డీఎండీకే అధినేత, కోలీవుడ్ సినీ నటుడు విజయకాంత్ తీవ్రమైన అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణియన్ తెలిపారు. కొద్ది రోజుల క్రితం కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడ్డ విజయకాంత్ ఆపరేషన్ చేయించుకున్నారు. మళ్లీ అనారోగ్య సమస్యలు రావడం వల్ల ఆయన తిరిగి చికిత్స పొందుతున్నారు.
విజయకాంత్‌కు వైద్యం అందిస్తున్న డాక్టర్లతో మాట్లాడిన మంత్రి ఈమేరకు చెప్పారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న విజయకాంత్ ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదని మంత్రి చెప్పడంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. విజయకాంత్‌ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తుండడం వల్ల ఆయన ఆరోగ్య పరిస్థితిపై వదంతులు వచ్చాయని డీఎండీకే పార్టీ నేతలు చెప్పారు.
తాజాగా మంత్రి సుబ్రహ్మణియన్ కూడా ఇదే విషయాన్ని అధికారికంగా తెలిపారు. ఆయన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లను నమ్మవద్దని కోరారు. రెగ్యులర్‌గా ఆయనకు అందించే చికిత్సలో భాగంగానే ప్రస్తుతం కూడా చికిత్స కొనసాగుతున్నదని , ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆ పార్టీ కార్యాలయం ప్రకటించింది. రెండు మూడు రోజులలో విజయకాంత్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment