సింగపూర్‌కు విజయకాంత్
చెన్నై: డీఎండీకే అధినేత విజయకాంత్‌ను సింగపూర్‌కు తరలించే అవకాశాలు ఉన్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. గత ఏడు రోజులుగా ఆయన పోరూర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయనకు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స సింగపూర్‌లో జరిగినట్టుగా సమాచారం.
ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మేరకు మళ్లీ సింగపూర్‌కు తరలించేందుకు తగ్గ కసరత్తులు సాగుతున్నాయి. ఈ విషయంపై వైద్యులతో ఆయన సతీమణి ప్రేమలత చర్చిస్తున్నట్టుగా సమాచారం. అయితే విజయకాంత్ ఆరోగ్యంగానే ఉన్నారని, ఆందోళన వద్దంటూ ప్రేమలత మీడియాకు వెల్లడించారు. సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఆర్కేనగర్ ఎన్నికల ప్రచారానికి ఆయన వస్తాడని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.