మరో వివాదంలో విజయ్ కాంత్ | DMDK chief Vijayakanth loses cool while campaigning, threatens to slap journalists | Sakshi
Sakshi News home page

మరో వివాదంలో విజయ్ కాంత్

Published Wed, Apr 20 2016 3:36 PM | Last Updated on Tue, Aug 28 2018 7:24 PM

మరో వివాదంలో విజయ్ కాంత్ - Sakshi

మరో వివాదంలో విజయ్ కాంత్

చెన్నై : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌పై డిఎండికె అధినేత, నటుడు విజయ్ కాంత్ చేసిన వ్యాఖ్యలతో చెలరేగిన వివాదం చల్లారకముందే ఆయన మరో వివాదంలో ఇరుక్కున్నారు. 2016 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా  ముఖ్యమంత్రి అభ్యర్థి  కెప్టెన్  విజయకాంత్  మరోసారి రెచ్చిపోయాడు. బుధవారం సేలంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో జర్నలిస్టులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.  

సహనం  కోల్పోయిన విజయ్ కాంత్ పాత్రికేయులపై ఆగ్రహంతో  ఊగిపోయారు.  చెంప దెబ్బ కొడతానంటూ  బెదిరించి మరో వివాదానికి కేంద్రంగా మారారు.  అయితే ఆయన జర్నలిస్టులపై  విరుకుచుపడడం  వెనుక కారణాలు తెలియాల్సి ఉంది. కాగా డిఎండీకె, పీడబ్ల్యూఎఫ్ కూటమికి ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా బరిలో ఉన్న విజయకాంత్  ఉల్లుందూర్ పేట్  నుంచి పోటీ చేస్తున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement