యాక్షన్ స్టార్ విశాల్ | Action star Vishal | Sakshi
Sakshi News home page

యాక్షన్ స్టార్ విశాల్

Published Sun, Dec 28 2014 2:02 AM | Last Updated on Wed, Apr 3 2019 8:51 PM

యాక్షన్ స్టార్ విశాల్ - Sakshi

యాక్షన్ స్టార్ విశాల్

 నటుడు విశాల్‌కు యాక్షన్ స్టార్ పట్టం కట్టారు. మన్సూర్ అలీఖాన్ మాట్లాడుతూ, ఒకప్పుడు విజయకాంత్ చిత్రాల్లో భారీ యాక్షన్ సన్నివేశాలుండేవన్నారు. ఆయనతో నటించినప్పుడు తాను చాలా దెబ్బలకు గురయ్యానని అన్నారు. అలా ప్రస్తుతం నటుడు విశాల్ యాక్షన్ కథా చిత్రాల్లో బాగా నటిస్తున్నారని అన్నారు. అందుకే ఆయన్ను యాక్షన్ స్టార్‌గా పేర్కొనట్లు అన్నారు. విశాల్ హీరోగా నటిస్తూ తన సొంత నిర్మాణ సంస్థ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీలో నిర్మిస్తున్న తాజా చిత్రం ఆంబళ. హన్సిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో నటుడు వైభవ్, రమ్యకృష్ణ, కిరణ్‌రాథోడ్ తదితరులు ముఖ్య పాత్రలు పోసిస్తున్నారు.
 
 సుందర్ సి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ద్వారా హిప్‌హాప్ తమిళ సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్నారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం ఉదయం స్థానిక రాయపేటలోని సత్యం సినీ కాంప్లెక్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన్సూర్ అలీఖాన్ ప్రసంగించారు. అనంతరం నిర్మాత టి.శివ మాట్లాడుతూ ఆంబ ళ (మగాడు) చిత్రం టైటిల్ విశాల్‌కు కరెక్ట్‌గా నప్పుతుందన్నారు.
 
 ఆయన పైరసీని అరికట్టడానికి ఒంటరిగా పోరాడుతున్నారని ప్రశంసించారు. అలాగే ధైర్యంగా చిత్రాలు నిర్మిస్తూ విజయాలు సాధిస్తున్నారని అన్నారు. సుందర్ సి మొదట్లో పలు భారీ హిట్స్ చిత్రాలను అందించారని మధ్యలో కొంత వెనుకబడ్డా మళ్లీ వరుస విజ యాలతో పూర్వ వైభవాన్ని సంపాదించుకున్నారన్నారు. వీరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ ఆంబళ చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మ కం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో నటి కుష్బు, హన్సిక, జి.కె.రెడ్డి, ఆర్‌కె సెల్వమణి, ఎస్‌ఎ చంద్రశేఖర్, తిరు, హిప్ హాప్ తమిళ్, ఆర్య, కె.ఇ.జ్ఞానవేల్ రాజా  పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement