సీఎం అభ్యర్థి నేనే | I am Chief Minister Candidate Support Narendra Modi says Vijayakanth | Sakshi
Sakshi News home page

సీఎం అభ్యర్థి నేనే

Published Sat, Oct 25 2014 11:36 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

సీఎం అభ్యర్థి నేనే - Sakshi

సీఎం అభ్యర్థి నేనే

 టీనగర్: తాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేసేందుకు బీజేపీ అధినేత నరేంద్ర మోడీ మద్దతు తెలుపుతారని డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డీఎండీకే జిల్లా కార్యదర్శుల సమావేశం కోయంబేడులోగల పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. సమావేశంలో పార్లమెంటు ఎన్నికల్లో డీఎండీకే వైఫల్యం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రానున్న అసెంబ్లీ ఎన్నికల గురించిన వ్యూహం వంటి వాటిపై చర్చించారు. సమావేశంలో అనేక తీర్మానాలు ప్రవేశపెట్టారు. విజయకాంత్ మాట్లాడుతూ డీఎండీకే కార్యకర్తలు పార్టీ అభివృద్ధి కోసం పని చేయాలని కోరారు.
 
 జిల్లా కార్యదర్శి తమ జిల్లా పరిధిలో గల ప్రాంతాల్లో పార్టీ నాయకులు సమావేశాలను ఏర్పాటు చేయాలని కోరారు. నగర గ్రామ సమస్యలను పరిష్కరించేందుకు సూచనలు అందజేయాలన్నారు. బీజేపీ నాయకులు కొందరు రజనీకాంత్‌ను రాజకీయంలోకి ఆహ్వానిస్తున్నారని అయితే అది విఫలమైందన్నారు. రాష్ట్రంలోను, కేంద్రంలోను బీజేపీతో తమకు సత్ సంబంధాలు ఉన్నాయన్నారు. అందువల్ల బీజేపీ కూటమిలో పొత్తులు కుదుర్చుకుంటామన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థి తాను మాత్రమేనని ఇందులోఎటువంటి మార్పు లేదన్నారు. అవినీతిని అంతమొందించేందుకు, రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చేందుకు మోడి తనకు మద్దతు ప్రకటిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement