, డీఎండీకే అభ్యర్థులలో 42 శాతం మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థులలో 27 శాతం మంది, బీజేపీ వాళ్లలో 15 శాతం మంది, అన్నాడీఎంకే అభ్యర్థులలో 22 శాతం మంది, డీఎంకే అభ్యర్థులలో 40 శాతం మంది మీద కేసులు ఉన్నాయి.
ఇక అందరికంటే ధనవంతులలో కాంగ్రెస్ అభ్యర్థి హెచ్.వసంతకుమార్ ఉన్నారు. ఆయనకు రూ. 337 కోట్ల ఆస్తి ఉంది. ఆయన తర్వాతి స్థానాలలో ఎంకే మోహన్ (డీఎంకే- రూ. 170 కోట్లు), సీఎం జయలలిత (అన్నాడీఎంకే - రూ. 113 కోట్లు) ఉన్నారు. సగటున ప్రధాన పార్టీల వాళ్లలో 997 మందికి రూ. 4.35 కోట్ల చొప్పున ఉన్నాయి. బీజేపీ అభ్యర్థులు వి.కరుప్పన్, ఎస్.దండపాణి ఇద్దరూ తమకు ఆస్తిపాస్తులే లేవన్నారు.