Rajeev Kapoor
-
బర్త్‌డే పార్టీ!: మీ సోదరుడు చనిపోయాడు, గుర్తుందా?
ఆల్కహాల్‌కు బానిసైన రాజీవ్ కపూర్ ఫిబ్రవరి 9న ప్రాణాలు విడిచిన విషయం విదితమే. ఆయన చనిపోయి పట్టుమని పది రోజులైనా కాకముందే కుటుంబం అంతా కలిసి రణ్‌ధీర్ కపూర్ బర్త్‌డే సందర్భంగా గెట్ టు గెదర్ ఏర్పాటు చేసింది. ఈ పుట్టినరోజును పురస్కరించుకుని రణ్‌బీర్ కపూర్, అలియాభట్, నీతూ కపూర్, కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్, కరిష్మా కపూర్ సహా పలువురు సెలబ్రిటీలు రణ్‌ధీర్ నివాసానికి వెళ్తూ కెమెరాలకు చిక్కారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొట్టగా చాలామంది నెటిజన్లు నోరెళ్లబట్టారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) "మీ కుటుంబంలో ఒకరు చనిపోయారు. ఆ విషయం మీకు గుర్తుందా?", "రాజీవ్ మరణించి కొద్ది రోజులు కూడా కాలేదు, అయినా వీళ్లు ఎలా వేడుకలు చేసుకుంటున్నారో?" అంటూ నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. మీ సోదరుడు చనిపోయిన వారం రోజులకే పార్టీ ఎలా చేసుకోగలుగుతున్నారని అసహనంతో ఊగిపోతూ కపూర్ ఫ్యామిలీని దారుణంగా ట్రోల్ చేశారు. దీంతో ఈ వార్తలపై రణ్‌ధీర్ కపూర్ స్పందించాడు. "ఇది అందరం కలుసుకున్న ఓ చిన్న సమావేశం లాంటిది. అంతే తప్ప పార్టీ కాదు" అని క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటికీ రాజీవ్ లేడన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నామని, ఆయన మరణం తీరని లోటని పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) కాగా రిషి కపూర్, రణ్‌ధీర్ కపూర్, రాజీవ్ కపూర్ ముగ్గురు సొంత అన్నదమ్ములు. వీరిలో రిషి కపూర్ హీరోగా హిట్టవ్వగా, రణ్‌ధీర్ కపూర్ హీరోగా నిలబడలేకపోయాడు. చిన్నవాడైన రాజీవ్ కపూర్ కూడా హిట్ హీరో కాలేకపోయాడు. చింపూ కపూర్ అని అందరూ పిలిచే రాజీవ్ కపూర్ దర్శకనిర్మాతగానూ విఫలమవడంతో ఇండస్ట్రీకి దూరం అయ్యాడు. చదవండి: మాధురీ దీక్షిత్, సంజయ్‌దత్ లవ్ స్టోరీ.. నెట్టింట్లో సినీతారలు: స్టైల్‌గా ల్యాండైన లైగర్ షారుక్ 'పఠాన్'లో సల్మాన్: క్లారిటీ ఇచ్చిన హీరో చింపూ కపూర్ ఓడి వెళ్లిపోయాడు -
హిట్ హీరో కాలేకపోయాడు.. రెండేళ్లకే విడాకులు
రాజ్‌కపూర్ ముగ్గురు కుమారుల్లో రిషి కపూర్ హీరోగా హిట్ అయ్యాడు. రణ్‌ధీర్ కపూర్ హీరోగా రాణించకపోయినా తన కుమార్తెల వల్ల గుర్తింపు పొందుతున్నాడు. ‘చింపూ కపూర్’ అని అందరూ పిలిచే రాజీవ్ కపూర్ నటుడిగా రాణించలేదు. దర్శకుడిగా, నిర్మాతగా కూడా ఫ్లాప్ అయ్యాడు. ఆల్కహాల్‌కు బానిసయ్యి 58 ఏళ్లకు మంగళవారం (ఫిబ్రవరి 9)న హార్ట్ ఎటాక్‌తో మరణించాడు. ఒక ఇంట పుట్టినవారందరికీ ఒకే రకమైన అదృష్టం దక్కాలని లేదు. కొందరు లేస్తారు. కొందరు పడతారు. పృథ్వీరాజ్ కపూర్‌కు జన్మించిన ముగ్గురు కుమారుల్లో రాజ్ కపూర్ ఒక్కడే వెంటనే హిట్ హీరో అయ్యాడు. షమ్మీ కపూర్, శశికపూర్ చాలా స్ట్రగుల్ చేయాల్సి వచ్చింది. స్ట్రగుల్ చేసి నిలబడ్డారు. కాని రాజ్‌కపూర్‌కు జన్మించిన ముగ్గురు కొడుకుల్లో రిషి కపూర్ ఒక్కడే హిట్ హీరో అయ్యాడు. రణ్‌ధీర్ కపూర్ కాలేకపోయాడు. స్ట్రగుల్ చేసి నిలబడలేకపోయాడు. అలాగే ఆఖరు కొడుకు రాజీవ్ కపూర్ కూడా హిట్ హీరో కాలేకపోయాడు. స్ట్రగుల్ చేసి నిలబడలేకపోయాడు. రాజీవ్ కపూర్‌ను అందరూ చింపూ కపూర్ అని పిలిచేవారు. 20 ఏళ్లు వచ్చేసరికి బాలీవుడ్లో అతన్ని హీరోగా పెట్టి సినిమాలు తీయడం మొదలెట్టారు. అతని మొదటి సినిమా ‘ఏక్ జాన్ హై హమ్’ (1983). ఆ సినిమాలో షమ్మీ కపూర్ అతనికి తండ్రిగా నటించాడు. సినిమాలో రాజీవ్ కపూర్ కూడా అచ్చు షమ్మీ కపూర్లానే ప్రేక్షకులకు కనిపించాడు. షమ్మీ కపూర్‌ను నటనలో అనుకరించడంతో రాజీవ్ కపూర్ మీద షమ్మీ కపూర్ నకలు అనే ముద్రపడింది. దాంతో 1985 లో అతణ్ణి గట్టెక్కించడానికి రాజ్‌కపూర్ రంగంలోకి దిగాడు. తను తీస్తున్న ‘రామ్ తేరి గంగా మైలీ’లో హీరోగా బుక్ చేశాడు. ఆ సినిమాలో మందాకిని హీరోయిన్. పాటలు రవీంద్ర జైన్ చేశాడు. జలపాతంలో అర్ధనగ్నంగా ఛాతీ కనిపించేలా మందాకిని చేసిన పాట దుమారం రేపింది. సినిమా పెద్ద హిట్ అయ్యింది. అంతే కాదు రాజీవ్ కపూర్ మీద ఉన్న షమ్మీ కపూర్ ముద్రను చెరిపేసింది. ఆ తర్వాత రాజీవ్ కపూర్ ‘ఆస్మాన్’, ‘జబర్దస్త్’లాంటి సినిమాలు చేశాడు. ఏవీ ఆడలేదు. ‘హెన్నా’ సినిమా సగంలో ఉండగా రాజ్‌కపూర్ మరణించగా రణ్‌ధీర్ కపూర్ దర్శకత్వం వహించాడు. రాజీవ్ కపూర్ నిర్మాతగా వ్యవహరించాడు. ‘హెన్నా’ హిట్ అయ్యింది. ఆ తర్వాత రాజీవ్ కపూర్ ‘ప్రేమ్‌గ్రంథ్’ సినిమాకు దర్శకత్వం వహించాడు. అది ఫ్లాప్ అయ్యింది. రిషి కపూర్‌ను దర్శకుడుగా పెట్టి ‘ఆ అబ్ లౌట్ చలే’ నిర్మించాడు. అదీ ఆడలేదు. ఆ తర్వాత రాజీవ్ కపూర్ ఇండస్ట్రీకి దూరం అయ్యాడు. రాజీవ్ కపూర్ పూణెలో తన బంగ్లాలో నివసించేవాడు. అతని పెళ్లి ఆర్తి సబర్వాల్ అనే ఆర్కిటెక్ట్‌తో 2001లో జరిగింది. అయితే రెండేళ్లకు మించి ఆ వివాహం నిలువలేదు. 2003లో వాళ్లు డివోర్స్ తీసుకున్నారు. గత సంవత్సరం లాక్డౌన్ వచ్చాక రాజీవ్ కపూర్ ముంబై చెంబూర్‌లోని రణ్‌ధీర్ కపూర్ దగ్గరకు వచ్చి నివసించ సాగాడు. హార్ట్ఎటాక్ వచ్చినప్పుడు రణ్‌ధీర్ కపూరే ఆస్పత్రిలో చేర్చాడు. కాని ఫలితం లేకపోయింది. కపూర్ ఫ్యామిలీని విషాదంలో ముంచుతూ రాజీవ్ కపూర్ వీడ్కోలు తీసుకున్నాడు. చదవండి: ఆమిర్ ఖాన్ అందుకే మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఉత్తరాఖండ్ విలయం.. గొంతెత్తిన దియా మిర్జా -
రాజీవ్ కపూర్ కన్నుమూత
ముంబై : బాలీవుడ్లో మరో విషాదం చోటుచేసుకుంది. నటుడు రిషి కపూర్ సోదరుడు రాజీవ్ కపూర్(58) ముంబైలో మృతి చెందారు. గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన రాజీవ్ కపూర్ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని రిషి కపూర్ భార్య నీతూ కపూర్ వెల్లడించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో రాజీవ్ కపూర్ ఫోటో షేర్ చేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరారు. అదే విధంగా రాజీవ్ మృతిపట్ల అన్నయ్య రణధీర్ సంతాపం ప్రకటించారు. నేను నా తమ్ముడు రాజీవ్‌ను కోల్పోయాను. అతను ఇక లేడు. వైద్యులు తమ వంతు ప్రయత్నించినా తనను రక్షించుకోలేకపోయాం’ అని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా దివంగత నటుడు రాజ్ కపూర్-కృష్ణ కపూర్లకు చిన్న కుమారుడు రాజీవ్ కపూర్. ఇతనికి సోదరులు రణధీర్ కపూర్, రిషి కపూర్.. సోదరీమణులు రీతూ నంద, రీమా కపూర్ ఉన్నారు. రాజీవ్ కపూర్ ‘రామ్ తేరి గంగా మెయిలీ’ చిత్రంలోని నరేంద్ర పాత్రతో ప్రసిద్ది చెందారు. ఈ చిత్రం 1985 సంవత్సరంలో విడుదలైంది. అనంతరం 'ఏక్ జాన్ హై హమ్' (1983) చిత్రంలో నటించారు. రిషి కపూర్ కథానాయకుడిగా నటించిన 'ప్రేమ్ గ్రంథ్'కు దర్శకత్వం వహించారు. కాగా గతేడాది రిషీ కపూర్ క్యాన్సర్‌తో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఏడాది గడవక ముందే తమ్ముడు రాజీవ్ కన్నుమూయడం కపూర్ కుంటుంబానికి తీరాన్ని శోకాన్ని మిగిల్చింది. చదవండి: సాహసం: అఘోరాగా మారిన బాలకృష్ణ! మాధురీ దీక్షిత్‌ను ఫిదా చేసిన యువతి View this post on Instagram A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54) -
ఆగస్టు 25న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: విజయకాంత్ (నటుడు); రాజీవ్ కపూర్ (నటుడు); ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 5. ఇది బుధ సంఖ్య కావడం వల్ల మంచి తెలివితేటలు, సమయస్ఫూర్తి, చాకచక్యంతో పెండింగ్ పనులను చకచకా పూర్తి చేసి, కార్యదక్షులుగా పేరు తెచ్చుకుంటారు. పండితులు, పురోహితులు, జ్యోతిష్యులకు ఇది మంచి కాలం. విద్యార్థులకు కోరుకున్న ఇన్స్టిట్యూట్లలో కోరుకున్న కోర్సులలో సీట్లు వస్తాయి. పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు. వ్యాపారం నిమిత్తం విదేశీ ప్రయాణాలు చేస్తారు. ఆర్థిక భద్రత, స్నేహ సంబంధాలు పెరిగి కొత్త అవకాశాలు వస్తాయి. ఎంతో అభివృద్ధి సాధిస్తారు. వ్యాపార లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లపై సంతకాలు చేయవలసి వచ్చినప్పుడు విజ్ఞతతో వ్యవహరించకపోతే నష్టం జరిగే అవకాశం ఉంది. పుట్టిన తేదీ 25 కేతు సంఖ్య కావడం వల్ల దైవకృపతో నీతి నిజాయితీలతో పని చేసి మంచి పేరు తెచ్చుకుంటారు. యోగ, ధ్యానం చేయడం వల్ల మానసికంగా, శారీరకంగా మంచి మార్పు వస్తుంది. ఆధ్యాత్మికోన్నతి కలిగి ఆత్మసాక్షాత్కారం పొందుతారు. లక్కీ నంబర్స్: 2,3,5,7; లక్కీ డేస్: సోమ, బుధ, శుక్రవారాలు; లక్కీ కలర్స్: గ్రే, క్రీమ్, వైట్, గ్రీన్, గోల్డెన్, ఎల్లో సూచనలు: పేద విద్యార్థులకు పుస్తకాలు దానం చేయడం, గురువులకు, వేదపండితులు, పాష్టర్లు, కాజీలను గౌరవించి, సన్మానం చేయడం, ఆవులకు, కోతులకు ఆహారం పెట్టడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్