విజయ్‌ మీదకు చెప్పు విసిరిన వ్యక్తి, వీడియో వైరల్‌ | Captain Vijayakanth Funeral: Mystery Man Throws Slipper At Thalapathy Vijay, Actor Escapes Hurt - Sakshi
Sakshi News home page

Vijay: విజయకాంత్‌ను చూసి విజయ్‌ భావోద్వేగం.. చెప్పు విసిరిన వ్యక్తి..

Published Fri, Dec 29 2023 3:28 PM | Last Updated on Fri, Dec 29 2023 4:45 PM

Captain Vijayakanth Funeral: Man Throws Slipper at Vijay - Sakshi

కెప్టెన్‌ విజయకాంత్‌(71) ఇక సెలవంటూ గురువారం (డిసెంబర్‌ 28న) శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. ఆయన మరణంతో అటు అభిమానులు, సెలబ్రిటీలు విషాదంలో మునిగిపోయారు. ఎంతోమంది హీరోయిన్లకు కెరీర్‌ ఇచ్చి, మరెందరో హీరోలకు ఆదర్శంగా నిలిచిన ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన పార్థివదేహాన్ని సందర్శించేందుకు జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో స్టార్‌ హీరో విజయ్‌.. గురువారం రాత్రి చెన్నైలోని ఐల్యాండ్‌ గ్రౌండ్‌లో విజయకాంత్‌ పార్థివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించాడు. ఆయనను చివరి చూపు చూసుకుని భావోద్వేగానికి లోనయ్యాడు.

చేదు అనుభవం..
కెప్టెన్‌ కుటుంబసభ్యులను పరామర్శించి తిరిగి వెళ్తున్న క్రమంలో విజయ్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఓ వ్యక్తి హీరో మీదకు చెప్పు విసిరాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన జనాలు ఇలాంటి సమయంలో ఈ పిచ్చి పనులేంటని మండిపడుతున్నారు. అజిత్‌ అభిమానులు సైతం ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇకపోతే విజయకాంత్‌ సినిమాల్లో విజయ్‌ చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించాడు. అలాగే విజయ్‌ తండ్రి, దర్శకుడు ఎస్‌ఏ చంద్రశేఖర్‌ విజయకాంత్‌తో పలు సినిమాలు చేశారు. ఇక విజయ్‌ హీరోగా నటించిన తొలి చిత్రం 'నాలయ తీర్పు' ఫెయిల్‌ కావడంతో అతడి రెండో సినిమాలో నటించమని విజయకాంత్‌ను కోరాడు చంద్రశేఖర్‌.

విజయకాంత్‌ వల్లే..
అతడికి ఇచ్చిన మాట ప్రకారం సింధూరపండి మూవీలో నటించగా ఇది బాక్సాఫీస్‌ వద్ద విజయవంతంగా రాణించింది. ఆ తర్వాత విజయ్‌ తనకంటూ ఓ స్టార్‌డమ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. 'అయితే వియజకాంత్‌ ఆ రోజు సాయం చేసి ఉండకపోతే ఈరోజు విజయ్‌ ఇలా ఉండేవాడు కాదు' అని స్వయంగా దళపతి తండ్రి చంద్రశేఖరే ఓ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం.

చదవండి: ఇంటి నుంచి పారిపోయిన హీరోయిన్‌.. పెళ్లి వద్దు, సహజీవనమే ముద్దంటున్న బ్యూటీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement