ఉరుది కోల్‌ చిత్ర గీతాలావిష్కరణ | urudhi kole Vishalvilation was held in Prasadlab Monday. | Sakshi

ఉరుది కోల్‌ చిత్ర గీతాలావిష్కరణ

Published Tue, Jul 4 2017 2:13 AM | Last Updated on Tue, Sep 5 2017 3:06 PM

ఉరుది కోల్‌ చిత్ర గీతాలావిష్కరణ

ఉరుది కోల్‌ చిత్ర గీతాలావిష్కరణ

తమిళసినిమా:  ఉరుధి కోల్‌ చిత్ర గీతాలావిష్కరణ కార్యక్రమం సోమవారం మధ్యాహ్నం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది. ఏపీకే.ఫిలిం స్, స్నేహం ఫిలింస్‌ సం స్థల అధినేతలు పీ.అ య్యప్పన్, సీ.పళని కలి సి నిర్మిస్తున్న ఇందులో గోలీసోడా ఫేమ్‌ కిశోర్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. నటి మోహన నాయకిగా నటిస్తున్న ఇందులో కాళీవెంకట్, తెన్నవన్, మాస్టర్‌ శివశంకర్, కన్నన్, పొన్నయ్య, అఖిలేష్, షర్మిళ తదితరులు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.నవ దర్శకుడు ఆర్‌.అయ్యనార్‌ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈయన దర్శకుడు కృష్ణ వద్ద నెడుంశాలై చిత్రానికి సహాయ దర్శకుడిగా పని చేశారన్నది గమనార్హం.

పాండిఅరుణాచలం ఛాయాగ్రహణం, జూట్‌ వినీగర్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో నటుడు మన్సూర్‌అలీఖాన్‌ అతిథిగా పాల్గొని ఆడియో తొలి ప్రతిని ఆవిష్కరించారు. చిత్ర వివరాలను దర్శకుడు ఆర్‌.అయ్యనార్‌ తెలుపుతూ పాఠశాల్లో చదువుకునే వయసులో విద్యార్థి, విద్యార్థిని మధ్య ఏర్పడే ప్రేమ మంచిది కాదని, అందులో పరిపక్వత ఉండదని చెప్పే కథాంశంతో కూడిన చిత్రం ఉరుధి కోల్‌ అని చెప్పారు. ఆడపిల్లల పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న మంచి సందేశాన్ని ఈ చిత్రం ద్వారా తల్లిదండ్రులకు ఇవ్వనున్నట్లు తెలిపారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ ఉరుధికోల్‌ చిత్రాన్ని త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement