ఆగస్టు 25న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు | Celebrities celebrate the birthday on August 25 | Sakshi
Sakshi News home page

ఆగస్టు 25న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

Aug 25 2015 12:02 AM | Updated on Sep 3 2017 8:03 AM

ఆగస్టు  25న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

ఆగస్టు 25న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 5.

ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు:
విజయకాంత్ (నటుడు); రాజీవ్ కపూర్ (నటుడు);
 

ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 5. ఇది  బుధ సంఖ్య కావడం వల్ల మంచి తెలివితేటలు, సమయస్ఫూర్తి, చాకచక్యంతో పెండింగ్ పనులను చకచకా పూర్తి చేసి, కార్యదక్షులుగా పేరు తెచ్చుకుంటారు. పండితులు, పురోహితులు, జ్యోతిష్యులకు ఇది మంచి కాలం. విద్యార్థులకు కోరుకున్న ఇన్‌స్టిట్యూట్లలో కోరుకున్న కోర్సులలో సీట్లు వస్తాయి. పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు. వ్యాపారం నిమిత్తం విదేశీ ప్రయాణాలు చేస్తారు. ఆర్థిక భద్రత, స్నేహ సంబంధాలు పెరిగి కొత్త అవకాశాలు వస్తాయి. ఎంతో అభివృద్ధి సాధిస్తారు. వ్యాపార లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లపై సంతకాలు చేయవలసి వచ్చినప్పుడు విజ్ఞతతో వ్యవహరించకపోతే నష్టం జరిగే అవకాశం ఉంది.

పుట్టిన తేదీ 25 కేతు సంఖ్య కావడం వల్ల దైవకృపతో నీతి నిజాయితీలతో పని చేసి మంచి పేరు తెచ్చుకుంటారు. యోగ, ధ్యానం చేయడం వల్ల మానసికంగా, శారీరకంగా మంచి మార్పు వస్తుంది. ఆధ్యాత్మికోన్నతి కలిగి ఆత్మసాక్షాత్కారం పొందుతారు.
 లక్కీ నంబర్స్: 2,3,5,7; లక్కీ డేస్: సోమ, బుధ, శుక్రవారాలు; లక్కీ కలర్స్: గ్రే, క్రీమ్, వైట్, గ్రీన్, గోల్డెన్, ఎల్లో
 సూచనలు: పేద విద్యార్థులకు పుస్తకాలు దానం చేయడం, గురువులకు, వేదపండితులు, పాష్టర్లు, కాజీలను గౌరవించి, సన్మానం చేయడం, ఆవులకు, కోతులకు ఆహారం పెట్టడం మంచిది.
 - డాక్టర్ మహమ్మద్ దావూద్
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement