తమిళుల కోసం ఢిల్లీ ఎన్నికల్లో పోటీ | DMDK chief throws his hat into New Delhi political ring | Sakshi
Sakshi News home page

తమిళుల కోసం ఢిల్లీ ఎన్నికల్లో పోటీ

Published Mon, Oct 28 2013 3:51 AM | Last Updated on Tue, Mar 19 2019 9:15 PM

DMDK chief throws his hat into New Delhi political ring

టీనగర్, న్యూస్‌లైన్:తమిళ ప్రజల సమస్యలు తీర్చేందుకు ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ తెలి పారు. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో డీఎండీకే 10 నియోజకవర్గాల్లో పోటీ చేయనుంది. ఢిల్లీ వెళ్లిన విజయకాంత్ అభ్యర్థుల ఎంపిక కోసం తీవ్రంగా సమాలోచన జరుపుతున్నారు. ఢిల్లీ శాసనసభకు డిసెంబరు నాలుగవ తేదీ ఎన్నికలు జరుగనున్నాయి. 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. సుమారు 1.15 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో సుమారు 15 లక్షల మంది తమిళులు నివసిస్తున్నారు. వీరిలో అనేక మంది గుడిసె వాసులు ఉన్నారు. 
 
 వీరి ఓట్లను పొందేందుకు తమిళ అభ్యర్థులను బరిలోకి దించాలని డీఎండీకే నిర్ణయించింది. ఈ నేపథ్యంలో 10 నియోజకవర్గాలకు డీఎండీకే పోటీ చేయనున్నట్లు తెలిపారు. అభ్యర్థి ఎంపికకోసం పార్టీ అధ్యక్షుడు విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలత, ఇతర ముఖ్య నిర్వాహకులు శనివారం ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ మైదానంలో ఆదివారం ఉదయం బహిరంగ సభ నిర్వహించారు. ఇందులో ప్రసంగించిన విజయకాంత్ ఢిల్లీలోని తమిళులు వంచనకు గురవుతున్నారని, వారి సమస్యలు తీర్చేందుకు ఢిల్లీ శాసన సభ ఎన్నికల్లో డీఎండీకే పోటీ చేస్తుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement