కోలివుడ్‌కి చెందిన ప్రుముఖ నటుడు విజయ్‌కాంత్(71) చెన్నైలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన న్యూమోనియాతో ఆస్పత్రిలో చేరి ప్రాణాలతో పోరాడుతుండగానే చివరికి కరోనా పాజిటివ్‌గా అని తేలిన ఒక్కరోజులోనే మృతి చెందారు. న్యూమెనియా లక్షణాలతో కూడా కరోనా అటాక్ ఇస్తుందా? లేదా ఇది కూడా కరోనా సంకేతమా? లేక వయసు కారణామా?. అలాంటప్పుడూ సీనియర్ సిటీజన్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?.
డీఎండీకే పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ తమిళ నటుడు విజయ్‌కాంత్ అభిమానులను శోక సంద్రంలోకి నెట్టేస్తూ మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఆయన తొలుత తీవ్రమైన దగ్గు, గొంతు నొప్పి సమస్యలతో ఆస్పత్రిలోకి చేరినట్లు సమాచారం. ఆ తర్వాత సుమారు 14 రోజులు వైద్యులు పర్యవేక్షణలో ఉన్నారు. న్యూమెనియా వంటి శ్వాసకోశ సమస్యలతో పోరాడుతున్నట్లు పేర్కొన్నారు వైద్యులు. ఆ తర్వాత కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా తేలడం, పరిస్థితి విషమించడం మృతి చెందడం క్షణాల్లో జరిగిపోయాయి. దీంతో అందరిలో న్యూమోనియా కాస్త కరోనా మారి ప్రాణాంతకంగా పరిణామిస్తుందా? అని తీవ్ర భయాందోళనలు తలెత్తుతున్నాయి.
అయితే వైద్యులు ఇలా ఎంత మాత్రం జరగదని చెబుతున్నారు. ఒక్కొసారి తేలికపాటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు తేలిగ్గా తీసుకున్నప్పుడే సమస్య తలెత్తుందన్నారు వైద్యులు. వయసు వల్ల కూడా ఈ సమస్యలు తలెత్తుతాయి. ఎందుకంటే సుమారు 61 ఏళ్ల పైబడినవారిలో చాలామంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుంటారు, దీనికి తోడు వారిలో వ్యాధినిరోధక శక్తి కూడా తక్కువుగా ఉంటుంది. అందువల్ల అలాంటి వారు సదా అప్రమత్తంగా ఉండాల్సిందేనని సూచిస్తున్నారు. యువత కంటే పెద్దలు, చిన్నారులే ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అంతేగాదు ముఖ్యంగా కీమోథెరపీ, మధుమేహం, స్టెరాయిడ్‌లు తీసుకుంటున్నవారు, గుండె జబ్బులు ఉన్నవారు, గర్భిణి స్త్రీలు బహు జాగ్రత్తగా ఉండాల్సిందేనని నొక్కి చెబుతున్నారు వైద్యులు.
ఇలాంటి లక్షణాలు కనిపిస్తే..
- జ్వరం
- అలసట
- దగ్గు, గొంతు నొప్పి
- ఊపిరి ఆడకపోవడం
- కండరాలు, శరీర నొప్పులు
- తలనొప్పి
- చలి
- రుచి, వాసన కోల్పోవడం
తదితర లక్షణాలు వృద్ధలు లేదా పెద్దవారిలో వస్తే అస్సలు నిర్లక్ష్య చేయకుండా తక్షణమే వైద్యుడిన సంప్రదిస్తే మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే ఈ కొత్త కరోనా సబ్ వేరియంట్ జేఎన్ 1 మరింత ప్రమాదకారి కాదు కానీ తగు జాగ్రత్తలు మాత్రం తీసుకోవాల్సిందేనని హెచ్చరించారు. ముఖ్యంగా వ్యక్తిగత శుభ్రత, చేతులు కడుక్కోవడం, సామాజిక దూరం పాటిచటం తోపాట్లు ఇంట్లో ఎవరికైనా కరోనా వస్తే సెపరేట్‌గా ఉండటం తదితర జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అలాగే కాలనుగుణంగా తాజా కూరగాయాలు, పండ్లు, తృణధాన్యాలు తీసుకోవడం వంటివి చేయాలని అన్నారు. అన్నింటికంటే వ్యాధినిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవడం వంటివి చేయడం అత్యంత ముఖ్యమని సూచించారు ఆరోగ్య నిపుణులు.
(చదవండి: తినే గమ్(గోండ్) గురించి తెలుసా? బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు..)
Comments
Please login to add a commentAdd a comment