
భద్రత కల్పించండి
రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీల నాయకులకు, కార్యాలయాలకు భద్రత కల్పించండి అని గవర్నర్ రోశయ్యకు ప్రధాన ప్రతిపక్ష నేత విజయకాంత్ విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఉదయం రాజ్ భవన్‌లో గవర్నర్‌కు వినతి పత్రం సమర్పించారు.
రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీల నాయకులకు, కార్యాలయాలకు భద్రత కల్పించండి అని గవర్నర్ రోశయ్యకు ప్రధాన ప్రతిపక్ష నేత విజయకాంత్ విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఉదయం రాజ్ భవన్‌లో గవర్నర్‌కు వినతి పత్రం సమర్పించారు.
సాక్షి, చెన్నై: జయలలితకు శిక్ష ఖరారు కావడంతో అన్నాడీఎంకే వర్గాలు సృష్టించిన వీరంగం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతిపక్షాల్ని టార్గెట్ చేసి దాడులకు యత్నించారుు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించే ప్రమాదం నెలకొందన్న ఆందోళనతో ఉదయాన్నే డీఎండీకే నేత, ప్రధాన ప్రతిపక్ష నేత విజయకాంత్ రాజ్‌భవన్ బాట పట్టారు. పార్టీ ఎమ్మెల్యేల బృందంతో కలిసి గవర్నర్ రోశయ్యను కలిశారు. 15 నిమిషాల పాటుగా రోశయ్యతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బం దులు, ప్రతిపక్షాల్ని టార్గెట్ చేసి సాగుతున్న దాడుల్ని వివరిస్తూ వినతి పత్రం సమర్పించారు. ప్రజలకు, తమకు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రతిపక్షాలకు భద్రత కరువు : గవర్నర్‌తో భేటీ అనంతరం విలేకరులతో రోశయ్య మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రతి పక్షాలకు భద్రత కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. అన్నాడీఎంకే వర్గాలు వ్యవహరించిన తీరును చూసిన ప్రజల్లో భయానక వాతావరణం నెలకొందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, ప్రజల్ని, ప్రతి పక్షాల నాయకులకు భద్రత కల్పించాలని గవర్నర్ రోశయ్యకు విజ్ఞప్తి చేయగా, ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, విద్యుత్, తాగునీరు తదితర సమస్యల్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. జయలలిత అండ్‌కో కు నాలుగేళ్లు జైలు శిక్ష విధించడాన్ని తాను స్వాగతిస్తున్నానన్నారు. తప్పు చేసిన వాళ్లు శిక్ష అనుభవించాల్సిందేని స్పష్టం చేశారు. చట్టానికి అందరూ సమానం అన్న విషయం ప్రస్తుత తీర్పు స్పష్టం చేసిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో సాగిన అరాచకాల్ని ప్రభుత్వ కేబుల్ పరిధిలోని ఛానళ్లలో ప్రసారం చేయకుండా అడ్డుకట్ట వేశారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు.
పిటిషన్ : తమకు భద్రత కల్పించాలంటూ గవర్నర్ రోశయ్యను ప్రధాన ప్రతిపక్ష నేత ఓ వైపు కలిస్తే, మరో వైపు సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి స్పందించారు. ప్రజలకు భద్రత కల్పించాలంటూ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఉదయం ట్రాఫిక్ రామస్వామి, న్యాయవాది రాజారాం న్యాయమూర్తి వైద్యనాథన్ ఇంటికి వెళ్లి పిటిషన్ సమర్పించారు. ప్రజలకు భద్రత కల్పించాలని కోరుతూ, రాష్ట్రంలో సాగిన విధ్వంసాలను వివరించారు.