Mohana
-
బుద్ధిలేదా.. ఆ ముసుగు ఎందుకు..!
కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలిపే క్రమంలో టీవీ నటి, రేవా రాకుమారి మోహనా కుమారి సింగ్ షేర్ చేసిన ఫొటో ఆమెకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. మోహనా సింగ్‌కు ఇటీవలే వివాహం జరిగిన సంగతి తెలిసిందే. రాజ్‌పూత్ కుటుంబానికి చెందిన సుయేష్ రావత్‌ను ఆమె పెళ్లాడారు. ఇరు కుటుంబాల సమక్షంలో వారి పెళ్లి అంగరంగా వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా తన పుట్టింటి, అత్తింటి వారితో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసిన మోహన... ‘ రేవా, రావత్ కుటుంబం నుంచి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రేమ, శాంతి, ఐక్యతను వ్యాప్తి చేయండి. సంతోషంగా ఉండటం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రపంచానికి, మన దేశానికి కూడా’ అంటూ విషెస్ తెలిపారు. ఈ క్రమంలో మోహన పోస్టుపై స్పందించిన ఓ నెటిజన్.. మీ ముఖంపై ముసుగు ఎందుకు ఉందంటూ ప్రశ్నించాడు. ఇందుకు బదులుగా...‘ఎందుకంటే వీళ్లు పితృస్వామ్య వ్యవస్థ పెట్టిన ఆచార సంప్రదాయాలను పాటిస్తారు. చదువుకున్నా వీళ్లకు బుద్ధి మాత్రం పెరగలేదు అంటూ మరో నెటిజన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ విషయంపై స్పందించిన మోహన..‘ క్రిస్టియన్లు కూడా పెళ్లి సమయంలో మేలి ముసుగు కప్పుకుంటారు. ముస్లిం కూడా ఇలాగే చేస్తారు. అయితే వాళ్లందరూ చదువురాని వాళ్లే అంటారా! ఇది రాజ్‌పూత్ వంశస్తుల ఆచారం. వివాహ సమయంలో ఇలా ముసుగు ధరించడం సంప్రదాయం. ఇలా చేయమని నన్నెవరూ బలవంతపెట్టలేదు. నా ఇష్టపూర్వకంగా ఈ పనిచేశా’ అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇక మోహన భర్త సుయేష్ సైతం.. ‘పబ్లిసిటీ కోసం పాకులాడే వాళ్లు ఇలాంటి చెత్త కామెంట్లు చేస్తారు’ అంటూ సదరు నెటిజన్ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా డాన్స్ ఇండియా డాన్స్ షోతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మోహనా.. ఓ ప్రముఖ హిందీ చానెల్లో ప్రసారమయ్యే సీరియల్‌తో నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. రేవా రాజవంశానికి చెందిన ఆమె వివాహం అక్టోబరులో జరిగింది. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. View this post on Instagram Wish you all a Happy New Year from the Rewa and Rawat Family with a message to spread Love , Peace , feeling of Unity , Happiness and good health to the World and our Country. 🌸🍁 #fromustoyou A post shared by Mohena Kumari Singh (@mohenakumari) on Jan 1, 2020 at 2:49am PST -
ఉరుది కోల్ చిత్ర గీతాలావిష్కరణ
తమిళసినిమా: ఉరుధి కోల్ చిత్ర గీతాలావిష్కరణ కార్యక్రమం సోమవారం మధ్యాహ్నం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది. ఏపీకే.ఫిలిం స్, స్నేహం ఫిలింస్ సం స్థల అధినేతలు పీ.అ య్యప్పన్, సీ.పళని కలి సి నిర్మిస్తున్న ఇందులో గోలీసోడా ఫేమ్ కిశోర్ కథానాయకుడిగా నటిస్తున్నారు. నటి మోహన నాయకిగా నటిస్తున్న ఇందులో కాళీవెంకట్, తెన్నవన్, మాస్టర్ శివశంకర్, కన్నన్, పొన్నయ్య, అఖిలేష్, షర్మిళ తదితరులు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.నవ దర్శకుడు ఆర్.అయ్యనార్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈయన దర్శకుడు కృష్ణ వద్ద నెడుంశాలై చిత్రానికి సహాయ దర్శకుడిగా పని చేశారన్నది గమనార్హం. పాండిఅరుణాచలం ఛాయాగ్రహణం, జూట్ వినీగర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో నటుడు మన్సూర్‌అలీఖాన్ అతిథిగా పాల్గొని ఆడియో తొలి ప్రతిని ఆవిష్కరించారు. చిత్ర వివరాలను దర్శకుడు ఆర్.అయ్యనార్ తెలుపుతూ పాఠశాల్లో చదువుకునే వయసులో విద్యార్థి, విద్యార్థిని మధ్య ఏర్పడే ప్రేమ మంచిది కాదని, అందులో పరిపక్వత ఉండదని చెప్పే కథాంశంతో కూడిన చిత్రం ఉరుధి కోల్ అని చెప్పారు. ఆడపిల్లల పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న మంచి సందేశాన్ని ఈ చిత్రం ద్వారా తల్లిదండ్రులకు ఇవ్వనున్నట్లు తెలిపారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ ఉరుధికోల్ చిత్రాన్ని త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు.