Bollywood Actor Rishi Kapoor Brother Rajiv Kapoor Died In Mumbai - Sakshi
Sakshi News home page

బాలీవుడ్‌లో విషాదం.. రాజీవ్‌ కపూర్‌ కన్నుమూత

Published Tue, Feb 9 2021 2:08 PM | Last Updated on Tue, Feb 9 2021 3:10 PM

Rajiv Kapoor Passed Away In Mumbai - Sakshi

ముంబై : బాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. నటుడు రిషి కపూర్‌ సోదరుడు రాజీవ్‌ కపూర్(58)‌ ముంబైలో మృతి చెందారు. గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన రాజీవ్‌ కపూర్‌ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని రిషి కపూర్‌ భార్య నీతూ కపూర్‌ వెల్లడించారు. ఈ సందర్భంగా సోషల్‌ మీడియాలో రాజీవ్‌ కపూర్‌ ఫోటో షేర్‌ చేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరారు. అదే విధంగా రాజీవ్‌ మృతిపట్ల అన్నయ్య రణధీర్‌ సంతాపం ప్రకటించారు. నేను నా తమ్ముడు రాజీవ్‌ను కోల్పోయాను. అతను ఇక లేడు. వైద్యులు తమ వంతు ప్రయత్నించినా తనను రక్షించుకోలేకపోయాం’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా దివంగత నటుడు రాజ్‌ కపూర్-కృష్ణ కపూర్‌ల‌కు చిన్న కుమారుడు రాజీవ్‌ కపూర్‌. ఇతనికి సోదరులు రణధీర్‌ కపూర్‌, రిషి కపూర్‌.. సోదరీమణులు రీతూ నంద, రీమా కపూర్‌ ఉన్నారు. రాజీవ్ కపూర్‌ ‘రామ్‌ తేరి గంగా మెయిలీ’ చిత్రంలోని నరేంద్ర పాత్రతో  ప్రసిద్ది చెందారు. ఈ చిత్రం 1985 సంవత్సరంలో విడుదలైంది. అనంతరం 'ఏక్ జాన్ హై హమ్' (1983) చిత్రంలో నటించారు. రిషి కపూర్ కథానాయకుడిగా నటించిన 'ప్రేమ్ గ్రంథ్'కు దర్శకత్వం వహించారు. కాగా గతేడాది రిషీ కపూర్ క్యాన్సర్‌తో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఏడాది గడవక ముందే తమ్ముడు రాజీవ్‌ కన్నుమూయడం కపూర్ కుంటుంబానికి తీరాన్ని శోకాన్ని మిగిల్చింది. 
చదవండి: సాహసం: అఘోరాగా మారిన బాలకృష్ణ!
 మాధురీ దీక్షిత్‌ను ఫిదా చేసిన యువతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement