త్వరలోనే ఏపీకి బృందాన్ని పంపిస్తాం.. దుండగుల్ని శిక్షించేలా చర్యలు తీసుకుంటాం
వైఎస్సార్‌సీపీ నేతలకు ఎన్‌సీఎస్సీ చైర్మన్ కిషోర్ మక్వానా హామీ
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ విగ్రహంపై దాడి జరిగిందన్న విషయం తెలుసుకొని జాతీయ ఎస్సీ కమిషన్ ౖచైర్మన్ కిషోర్ మక్వానా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘అసలా ఆలోచన ఎలా వచ్చింది? ఎందుకు వచ్చి0ది?’ అని పూర్తి వివరాలు ఆరా తీశారు. ఈ ఘటనకు సంబంధించి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చిన వైఎస్సార్‌సీపీ బృందంతో ఆయన సుదీర్ఘంగా మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దుండగుల్ని విడిచి పెట్టేది లేదని స్పష్టం చేశారు. ‘అంబేడ్కర్ విగ్రహం జాతీయ సంపద. దానిపై ఎవరూ దాడి చేయకూడదు. అమానుషంగా ప్రవర్తించకూడదు. ఈ ఘటనపై చర్యలు తీసుకుంటాం’ అని చెప్పారు.
త్వరలోనే ఏపీకి కమిషన్ నుంచి బృందాన్ని పంపి పూర్వాపరాలు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక తెప్పించుకుంటామని తెలిపారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా బాధ్యులపై కఠినంగా చర్యలు తీసుకుంటామని వైఎస్సార్‌సీపీ బృందానికి హామీ ఇచ్చారు. విజయవాడ నడి»ొడ్డున వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అంబేడ్కర్ విగ్రహంపై ఆగస్టు 8న దాడి జరిగిన విషయం విదితమే.
దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి నేతృత్వంలో మాజీ మంత్రులు ఆదిమూలపు సురే‹Ù, మేరుగ నాగార్జున, నందిగం సురేశ్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌లతో కూడిన బృందం బుధవారం ఎస్సీ కమిషన్ చైర్మన్‌తో భేటీ అయింది. ‘అంబేడ్కర్ విగ్రహానికి కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలి. పోలీసుల నిర్లక్ష్యంపై విచారణ జరిపించాలి. త్వరగా దుండగుల్ని పట్టుకొని భవిష్యత్తులో ఇలా జరగకుండా చూడాలి’ అనే మూడు డిమాండ్లతో వినతిపత్రం అందజేసింది.
Comments
Please login to add a commentAdd a comment