రజనీకాంత్కు సాదర స్వాగతం: బీజేపీ | we will welcome Rajinikanth, says BJP | Sakshi
Sakshi News home page

రజనీకాంత్కు సాదర స్వాగతం: బీజేపీ

Published Tue, Aug 26 2014 4:25 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

రజనీకాంత్కు సాదర స్వాగతం: బీజేపీ - Sakshi

రజనీకాంత్కు సాదర స్వాగతం: బీజేపీ

సూపర్స్టార్ రజనీకాంత్ను తాము ఆకర్షిస్తున్నామన్న వార్తలను తమిళనాడు బీజేపీ ఖండించింది. అయితే.. ఆయన వస్తానంటే మాత్రం తమ పార్టీ సాదర స్వాగతం పలుకుతుందని చెప్పింది. ఈ మేరకు బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షురాలు తమిళసలై సౌందరరాజన్ మాట్లాడారు. రజనీకాంత్ అంటే బీజేపీ చాలా సానుకూలంగా ఉందని, ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోడీని కూడా ఎన్నికల ప్రచార సమయంలో కలిశారని అన్నారు.

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రజనీని బీజేపీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారన్నవి మాత్రం మీడియాలో వస్తున్న కథనాలు మాత్రమేనని ఆమె స్పష్టం చేశారు. ఆ కథనాలను తమ పార్టీ ఎప్పుడూ ధ్రువీకరించలేదని అన్నారు. గతంలో కూడా ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి నదులను అనుసంధానం చేయాలనుకున్నప్పుడు ఆ ప్రాజెక్టుకు రజనీకాంత్ కోటి రూపాయల విరాళం ఇచ్చిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. జాతీయ దృక్పథం ఉన్న రజనీని తాము సాదరంగా స్వాగతిస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement