Mansur Ali Khan
-
తాను నడుపుతున్న లారీ.. తనకే మృత్యు శకటమై..
కరీంనగర్: గోదావరిఖని టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధి గోదావరిఖని–మంథని ప్రధాన రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ ఎండీ మన్సూర్ ఆలం(48) దుర్మరణం చెందాడు. తాను నడుపుతున్న లారీ కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. గోదావరిఖని టూటౌన్ పోలీసుల కథనం ప్రకారం.. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన మన్సూర్ ఆలం భూపాలపల్లిలో నివాసం ఉంటున్నాడు. లారీ నడుపుతూ జీవనోపాధి పొందుతున్నాడు. సోమవారం ఉదయం ఓసీపీ–3 సీహెచ్‌పీ వద్ద బొగ్గు డంప్‌చేసి గోదావరిఖని నుంచి భూపాలపల్లి వైపు వెళ్తున్నాడు. ఈక్రమంలో రామగిరి మండలం సుందిళ్ల గ్రామం వద్ద ముందు వెళ్తున్న లారీ బ్రేకులు ఆగిపోయాయి. దీన్ని గమనించని డ్రైవర్ మన్సూర్ ఆలం లారీ ఆపలేదు. దీంతో ముందు ఉన్న మరోలారీని ఢీకొట్టుకున్నాడు. ఈప్రమాదంలో మన్సూర్ ఆలం క్యాబిన్ నుంచి కిందపడ్డాడు. తాను నడుపుతున్న లారీ కిందనే పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇవి చదవండి: మాటామాట పెరిగి తలపై రాడ్‌తో దారుణంగా.. -
చెత్తకుప్ప పక్కన ప్రముఖ విలన్.. చివరికి!
చెన్నై: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఓట్లను చీల్చాలనే ఉద్దేశంతోనే ఆయన ఎన్నికల బరిలో దిగారంటూ విమర్శలు రావడంతో మనస్తాపం చెంది, పోటీ నుంచి విరమించుకున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఓ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా కోయంబత్తూరులోని తొండముత్తూరు నియోజకవర్గం నుంచి మన్సూర్ అలీఖాన్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో.. మన్సూర్ అలీఖాన్, చెత్తకుప్ప వద్ద పెన్ను పేపర్ పట్టుకుని, పక్కన కుక్కను పెట్టుకుని వినూత్న రీతిలో ప్రచారానికి తెరతీశారు. రాజకీయ నాయకులు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని, ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని బాటసారులకు విజ్ఞప్తి చేశారు. తాను ఎమ్మెల్యేను అయిన తర్వాత వీటిని అధిగమించేందుకు చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. అదే విధంగా, తొండముత్తూరులోని గాంధీ పార్కు ఏరియాలో వాలీబాల్ ఆడుతూ సరదాగా గడిపారు. జోకులు వేస్తూ అందరినీ నవ్విస్తూ కలివిడిగా మెదిలారు. ఆ తర్వాత పెరూర్ పట్టేశ్వరర్ ఆలయం వద్ద దుకాణాదారులతో ముచ్చటించారు. ఈ మేరకు శుక్ర, శనివారాల్లో మన్సూర్ ముమ్మర ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో, కొంతమంది ఓటర్లు ఆయనపై విమర్శలు సంధించినట్లు తెలుస్తోంది. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న, ఆడియో క్లిప్‌లో ఉన్న వివరాల ప్రకారం.. మైనార్టీ ఓట్లను చీల్చేందుకు ఓ రాజకీయ పార్టీ దగ్గర తాను డబ్బు తీసుకున్నాననే ఆరోపణలు వస్తున్నాయని, ఈ విషయం తనను తీవ్రంగా బాధించిందని మన్సూర్ పేర్కొన్నారు. నిజాయితీగా సేవ చేద్దామనుకున్నా, ప్రజలు తనను శంకిస్తున్నారని, అందుకే పోటీ నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. అయితే, క్లిప్ వాస్తవమా కాదా అన్న అంశంపై స్పష్టత లేదు. మన్సూర్ అలీఖాన్ ఈ విషయంపై ఎలా స్పందిస్తారోనన్న అంశం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. కాగా కెప్టెన్ ప్రభాకరన్ సినిమాతో లైమ్‌లైట్‌లోకి వచ్చిన మన్సూర్ అలీఖాన్, విలన్‌గా మెప్పించారు. దక్షిణాది భాషల్లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఆయన, తెలుగులో ముఠామేస్త్రి, సాంబ, నాయుడమ్మ వంటి చిత్రాల్లో గుర్తుండిపోయే పాత్రలు పోషించారు. చదవండి: ఆస్పత్రిలో సీనియర్ నటుడు -
ఆయన చేతికి చిక్కితే అంతే!
తమిళసినిమా: నటుడు మన్సూర్‌అలీఖాన్ చేతికి చిక్కితే ప్రాణాలతో బయటపడడం అసాధ్యమే. అంత దుర్మార్గుడా? అంతే చెప్పడం కష్టమే. అది తెలియాలంటే కడమాన్‌పారై చిత్రం చూడాల్సిందే. మన్సూర్ అలీఖాన్ తన రాజ్కెనడీ ఫిలింస్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో నిర్మించి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం కడమాన్ పారై. అంతే కాదు ఈ చిత్రం ద్వారా ఆయన తన కొడుకు అలీఖాన్ తుగ్లక్‌ను హీరోగా పరిచయం చేస్తున్నారు. అనురాగవి హీరోయిన్గా నటిస్తున్న ఇందులో మరో హీరోయిన్గా జెన్నీఫెర్నాండెజ్ నటిస్తోంది. శివశంకర్, ,చార్మి, దేవీజేజూ, బ్లాక్‌పాండి, అముదవానన్, ముల్లై, కోదండం, పళనీ, కనల్‌కన్నన్, బోండామణి, పయిల్వాన్ రంగనాథన్, లొల్లుసభ మనోహర్, వెంగళరావ్, ఆదిశివన్, విచిత్రన్, కూల్‌సురేశ్ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకనిర్మాత మన్సూర్‌అలీఖాన్ తెలుపుతూ కళాశాల విద్యార్థిలిప్పుడు దారి తప్పుతున్నారన్నారు. అమ్మ, నాన్న, ఉపాధ్యాయుడు ఎవరు చెప్పినా వారు లెక్క చేయకుండా పెడ దారి పడుతున్నారని, అలాంటి ఒక యువప్రేమ జంట కాలేజ్‌కు డుమ్మా కొట్టి ఒక కొండ ప్రాంతానికి వెళతారని తెలిపారు. అక్కడ గంగువారెడ్డి కొండ, గంజ కొండ పాంత్రాలను తన ఆధీనంలో ఉంచుకున్న సూరప్పన్ అనే ఆదివాసి(మన్సూర్‌అలీఖాన్) చేతిలో చిక్కుకుంటారని తెలిపారు. అతని చేతిలో చిక్కితే ఫారెస్ట్ రేంజర్ అయినా ప్రాణాలతో బయట పడలేడని అన్నారు. అంతే కాదు ఆ కొండ ప్రాంతాల్లోని చందన కట్టెలను, ఖనిజ వనరులను ఎవరూ దొంగిలించలేరని చెప్పారు. అలా అక్కడి కనిజ వనరులను కాపాడే సూరప్పన్ నుంచి ఈ ప్రేమజంట బయట పడగలిగారా లేదా అన్న పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన చిత్రం కడమాన్ పారై చిత్రం అని తెలిపారు. ఈ చిత్ర షూటింగ్‌ను ఆంధ్రా రాష్ట్రంలోని దట్టమైన అడవుల్లోనూ, పాండిచ్చేరి, చెన్నైలోనూ నిర్వహించినట్లు చెప్పారు. దీనికి రవివర్మ సంగీతాన్ని, టి.మహేశ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఇటీవల స్థానిక నుంగంబాక్కంలోని తన కార్యాలయంలో నిర్వహించారు. -
ఎనిమిది మందిని అడ్డంగా నరుకుతా..
తమిళనాడు, పెరంబూరు: సేలం–చెన్నై మధ్య 8వే ఏర్పాటు చేస్తే ఎనిమిది మందిని అడ్డంగా నరుకుతానని నటుడు మన్సూర్ అలీఖాన్ హెచ్చరించారు. ఆయన గురువారం సెలం విమానాశ్రయం విస్తరణ కారణంగా బాధింపునకు గురవుతున్న వ్యవసాయ భూములను పర్యవేక్షించడానికి కాడయాంపట్టికి వెళ్లారు. పొట్టియపురం, తంబిపాడి, సికణం పాడి గ్రామస్తులను కలిసి మద్దతు తెలిపారు. అనంతరం మన్సూర్‌అలీఖాన్ విలేకరులతో మాట్లాడుతూ సేలంలో ఇప్పటికే విమానాశ్రయం ఉందని, అక్కడి ప్రజలు విమానయానం చేసేందుకు ఆసక్తి చూపడం లేదన్నారు. ఇక్కడ విమాన పరికరాలను తయారు చేయడానికి విమానాశ్రయాలు నెలకొల్పుతున్నారా? లేక పారిశ్రామికవేత్తల కోసం ఏర్పాటు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. చెన్నై–సేలం మధ్య 8వే ఏర్పాటు చేస్తే ఎనిమిది మందిని అడ్డంగా నరుకుతానని నటుడు మన్సూర్ అలీఖాన్ ఆవేశపూరితంగా మాట్లాడారు. వనాలు, పంట భూములు, కొండలను కరిగించి రోడ్లను కార్పొరేట్ సంస్థల కోసం ఏర్పాటు చేయడం ఖండించదగ్గదని ఆయన వ్యాఖ్యానించారు. -
ఉరుది కోల్ చిత్ర గీతాలావిష్కరణ
తమిళసినిమా: ఉరుధి కోల్ చిత్ర గీతాలావిష్కరణ కార్యక్రమం సోమవారం మధ్యాహ్నం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది. ఏపీకే.ఫిలిం స్, స్నేహం ఫిలింస్ సం స్థల అధినేతలు పీ.అ య్యప్పన్, సీ.పళని కలి సి నిర్మిస్తున్న ఇందులో గోలీసోడా ఫేమ్ కిశోర్ కథానాయకుడిగా నటిస్తున్నారు. నటి మోహన నాయకిగా నటిస్తున్న ఇందులో కాళీవెంకట్, తెన్నవన్, మాస్టర్ శివశంకర్, కన్నన్, పొన్నయ్య, అఖిలేష్, షర్మిళ తదితరులు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.నవ దర్శకుడు ఆర్.అయ్యనార్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈయన దర్శకుడు కృష్ణ వద్ద నెడుంశాలై చిత్రానికి సహాయ దర్శకుడిగా పని చేశారన్నది గమనార్హం. పాండిఅరుణాచలం ఛాయాగ్రహణం, జూట్ వినీగర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో నటుడు మన్సూర్‌అలీఖాన్ అతిథిగా పాల్గొని ఆడియో తొలి ప్రతిని ఆవిష్కరించారు. చిత్ర వివరాలను దర్శకుడు ఆర్.అయ్యనార్ తెలుపుతూ పాఠశాల్లో చదువుకునే వయసులో విద్యార్థి, విద్యార్థిని మధ్య ఏర్పడే ప్రేమ మంచిది కాదని, అందులో పరిపక్వత ఉండదని చెప్పే కథాంశంతో కూడిన చిత్రం ఉరుధి కోల్ అని చెప్పారు. ఆడపిల్లల పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న మంచి సందేశాన్ని ఈ చిత్రం ద్వారా తల్లిదండ్రులకు ఇవ్వనున్నట్లు తెలిపారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ ఉరుధికోల్ చిత్రాన్ని త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. -
నన్ను నటించొద్దు అనడానికి నీవెవరు
నన్ను నటించవద్దు అనడానికి నువ్వెవరివి అంటూ ఫెప్సీ అధ్యక్షుడు శివను నటుడు మన్సూర్ అలీఖాన్ ప్రశ్నిస్తున్నారు. ఈయన ఫెప్సీ ( దక్షిణ భారత సినీ కార్మిక సమాఖ్య)కు పోటీగా టాప్సీ సమాఖ్యను నెలకొల్పారు. దీంతో ఫెప్సీకి మన్సూర్ అలీఖాన్‌కు మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఇలాంటి పరిస్థితిలో నటుడు మన్సూర్ అలీఖాన్ నటించే చిత్రాలకు తాము సహకరించబోమని ఫెప్సీ నిర్వాహకులు కొందరు ప్రకటించారు. దీనికి స్పందించిన మన్సూర్ అలీఖాన్ ఒకరి కడుపును మరొకరు కొట్టడం న్యాయమా? నేను నెలకొల్పిన టాప్సీ సమాఖ్యను తొక్కేయడానికి, నా వ్యక్తిగత విజయాన్ని అడ్డుకోలేక ఇలా నేను నటించే చిత్రాలకు సహకరించం అంటున్నారు. అలా సహకరించకపోతే టాప్సీ సహకరిస్తుంది. మీరు తప్పుకోండి. టాప్సీ నుంచి వందమంది కావాలా, 200 మంది కావాలా నేను పంపిస్తాను. టాప్సీలో మొత్తం 400 మంది సభ్యులు ఉన్నారు. అందులో డ్యాన్సర్లు, స్టంట్ కళాకారులు అంటూ పలు శాఖలకు చెందిన వారు ఉన్నారు. అయినా మన్సూర్ అలీఖాన్ నటించొద్దు అనడానికి మీరెవ్వరు. అది దర్శక నిర్మాతలు ఇష్టాఇష్టాలపై ఆధారపడి ఉంటుంది. నేనెన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాను. అలాంటిది కొందరు టాప్సీని నిర్మూలించాలనుకుంటున్నారు. నిజానికి నాకు ఫెప్సీ సభ్యులతో ఎలాంటి సమస్య లేదు. వారంతా హాలీవుడ్ కళాకారులకు ధీటుగా నైపుణ్యం కలవారు. సమస్య అంతా అక్రమాలకు పాల్పడుతూ పనీ పాట లేకుండా బతికేస్తున్న కొందరు నీతిమాలిన వారి చర్యల్నే ఖండిస్తున్నాను. ఈ విషయమై నేను న్యాయస్థానాన్ని ఆశ్రయించి నటించడానికి అభ్యంతరం లేకుండా ఉత్తర్వులు పొందానని మన్సూర్ అలీఖాన్ తెలిపారు. -
గెలుపు థానుదే
తమిళ నిర్మాతలు కలైపులి ఎస్.థానుకే పట్టం కట్టారు. తమిళ నిర్మాతల మండలి ఎన్నికలను ఆదివారం స్థానిక అన్నానగర్‌లో గల కందస్వామి కళాశాల ఆవరణలో నిర్వహించారు. కలైపులి ఎస్.థాను ఎఎల్ అళగప్పన్, మన్సూర్ అలీఖాన్, హండ్రి, గెటప్ రాజేంద్రన్ తదితర ఐదుగురు అధ్యక్ష పదవికి పోటీ చేశారు. హైకోర్టు న్యాయమూర్తి ఎ.కె.రాజన్ నేతృత్వంలో ఈ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఐదుగురిలో ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ స్థితిలో ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు పోలింగ్ జరిగింది. అనంతరం ఓట్ల లెక్కింపు మొదలైంది. గట్టి పోలీసు బందోబస్తు మధ్య జరిగిన ఈ ఎన్నికల్లో విజయం నిర్మాత కలైపులి ఎస్.థానును వరించింది. మొత్తం 967 సభ్యులుండగా అందులో 565 మంది థానుకే ఆమోదముద్ర వేశారు. ఎఎల్అళగప్పన్కు 127 ఓట్లు, మన్సూర్ అలీఖాన్‌కు 29 ఓట్లు పడ్డాయి. ఇతర సభ్యుల వివరాలు సోమవారం వెల్లడించనున్నారు. - తమిళసినిమా -
యాక్షన్ స్టార్ విశాల్
నటుడు విశాల్‌కు యాక్షన్ స్టార్ పట్టం కట్టారు. మన్సూర్ అలీఖాన్ మాట్లాడుతూ, ఒకప్పుడు విజయకాంత్ చిత్రాల్లో భారీ యాక్షన్ సన్నివేశాలుండేవన్నారు. ఆయనతో నటించినప్పుడు తాను చాలా దెబ్బలకు గురయ్యానని అన్నారు. అలా ప్రస్తుతం నటుడు విశాల్ యాక్షన్ కథా చిత్రాల్లో బాగా నటిస్తున్నారని అన్నారు. అందుకే ఆయన్ను యాక్షన్ స్టార్‌గా పేర్కొనట్లు అన్నారు. విశాల్ హీరోగా నటిస్తూ తన సొంత నిర్మాణ సంస్థ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీలో నిర్మిస్తున్న తాజా చిత్రం ఆంబళ. హన్సిక హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో నటుడు వైభవ్, రమ్యకృష్ణ, కిరణ్రాథోడ్ తదితరులు ముఖ్య పాత్రలు పోసిస్తున్నారు. సుందర్ సి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ద్వారా హిప్హాప్ తమిళ సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్నారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం ఉదయం స్థానిక రాయపేటలోని సత్యం సినీ కాంప్లెక్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన్సూర్ అలీఖాన్ ప్రసంగించారు. అనంతరం నిర్మాత టి.శివ మాట్లాడుతూ ఆంబ ళ (మగాడు) చిత్రం టైటిల్ విశాల్‌కు కరెక్ట్‌గా నప్పుతుందన్నారు. ఆయన పైరసీని అరికట్టడానికి ఒంటరిగా పోరాడుతున్నారని ప్రశంసించారు. అలాగే ధైర్యంగా చిత్రాలు నిర్మిస్తూ విజయాలు సాధిస్తున్నారని అన్నారు. సుందర్ సి మొదట్లో పలు భారీ హిట్స్ చిత్రాలను అందించారని మధ్యలో కొంత వెనుకబడ్డా మళ్లీ వరుస విజ యాలతో పూర్వ వైభవాన్ని సంపాదించుకున్నారన్నారు. వీరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ ఆంబళ చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మ కం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో నటి కుష్బు, హన్సిక, జి.కె.రెడ్డి, ఆర్కె సెల్వమణి, ఎస్ఎ చంద్రశేఖర్, తిరు, హిప్ హాప్ తమిళ్, ఆర్య, కె.ఇ.జ్ఞానవేల్ రాజా పాల్గొన్నారు.